Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు పినాక ఆధునికీకరణ పనులు

భారత సైన్యానికి చెందిన మొదటి తరం ‘పినాక మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ (ఎంఎల్‌ఆర్‌ఎస్‌)’, బ్యాటరీ కమాండ్‌ పోస్టులను ఆధునికీకరించేందుకు, మరమ్మతులు చేసే పనులను టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏసీఎల్‌) దక్కించుకుంది. 2026, జనవరి 6న దిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారత సైన్యం నుంచి ఈ ఆర్డర్‌ అందుకున్నట్లు టీఏసీఎల్‌ తెలిపింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో భాగంగా, సైన్యంలోని 510 అడ్వాన్స్‌ బేస్‌ వర్క్‌షాప్‌ (ఏబీడబ్ల్యూ), టాటా సంస్థ సంయుక్తంగా పనిచేయనున్నాయి. 

Current Affairs

మిజోరంలో కొత్తరకం రెల్లుజాతి పాము

రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి మిజోరం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఓ కొత్తరకం రెల్లు జాతి పామును గుర్తించారు. భారత సరీసృప జంతుజాల వర్గీకరణలో చాలాకాలంగా ఉన్న తప్పులను సరిచేసి, కొత్త రకం జాతులను చేర్చడం కోసం చేపట్టిన పరిశోధనల్లో దీన్ని గుర్తించారు. ఈ పాము విషపూరితం కాదని తెలిపారు. దీనికి కలమారియా మిజోరమెన్సిస్‌ అని నామకరణం చేశారు. పామును కనుగొన్న రాష్ట్రానికి గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.

Current Affairs

‘భైరవ్‌’

శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం ‘భైరవ్‌’ పేరుతో కొత్తగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. లక్ష మందికి పైగా ‘డ్రోన్‌ ఆపరేటర్ల’తో ఈ భారీ మానవ సైన్యాన్ని తయారుచేసింది. భైరవ్‌ దళ ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉంది. ఇది సాధారణ దళానికి, పారా స్పెషల్‌ ఫోర్సెస్‌కు మధ్య వారధిలా పనిచేస్తుంది.  ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అందుకే ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్‌ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు శత్రువుల భూభాగంలోకి చొరబడి, వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో కచ్చితత్వంతో దెబ్బకొట్టగలరు. అత్యంత వేగంగా, దూకుడుగా దాడులు చేయడం వీరి ప్రత్యేకత. 

Current Affairs

సాహిత్య సంపుటాలు విడుదల

దేశంలోని వివిధ ప్రాచీన భాష అధ్యయన పీఠాలు ప్రచురించిన సాహిత్య సంపుటాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2026, జనవరి 6న దిల్లీలో విడుదల చేశారు. నెల్లూరులోని తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం ప్రచురించిన ఎనిమిది గ్రంథాలు అందులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. వైద్యం వెంకటేశ్వరాచార్యులు రచించిన ‘చిత్రకవిత్వ దర్పణం’, మొట్టమొదటి తెలుగు చందోగ్రంథం కవిజనాశ్రయంకు ప్రొఫెసర్‌ బి.వెంకటేశ్వర్లు తెలుగులో, ప్రొఫెసర్‌ ఆర్‌వీ సుందరం ఇంగ్లిష్‌లో రాసిన వ్యాఖ్యానాలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తమిళంలోకి అనువదించిన 15వ శతాబ్దానికి చెందిన క్రీడాభిరామం, డాక్టర్‌ గీతా నావల్‌ కన్నడంలోకి అనువదించిన అన్నమయ్య ‘సంకీర్తన లక్షణం’, డాక్టర్‌ రమేష్‌ రాసిన మల్లు పురాణం, రత్నావళి పరిణయం, డాక్టర్‌ టీఎస్‌ వెంకటేష్‌ రచించిన హరిచంద్రోపాఖ్యానాలను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. 

Current Affairs

హరియాణాలో హైడ్రోజన్‌ రైలు

భారత్‌లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును హరియాణా ప్రారంభించనుంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జింద్‌-సోనిపత్‌ మధ్య నడుస్తుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్‌లో హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ప్రారంభం, నిర్వహణ దశలకు 11 కేవీల విద్యుత్‌ సరఫరాను ఈ ప్లాంట్‌ అంతరాయం లేకుండా అందించనుంది. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు. 

