కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ
కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. 2025, మార్చి 9న లిబరల్ పార్టీ ఓటింగ్ నిర్వహించింది. ఇందులో మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి పార్టీ నూతన సారథిగా కార్నీ ఎన్నికయ్యారు. సీక్రెట్ ఓటింగ్ ద్వారా పార్టీ అధినేతను ఎన్నుకోగా.. ఇందులో సుమారు 1.50లక్షల మంది ఓటర్లు పాలొన్నారు. ఓటింగ్‌లో కార్నీకి 85 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవి నుంచి వైదొలగనున్నట్లు 2025, జనవరిలో ప్రకటించిన క్రమంలో నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది.