Posts

Government Jobs

మహేశ్వరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఉద్యోగాలు

ప్రభుత్వ మెడికల్ కళాశాల మహేశ్వరం రంగారెడ్డి జిల్లా ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 63 వివరాలు: 1. ల్యాబ్‌ అటెండెంట్‌: 13 2. రిఫ్రాక్షనిస్ట్‌/ఆప్టీషియన్‌: 01 3. రేడీయోగ్రాఫిక్‌ టెక్నీషియన్‌: 04 4. ఓటీ టెక్నీషియన్‌: 04 5. అనస్థీషియా టెక్నీషియన్‌: 04 6. డెంటల్‌ టెక్నీషియన్‌: 01 7. బ్లడ్ బ్యాంక్‌ టెక్నీషియన్‌: 04 8. రికార్డ్‌ క్లర్క్‌/ రికార్డ్‌ అసిస్టెంట్: 01 9. కాటలొగర్‌: 01 10. మ్యూసియం అసిస్టెంట్ కమ్‌ ఆర్టిస్ట్‌: 01 11. ఆడియో విజువల్ టెక్నీషియన్‌: 01 12. వార్డ్‌ బాయ్‌: 04 13. దోబి/ప్యాకర్స్‌:  14. కార్పెంటర్‌: 01 15. బార్బర్‌: 03 16. టైలర్‌: 01 17. ఎలక్ట్రీషియన్‌: 03 18. ప్లంబర్‌: 02 19. థియేటర్‌ అసిస్టెంట్: 06 20. గ్యాస్‌ ఆపరేటర్‌: 02 21. ఈసీజీ టెక్నీషియన్‌: 03 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ,  ఎంఎల్‌టీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 - 46 ఏళ్లు. జీతం: నెలకు రూ.15,600 - రూ.22,750. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మేరిట్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 10. చిరునామా: ఆఫీస్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, మహేశ్వరం, బీఐఈటీ క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. Website:https://rangareddy.telangana.gov.in/recruitment-for-filling-up-of-certain-posts-on-out-sourcing-basis-in-government-medical-college-government-general-hosiptal-maheshwaram-ranga-reddy-district/

Government Jobs

ఏపీహెచ్‌సీలో ఉద్యోగాలు

హైకోర్టు ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీహెచ్‌సీ) వివిధ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్, ఎగ్జామినర్‌ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 1620 వివరాలు: 1. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3: 80 2. జూనియర్‌ అసిస్టెంట్: 230 3. టైపిస్ట్‌: 162 4. ఫీల్డ్‌ అసిస్టెంట్: 56 5. ఎగ్జామినర్‌: 32 6. కాపీయిస్ట్‌: 193 7. డ్రైవర్‌(లైట్‌ వెహికిల్‌): 28 8. రికార్డ్‌ అసిస్టెంట్: 24 9. ప్రాసెస్‌ సర్వర్‌: 164 10. ఆఫీస్‌ సబార్డినేట్‌: 651 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్‌, టెన్త్‌, 7వ తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 జులై 1వ తేదీ నాటికి 18 - 42 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు స్టెనోగ్రాఫర్‌కు రూ.34,580 - రూ.1,07,210, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు రూ.25,200 - రూ.80,910, ఆఫీస్‌ సబార్డినేట్‌కు రూ.20,000 - రూ.61,960, మిగాతా పోస్టులకు రూ.23,380 - రూ.76,730. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2025 మే 13. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 2. Website:https://aphc.gov.in/recruitments.php

Government Jobs

Jobs In IDBI Bank

IDBI Bank Limited (IDBI BANK) is inviting applications for the Junior Assistant Manager posts in various branches across the country.  No. of Posts: 676 Details: Junior Assistant Manager (JAM) Grade-O Qualification: Degree in the relevant discipline with 60% marks as per the post and computer knowledge.  Age limit: 20 - 25 years. Selection Process: Based on Written Test, Interview, Medical Test. Application Fee: Rs. 1050 for General, OBC, EWS candidates, Rs. 250 for SC, ST, PWBD candidates. Application process: Online. Last date of application: 20th May 2025. Website:https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx

