Posts

Current Affairs

Ministry of Defence

♦ The Ministry of Defence has signed a $248 million (Rs.2,156 crores) contract with Russia’s Rosoboronexport (RoE) for the procurement of 1,000 horsepower (HP) engines for T-72 tanks on 7 March 2025. ♦ The deal includes the supply of engines in fully formed, completely knocked down, and semi knocked down conditions. ♦ As part of the agreement, Rosoboronexport will transfer technology to Armoured Vehicles Nigam Limited (Heavy Vehicle Factory) in Avadi, Chennai. ♦ This will facilitate the integration and licensed production of the engines in India, supporting the “Make in India” initiative in the defence sector. ♦ The Indian Army’s T-72 tanks, currently powered by 780 HP engines, serve as the backbone of the country’s armored fleet.

Current Affairs

టీహబ్‌ నూతన సీఈఓగా కవికృత్‌

హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం టీహబ్‌ కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా కవికృత్‌ 2025, మార్చి 7న నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన కవికృత్‌ హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ, బిట్స్‌ పిలాని నుంచి ఫైనాన్స్‌లో ఎంఎస్సీ పూర్తి చేశారు. హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అమెజాన్, పిరమల్‌ వంటి సంస్థల్లో పనిచేశారు. ఇటీవలి వరకు ఓయో సంస్థ చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ సంస్థ 100కుపైగా నగరాల్లో విస్తరించడంలో, జపాన్‌లో ప్రవేశించడంలో కీలకపాత్ర పోషించారు. 

Current Affairs

టి-72 యుద్ధ ట్యాంకులు

భారత సైన్యంలోని టి-72 యుద్ధ ట్యాంకులకు శక్తిమంతమైన ఇంజిన్లు అమర్చనున్నారు. వీటి కొనుగోలు కోసం రష్యాకు చెందిన రోసోబోరాన్‌ ఎక్స్‌పోర్ట్‌తో రూ.2,156 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ 2025, మార్చి 7న తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా 1,000 హెచ్‌పీ ఇంజిన్లను, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా సరఫరా చేస్తుంది. చెన్నైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్మర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఈ టెక్నాలజీని అందుకుంటుంది. టి-72 ట్యాంకులు ప్రస్తుతం 780 హెచ్‌పీ ఇంజిన్లతో నడుస్తున్నాయి. వీటిని మెరుగుపరచడం వల్ల యుద్ధరంగంలో ఇవి మరింత చురుగ్గా కదులుతాయి.

Current Affairs

ప్రపంచ జూనియర్‌ చెస్‌

బెంగళూరుకు చెందిన ప్రణవ్‌ వెంకటేష్‌ ప్రపంచ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ (అండర్‌-20) సాధించాడు. 2025, మార్చి 7న మాంటెనెగ్రోలోని పెట్రోవాచ్‌లో జరిగిన టోర్నీలో చివరిదైన 11వ రౌండ్లో ప్రణవ్‌.. మాటిచ్‌ లెవ్రెనిచ్‌ (స్లొవేనియా)తో గేమ్‌ను డ్రా చేసుకుని టైటిల్‌ అందుకున్నాడు. అతడు 7 విజయాలు, 4 డ్రాలతో మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.  భారత్‌ నుంచి ఇంతకుముందు ఓపెన్‌ విభాగంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్‌ గుప్తా (2008) జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. 17 ఏళ్ల విరామం తర్వాత ప్రణవ్‌ ఈ ఘనతను అందుకున్నాడు. 

