Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

జొహన్నెస్‌బర్గ్‌

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో బోచాసన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయ సముదాయంలో భారత యోగి, 18వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాగి, ఇత్తడితో తయారు చేసిన ఈ విగ్రహం 42 అడుగుల ఎత్తు, 20 టన్నుల బరువు ఉంటుంది.  ఆఫ్రికా ఖండంలోనే 4వ ఎత్తయిన కాంస్య విగ్రహంగా ఇది గుర్తింపు పొందింది. 

Current Affairs

ఫార్మా ఎగుమతులు

2024-25లో దేశీయ ఫార్మా ఎగుమతులు 9.4% వృద్ధితో సుమారు రూ.2.45 లక్షల కోట్ల (30.47 బిలియన్‌ డాలర్ల)కు చేరుకున్నాయని ఫార్మాస్యూటికల్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్‌) 2026, జనవరి 5న తెలిపింది. ప్రస్తుతం రూ.5.41 లక్షల కోట్లు (60 బిలియన్‌ డాలర్లు)గా ఉన్న ఫార్మా మార్కెట్‌ 2030కి రూ.11.72 లక్షల కోట్ల (130 బి.డాలర్ల) స్థాయికి చేరుకుంటుందని అంచనా వెసింది. భారతీయ జనరిక్‌ ఔషధాల ఎగుమతులను అంతర్జాతీయ మార్కెట్లో మరింత బలోపేతం చేసేందుకు ఫార్మెగ్జిల్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో ఫార్మెగ్జిల్‌ ప్రతినిధి బృందం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది.  

Current Affairs

కనకమేడల రవీంద్రకుమార్‌

సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 2026, జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.  రవీంద్రకుమార్‌ 1983లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌కౌన్సిల్‌లో నమోదై న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ విద్యుత్తు బోర్డు, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంల స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు.  2018 నుంచి 2024 వరకు తెలుగు దేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Current Affairs

మనోజ్‌ కొఠారి కన్నుమూత

బిలియర్డ్స్‌ మాజీ ప్రపంచ ఛాంపియన్, 15 ఏళ్లుగా భారత జట్టు కోచ్‌గా ఉన్న మనోజ్‌ కొఠారి (67 ఏళ్లు) 2026, జనవరి 5న కన్నుమూశారు. కోల్‌కతాకు చెందిన ఆయన తమిళనాడు తిరునెల్వేలిలో మరణించారు. మనోజ్‌ 1990లో ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచారు. ఆయన అర్జున అవార్డూ అందుకున్నారు.

Walkins

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ఉద్యోగాలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 21 వివరాలు: 1. రిసోర్స్‌ పర్సన్‌: 02 2. కన్సల్టెంట్‌: 02 3. టీం లీడ్‌: 05 4. వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌: 04 5. సీనియర్‌ ట్రైనర్స్‌: 03 6. డెవోప్స్‌ ఇంజినీర్‌: 01 7. ఫుల్‌స్టాక్‌ ఇంజినీర్‌: 02 8. అసిస్టెంట్‌: 01 9. ఎల్‌ఎంఎస్‌ డెవెలపర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రిసోర్స్‌ పర్సన్‌కు రూ.50,000; కన్సల్టెంట్‌, రూ.2,50,000; టీం లీడ్‌కు రూ.95,000; వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌కు రూ.40,000; సీనియర్‌ ట్రైనర్స్‌, డెవోప్స్‌ ఇంజినీర్‌, ఫుల్‌స్టాక్‌ ఇంజినీర్‌, ఎల్‌ఎంఎస్‌ డెవెలపర్‌ పోస్టులకు రూ.65,000; అసిస్టెంట్‌కు రూ.25,000. ఇంటర్వ్యూ తేదీ: 16.01.2026. వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎన్‌ఐఈఎల్‌ఐటీ భవణ్‌, ప్లాట్‌ నెం.3, ద్వారక, న్యూదిల్లీ. Website:https://www.nielit.gov.in/chennai/recruitments

Government Jobs

టీసీఐఎల్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బిహార్ (టీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 25 వివరాలు: 1. ప్రాజెక్ట్ మేనేజర్ - 01 2. ఆపరేషన్ లీడ్ - 03 3. ఇంజినీర్ ఎల్ -3 స్పెషలిస్ట్ - 03 4. పోర్టల్ అడ్మినిస్ట్రేటర్  - 01 5. ఇంజినీర్ ఎల్ -2 నెట్‌వర్క్ & మానిటరింగ్ - 06 6. హెల్ప్‌డెస్క్ ఇంజినీర్ - 06 7. వీడియో కాన్ఫరెన్సింగ్ కోఆర్డినేటర్ - 04 8. స్టోర్ ఇన్‌ఛార్జ్ - 01 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 33 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.22,546. - రూ.1,80,370. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఈడి (డిటి) నెం. 501, టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, టిసిఐఎల్ భవన్, గ్రేటర్ కైలాష్ -I, దిల్లీ  - 110048 దరఖాస్తు చివరి తేదీ: 09.01.2026.  Website:https://www.tcil.net.in/current_opening.php

Government Jobs

సౌత్ ఈస్ట్రన్‌ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు

కోల్‌కతాలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- సౌత్ ఈస్ట్రన్‌ రైల్వే 2025-26 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 54. వివరాలు: 1. గ్రూప్‌-సి (లెవెల్‌-4, లెవెల్‌-5): 05 2. గ్రూప్‌-సి (లెవెల్‌-2/3): 16 3. గ్రూప్‌-డి (లెవెల్‌-1): 33 అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ, పన్నెండో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్ తదితరాలు. వయోపరిమితి: 01/01/2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10-01-2026. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09-02-2026. Website:https://rrcser.co.in/notice.html

Government Jobs

ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో ఫ్యాకల్టీ పోస్టులు

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ఐటీ డీఎం) తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: ప్రొఫెసర్‌: 04 అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 03 అసిస్టెంట్‌ ప్రొపెసర్: 03 అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు; ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.500. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-01-2026. Website:https://iiitk.ac.in/

Government Jobs

సీఈఈఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

రాజస్తాన్‌ పిలానీలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఈఈఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు:  1. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 02 2. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-III/I: 02 3. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (పీఏటీ/పీఏటీ-I/II): 03 అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-Iకు ఏళ్లు 28 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14-01-2026. Website:https://www.ceeri.res.in/

Government Jobs

ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో నర్స్‌ ఉద్యోగాలు

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 41  వివరాలు: 1. రిసెర్చ్‌ ఆఫీసర్‌ - 03 2. రిసెర్చ్ నర్స్‌ - 37 3. ఫీల్డ్‌ వర్కర్‌ - 01 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్ /ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రిసెర్చ్ ఆఫీసర్‌కు  రూ.65,000. రిసెర్చ్ నర్స్‌కు రూ.30,600.  ఫీల్డ్ వర్కర్‌ కు రూ.25,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 19.01.2026.  Website:https://www.aiimsraipur.edu.in/user/vacancies-faculty.php?pst=intraextra