Government Jobs

Jobs in Maheshwaram Government Medical College

Government Medical College Maheshwaram Rangareddy District (GMC) is inviting applications for the filling of following posts in various departments on outsourcing basis. Number of Posts: 63 Details: 1. Lab Attendant: 13 2. Refractologist/Optician: 01 3. Radiographic Technician: 04 4. OT Technician: 04 5. Anaesthesia Technician: 04 6. Dental Technician: 01 7. Blood Bank Technician: 04 8. Record Clerk/ Record Assistant: 01 9. Cataloger: 01 10. Museum Assistant cum Artist: 01 11. Audio Visual Technician: 01 12. Ward Boy: 04 13. Dobi/Packers:  14. Carpenter: 01 15. Barber: 03 16. Tailor: 01 17. Electrician: 03 18. Plumber: 02 19. Theatre Assistant: 06 20. Gas Operator: 02 21. ECG Technician: 03 Qualification: Degree, Diploma, TENT, ITI, MLT in the relevant discipline as per the posts along with work experience. Age Limit: 18 - 46 years. Salary: Rs.15,600 - Rs.22,750 per month. Application Fee: Rs. 200 for General, OBC candidates, Rs. 100 for SC, ST candidates. Selection Process: Based on merit in educational qualifications. Last Date of Offline Application: May 10, 2025. Address: Office of the Principal, Government Medical College, Maheshwaram, BEET Campus, Ibrahimpatnam, Rangareddy District. Website:https://rangareddy.telangana.gov.in/recruitment-for-filling-up-of-certain-posts-on-out-sourcing-basis-in-government-medical-college-government-general-hosiptal-maheshwaram-ranga-reddy-district/  

Government Jobs

Court Jobs In AP

The High Court of Andhra Pradesh (APHC) has released a notification for the vacant posts of Junior Assistant, Stenographer, Typist, Field Assistant, Examiner etc. in various departments.  Number of Posts: 1620 Details: 1. Stenographer Grade-3: 80 2. Junior Assistant: 230 3. Typist: 162 4. Field Assistant: 56 5. Examiner: 32 6. Copyist: 193 7. Driver (Light Vehicle): 28 8. Record Assistant: 24 9. Process Server: 164 10. Office Subordinate: 651 Qualification: Degree, Inter, Tenth, 7th class pass in the relevant discipline as per the posts.  Age Limit: Must be 18 - 42 years as on July 1, 2025. Salary: Rs.34,580 - Rs.1,07,210 per month for Stenographer, Rs.25,200 - Rs.80,910 for Junior Assistant, Typist, Field Assistant, Rs.20,000 - Rs.61,960 for Office Subordinate, Rs.23,380 - Rs.76,730 for other posts. Application Fee: Rs. 800 for General, OBC, EWS candidates, Rs. 400 for SC, ST candidates. Selection Process: Based on Written Test. Application Process: Online. Application Start Date: May 13, 2025. Application Last Date: June 2, 2025. Website:https://aphc.gov.in/recruitments.php

Current Affairs

సాగర గర్భంలో పేలుడు పరీక్ష విజయవంతం

భారత రక్షణ విభాగాలు సముద్రం అడుగు భాగాన జరిపిన ‘మల్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌ గ్రౌండ్‌ మైన్‌ (ఎంఐజీఎం) పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ వర్గాలు 2025, మే 6న తెలిపాయి. స్వల్ప పరిమాణంలో పేలుడు పదార్థాలతో సముద్ర జలాల అంతర్భాగంలో పేలుడు జరపడం వీటి ప్రత్యేకత. దీన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నౌకాదళాలు సంయుక్తంగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశాయి. 