Current Affairs

హెచ్‌పీసీఎల్‌ సీఎండీగా వికాస్‌ కౌశల్‌

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కొత్త ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా వికాస్‌ కౌశల్‌ 2025, మార్చి 7న నియమితులయ్యారు. ఆయన అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కౌశల్, ఇంతకు ముందు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ కీర్నేలో గ్లోబల్‌ లీడర్‌ (ఇంధన, ప్రాసెస్‌ ఇండస్ట్రీస్‌)గా పనిచేశారు. కీర్నే ఇండియా కంట్రీ హెడ్, ఎండీగా కూడా వ్యవహరించారు. ఒక ప్రభుత్వ రంగ కంపెనీ అధిపతిగా ప్రైవేట్‌ రంగ కన్సల్టెంట్‌ను నియమించడం ఇదే తొలిసారి.

Current Affairs

సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి 2024 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. గోపీనాథ్‌ మహంతి రచించిన ఒడియా నవల ‘దాది బుఢా’ను ‘ఈతచెట్టు దేవుడు’ పేరుతో తెలుగులోకి అనువదించినందుకు రాజేశ్వరికి పురస్కారం దక్కింది. ఆమెతో పాటు వివిధ భాషల్లో గ్రంథానువాదం చేసిన మొత్తం 21 మందికి 2025, మార్చి 7న ఈ పురస్కారాన్ని ప్రకటించారు.  పురస్కారం గెలుచుకున్న గ్రంథానువాదకులకు రూ.50 వేల నగదు బహుమతితోపాటు ఒక కాంస్య జ్ఞాపికను అందజేస్తారు.

Government Jobs

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

కోల్‌కతాలోని శ్యాంప్రసాద్‌ ముఖర్జీ పోర్టు (ఎస్‌పీఎంపీకే) ఒప్పంద ప్రాతిపదికన  కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 09 వివరాలు: 1. క్యాబిన్‌ అసిస్టెంట్: 05 2. పాయింట్స్‌ మెన్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాధ్యమిక విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 1-03-2025 తేదీ నాటికి 62 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు క్యాబిన్‌ అసిస్టెంట్‌కు రూ.35,000, పాయింట్స్‌మెన్‌కు రూ.26,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: సీనియర్‌ డిప్యూటీ  సెక్రటరీ-2, శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌, కోల్‌కతా, 15 స్ట్రాండ్‌ రోడ్, కోల్‌కతా-700001. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2025 Website:https://smp.smportkolkata.in/smpk/en/job-openings/

Government Jobs

ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టులు

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ముంబయి మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: మేనేజర్‌ (రీటైల్ ప్రోడక్ట్స్‌): 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం, ఎంఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 31-12-2024 తేదీ నాటికి 28 - 40 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు మేనేజర్‌కు రూ.85,920 - రూ.1,05,280, డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 - రూ.93,960. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26-03-2025. Website:https://sbi.co.in/web/careers/current-openings  

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 24 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 19-03-2025 తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.16,338. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 19 మార్చి 2025 పరీక్ష తేదీ: 23 మార్చి 2025 Website:https://www.rites.com/Career

Government Jobs

కేఎస్‌సీఎస్‌టీఈ-ఐసీసీఎస్‌లో పోస్టులు

కేరళలోని కేఎస్‌సీఎస్‌టీఈ-ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్లైమెట్ చేంజ్‌ స్టడీస్‌ (కేఎస్‌సీఎస్‌టీఈ-ఐసీసీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు సైంటిస్ట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. ప్రాజెక్టు సైంటిస్ట్‌-3: 02 2. ప్రాజెక్టు సైంటిస్ట్‌-2: 03 3. ప్రాజెక్టు సైంటిస్ట్‌-1: 05 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డాక్టోరల్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్టు సైంటిస్ట్‌-3కి 45 ఏళ్లు, ప్రాజెక్టు సైంటిస్ట్-2కు 40 ఏళ్లు, ప్రాజెక్టు సైంటిస్ట్‌-1కు 35 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్టు సైంటిస్ట్-3కి రూ.78,000, ప్రాజెక్టు సైంటిస్ట్-2కు రూ.67,000, ప్రాజెక్టు సైంటిస్ట్-1కు రూ.56,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16 మార్చి 2025 Website:https://iccs.res.in/?p=10951&lang=en