Posts

Current Affairs

Union Budget 2025-26

♦ CRISIL report said on 6 March 2025, India’s real GDP growth is expected to remain steady at 6.5 percent for the 2026 fiscal. ♦ The credit rating agency’s forecast depends on two major factors: a normal monsoon and stable commodity prices, both of which are expected to keep food inflation in check. ♦ The agency predicted that cooling food inflation, tax benefits from the Union Budget 2025-26, and lower borrowing costs will boost discretionary consumer spending. ♦ The report also noted that India’s economic growth would gradually return to pre-pandemic levels as the impact of fiscal stimulus will fade and the high-base effect subsides.

Current Affairs

Honorary Order of Freedom of Barbados

♦ Prime Minister Narendra Modi conferred with the prestigious 'Honorary Order of Freedom of Barbados' award in recognition of his "strategic leadership" and "valuable assistance" during the Covid-19 pandemic. ♦ Union Minister of State for External Affairs Pabitra Margherita accepted the award on behalf of Narendra Modi on 6 March 2025. ♦ The award was presented by Barbados President Dame Sandra Mason.

Current Affairs

Ajay Bhadoo

♦ Ajay Bhadoo was appointed as the Chief Executive Officer (CEO) of the Government e-Marketplace (GeM). ♦ He is currently the Additional Secretary in the Department of Commerce. ♦ Ajay is an Indian Administrative Service (IAS) officer of the 1999 batch from the Gujarat cadre.  ♦ The Government e-Market (GeM) portal was launched on 9 August 2016, for all central government ministries and departments' online purchases of goods and services.

Current Affairs

బ్యాంకర్ల సమితి నివేదిక

తెలంగాణలో 2023 డిసెంబరు 31 నాటి గణాంకాలతో పోలిస్తే.. 2024 డిసెంబరు 31 నాటికి అన్ని ఖాతాల్లో కలిపి బ్యాంకు డిపాజిట్లు ఏకంగా రూ.60 వేల కోట్లు పెరిగి ఆ మొత్తం రూ.8.16 లక్షల కోట్లు దాటినట్లు బ్యాంకర్ల సమితి తాజా నివేదిక పేర్కొంది. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద రాష్ట్రంలో 1.22 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలున్నాయి. వాటిలో 71.48 లక్షలు మహిళలవి.. మిగిలినవి పురుషులవి. 20.74 లక్షల జన్‌ధన్‌ ఖాతాల్లో పైసా కూడా డిపాజిట్‌ లేదు. మిగిలిన 1.02 కోట్ల ఖాతాల్లో రూ.4,768 కోట్లు డిపాజిట్లుగా ఉన్నాయి. 

Current Affairs

మహిళా ఉద్యోగులకు ఒక రోజు నెలసరి సెలవు

మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వనున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. దేశంలో ఇటువంటి సెలవును దిగ్గజ కార్పొరేట్‌ సంస్థ ప్రకటించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఛైర్మన్, ఎండీ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ తెలిపారు.  ప్రస్తుతం ఎల్‌ అండ్‌ టీలో మొత్తం 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 9% (5000) మంది మహిళలు. 

Current Affairs

ఎన్‌ఎండీసీ పూర్తిస్థాయి సీఎండీగా అమితవ ముఖర్జీ

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టరు (సీఎండీ)గా అమితవ ముఖర్జీ 2025, మార్చి 6న పదవీ బాధ్యతలు చేపట్టారు. 2023 మార్చి నుంచి ఇప్పటి వరకు ఆయన అదనపు ఛార్జితో సీఎండీ బాధ్యతలు నిర్వహించారు. తాజాగా పూర్తిస్థాయి సీఎండీగా నియమితులయ్యారు.  ఐఆర్‌ఎస్‌ఏ (ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌) 1996 బ్యాచ్‌కు చెందిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో, ఎన్‌ఎండీసీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 

Current Affairs

మోదీకి బార్బడోస్‌ ఉన్నత పురస్కారం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్‌ దేశం ప్రతిష్ఠాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రీడం ఆఫ్‌ బార్బడోస్‌’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొవిడ్‌ కాలంలో అమూల్య సేవలు, సమర్థ నాయకత్వం అందించినందుకు ఇది అందించినట్లు పేర్కొంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో ప్రధాని తరఫున మన దేశ విదేశాంగశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గేరిటా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.  ఈ పురస్కారాన్ని మోదీకి ఇవ్వనున్నట్లు బార్బడోస్‌ ప్రధాని మైయా అమోర్‌ మోట్లీ 2024, నవంబరు 20న ప్రకటించారు.

Current Affairs

వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన వాట్సప్‌ గవర్నెన్స్‌లో సేవలు 2025, మార్చి 6 నాటికి 200కు చేరాయి. జనవరి 30న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ 161 రకాల సేవలతో మనమిత్రను ప్రారంభించారు. 50 రోజుల్లోనే సేవలను పెంచారు. ప్రజలకు సౌలభ్యంతో పాటు పాలనలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో 2024 అక్టోబరులో మెటా ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇటీవల పది, ఇంటర్‌ విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వాట్సప్‌ ద్వారా పొందగలిగారు. ప్రజలు వివిధ రకాల పౌరసేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేకుండా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

Current Affairs

జీఎస్‌టీ ఆదాయ విశ్లేషణపై కమిటీ

జీఎస్‌టీ ఆదాయ విశ్లేషణపై ఏర్పాటైన మంత్రుల బృందాన్ని (జీఓఎం) జీఎస్‌టీ మండలి పునర్‌వ్యవస్థీకరించింది. జీఎస్‌టీ వసూళ్లకు సంబంధించి విధానపరమైన జోక్యం అవసరమైనప్పుడు జీఓఎం సూచనలు చేస్తుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ నేతృత్వంలోని ఈ మంత్రుల బృందంలో మొత్తం 9 మంది సభ్యులు- మల్లు భట్టి విక్రమార్క (తెలంగాణ), పయ్యావుల కేశవ్‌ (ఆంధ్రప్రదేశ్‌), సామ్రాట్‌ చౌధరీ (బిహార్‌), ఓపీ చౌధరీ (ఛత్తీస్‌గఢ్‌), కనుభాయ్‌ దేశాయ్‌ (గుజరాత్‌), అజిత్‌ పవార్‌ (మహారాష్ట్ర), హర్పాల్‌ సింగ్‌ చీమా (పంజాబ్‌), థంగం తెన్నెరసు (తమిళనాడు) ఉండనున్నారు. రాష్ట్రాల వారీగా జీఎస్‌టీ వసూళ్లు, రాబడి తీరును ఈ జీఓఎం గుర్తిస్తుంది.    

Walkins

సీఎస్ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్ టెక్నాలజీలో పోస్టులు

హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు అసోసియేట్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. ప్రాజెక్టు అసోసియేట్-1: 01 2. సీనియర్ ప్రాజెక్టు ఆసోసియేట్: 02 3. ప్రాజెక్టు అసోసియేట్‌-2: 04 4. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్‌-3: 03 5. ప్రాజెక్టు అసిస్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 20 మార్చి 2025 తేదీ నాటికి సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు నిండి ఉండాలి.  జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.42,000, ప్రాజెక్టు అసోసియేట్-2కు రూ.28,000, ప్రాజెక్టు అసిస్టెంట్‌కు రూ.20,000, ప్రాజెక్టు అసోసియేట్-1కు రూ.25,000, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-3కు రూ.28,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: మార్చి 20 వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ, హదరాబాద్‌-500007. Website:https://www.iict.res.in/HOME