రైల్వేలో జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు
దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) సెంట్రలైజ్‌డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. దీని ద్వారా జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టులు: 2569 వివరాలు: ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01.01.2026 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రారంభ వేతనం: నెలకు: రూ.35,400. ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష విధానం: 100 మార్కుల అబ్జెక్టీవ్ ప్రశ్నపత్రంలో గణితం 30 ప్రశ్నలు- 30 మార్కులు; జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు; జనరల్ అవేర్‌నెస్ 15 ప్రశ్నలు 15 మార్కులు; జనరల్ సైన్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. సీబీటీ-IIలో మొత్తం 150 ప్రశ్నలకు సీబీటీ నిర్వహిస్తారు. జనరల్ అవేర్‌నెస్ 15 ప్రశ్నలు 15 మార్కులు; ఫిజిక్స్ & కెమిస్ట్రీ 15 ప్రశ్నలు 15 మార్కులు; కంప్యూటర్ బేసిక్ & అప్లికేషన్స్‌కు 10 ప్రశ్నలు 10 మార్కులు; బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 ప్రశ్నలు 10 మార్కులు; టెక్నికల్ ఎబిలిటీస్‌లో 100 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 120 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 31.10.2025. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 30.11.2025. దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 02.12.2025. దరఖాస్తు సవరణ విండో: 03.12.2025 నుంచి 12.12.2025 వరకు. Website:https://www.rrbapply.gov.in/#/auth/landing