Current Affairs

భారత వృద్ధి 6.3 శాతమే

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.5% నుంచి 6.3 శాతానికి మూడీస్‌ రేటింగ్స్‌ తగ్గించింది. అమెరికా వాణిజ్య విధానాల్లో అనిశ్చితి, టారిఫ్‌ల వల్ల ప్రపంచ దేశాల వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల వల్లా భారత వృద్ధిపై ప్రభావం చూపుతుందని తెలిపింది. 2026-27 వృద్ధి అంచనాలను 6.5 శాతంగా సంస్థ కొనసాగించింది. వృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఆర్‌బీఐ మరిన్ని రేట్ల కోతలు విధించొచ్చని అభిప్రాయపడింది.

Current Affairs

భారత్, బ్రిటన్‌ మధ్య ఒప్పందం

భారత్, బ్రిటన్‌ మధ్య 2025, మే 6న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. దీంతో భారత్‌ నుంచి కార్మికులు అధికంగా పనిచేసే తోలు వస్తువులు, పాదరక్షలు, దుస్తులు, ప్రాసెస్డ్‌ ఆహారోత్పత్తుల లాంటి ఎగుమతులకు ఊతం లభించనుంది. బ్రిటన్‌ నుంచి విస్కీ, కార్లు, వైద్య పరికరాల దిగుమతి చౌకగా మారనుంది. తాజా ఎఫ్‌టీఏ కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం 2030 కల్లా 120 బి. డాలర్లకు చేరొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2022 జనవరి నుంచి 14 దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. భారత్, బ్రిటన్‌ దేశాలు ప్రస్తుతం ప్రపంచంలో అయిదో, ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలగా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఎఫ్‌టీఏతో పాటు డబుల్‌ కాంట్రిబ్యూషన్‌ కన్వెన్షన్‌ (డీసీసీ)/సామాజిక భద్రతా ఒప్పందం కూడా కుదిరింది.

Current Affairs

మానవాభివృద్ధి సూచీ 2023

మానవాభివృద్ధి సూచీ 2023లో భారత్‌ 130వ స్థానంలో నిలిచినట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమ (యూఎన్‌డీపీ) మానవాభివృద్ధి నివేదిక 2025, మే 6న వెల్లడించింది. ఈ సూచీలో మొత్తం 193 దేశాలున్నాయి. 2022లో మన దేశం 133వ స్థానంలో ఉంది.  2022లో అసమానతల కారణంగా భారత్‌లో మానవాభివృద్ధి 30.7 శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. దేశంలో వైద్య, విద్య రంగాల్లో అసమానతలు మెరుగుపడినా ఆదాయ అసమానతలు, లింగ వివక్ష గణనీయంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. శ్రామిక వర్గంలో మహిళల భాగస్వామ్యం, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం వంటి విషయాల్లో దేశం వెనుకబడి ఉంది. 

Current Affairs

జర్మనీ ఛాన్స్‌లర్‌గా ఫ్రెడరిక్‌ మెర్జ్‌

జర్మనీ ఛాన్స్‌లర్‌గా మితవాద నేత ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఎన్నికయ్యారు. దేశ దిగువ సభ బుందెస్టాగ్‌లో 2025, మే 6న జరిగిన ఓటింగులో ఆయన విజయం సాధించారు. ఆనవాయితీ ప్రకారం జర్మనీ దేశాధ్యక్షుడు బుందెస్టాగ్‌లోని పార్లమెంటరీ పార్టీలన్నింటినీ సంప్రదించాక ఛాన్స్‌లర్‌ పదవికి అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇలా ప్రకటించిన అభ్యర్థి బుందెస్టాగ్‌లోని మొత్తం 630 మంది సభ్యులకుగాను 316 మంది మద్దతు పొందాలి. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతుంది. ఈసారి అధ్యక్షుడు ఛాన్స్‌లర్‌ అభ్యర్థిగా ప్రకటించిన ఫ్రెడరిక్‌ మెర్జ్‌ తొలుత 310 ఓట్లే పొందగలిగారు. రెండోసారి జరిగిన ఓటింగులో ఆయన 325 ఓట్లు పొందారు.