Walkins

ఎయిమ్స్‌ రాయ్‌బరేలిలో సీనియర్ రెసిడెంట్‌ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), రాయ్‌బరేలి తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: జూనియర్ రెసిడెంట్‌: 103 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.67,700. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 9, 23, ఫిబ్రవరి 6, 20.  వేదిక: ఎయిమ్స్‌ రాయ్‌బరేలీ, మెడికల్ కాలేజీ. Website:https://aiimsrbl.edu.in/recruitments

Private Jobs

మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ పోస్టులు

మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రొడక్ట్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  వివరాలు: పోస్ట్: ప్రిన్సిపల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌-ll   కంపెనీ: మైక్రోసాఫ్ట్. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్‌/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌ లేదా ఎల్‌ఎల్‌ఎం, జేన్‌ఏఐ సిస్టమ్‌ అనుభవం, కమ్యూనికేషన్‌ తదితరాల నైపుణ్యాలు ఉండాలి. జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. చివరి తేదీ: 12.1.2026 Website:https://apply.careers.microsoft.com/careers?start=0&location=Hyderabad%2C+TS%2C+India&pid=1970393556654592&sort_by=distance&filter_distance=160&filter_include_remote=1

Internship

డీఆర్‌డీఓ-డీఐపీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీఓ - డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకలాజికల్‌  రిసెర్చ్‌ (డీఐపీఆర్‌)  ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 8 వివరాలు: సైకాలజీ: 06 ఖాళీలు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌: 02 ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు. అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, పీజీ చివరి ఏడాది చదువున్న అభ్యర్థులు.  స్టైపెండ్‌: నెలకు 5,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్, డీఐపీఆర్‌, లఖ్‌నవూ రోడ్‌, దిల్లీ చిరునామాకు పంపించాలి.. దరఖాస్తు చివరి తేదీ: 25.01.2026. Website:https://drdo.gov.in/drdo/en

Government Jobs

ఎన్‌ఐటీ కాలికట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కాలికట్‌ (ఎన్‌ఐటీసీ) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పోస్టుల దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II - 15 విభాగాలు: ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోసైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్,  కెమిస్ట్రీ తదితర విభాగాలు.....   అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 20. Website:https://nitc.ac.in/noticeboard/recruitments

Government Jobs

కేజీబీవీల్లో బోధనేతర సిబ్బంది పోస్టులు

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2026 విద్యా సంవత్సరానికి బోధనేతర సిబ్బందిని (టైప్‌-III: 564, టైప్‌-IV: 531) భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలను జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్‌ (పొరుగుసేవల) ప్రాతిపదికన, వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూల ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపడతారు.  మొత్తం పోస్టుల సంఖ్య: 1,095  వివరాలు: టైప్-III ఖాళీలు: 1. ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 77 పోస్టులు 2. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్- 134 3. ఏఎన్‌ఎం- 110 4. అకౌంటెంట్‌- 11 పోస్టులు 5. అటెండర్: 28 పోస్టులు 6. హెడ్ కుక్- 22 7. అసిస్టెంట్ కుక్- 89 8. డే వాచ్ ఉమెన్- 18 9. నైట్ వాచ్ ఉమెన్- 26 10. స్కావెంజర్- 33 11. స్వీపర్- 16 టైప్-IV ఖాళీలు: 1. వార్డెన్‌: 86 పోస్టులు 2. పార్ట్‌-టైం టీచర్‌: 122 పోస్టులు 3. చౌకీదార్: 77 పోస్టులు 4. హెడ్‌కుక్‌: 76 పోస్టులు 5. అసిస్టెంట్‌ కుక్‌: 170 పోస్టులు అర్హతలు: హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్, చౌకిదార్, అటెండర్ వంటి పోస్టులకు ప్రత్యేక విద్యార్హత తప్పనిసరి కాదు. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌/డిగ్రీ+ కంప్యూటర్‌ కోర్స్‌, వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌కు టెన్త్‌, సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికేట్‌, ఏఎన్‌ఎంకు ఇంటర్‌+ఏఎన్‌ఎం శిక్షణ, వార్డెన్‌కు/పార్ట్‌టైం టీచర్‌కు డిగ్రీ+బీఎడ్/ఎంఏ ఉత్తీర్ణత ఉండాలి. వయో పరిమితి: 01-07-2025 నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. మెరిట్‌, రిజర్వేషన్‌, లోకల్ క్యాండిడేట్ ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక ఉంటుంది. జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత జిల్లా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో నేరుగా అందజేయాలి.  రిక్రూట్‌మెంట్ షెడ్యూల్: నోటిఫికేషన్ విడుదల తేదీ: 05-01-2026. ఏపీసీ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ: 06-01-2026 నుంచి 20-01-2026 వరకు. మండలాల వారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా తయారీ: 23-01-2026. అభ్యర్థుల తొలి జాబితా లిస్ట్‌: 28.01.2026. తుది జాబితా లిస్ట్‌: 04.02.2026. ఇంటర్వ్యూ తేదీ: 05.02.2026. Website:https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/