Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు బింద్రా కన్నుమూత

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్‌ సింగ్‌ బింద్రా కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. బింద్రా 1993 నుంచి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నుంచి 2014 వరకు పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) అధ్యక్షుడిగా వ్యవహరించారు. బింద్రా, మరో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్‌ దాల్మియా.. 1987 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కడంలో కీలక పాత్ర పోషించారు.

Current Affairs

గణతంత్ర వేడుకలు

77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని 2026, జనవరి 26న దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్, యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దాదాపు 10,000 మంది రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే పరేడ్‌ థీమ్‌గా 150 ఏళ్ల వందేమాతరాన్ని ఎంచుకున్నారు. కర్నల్‌ ఫ్రెడ్రిక్‌ సైమన్‌ స్ప్రూజ్‌ నేతృత్వంలోని ఈయూ సైనిక దళం వేడుకలకు హాజరైంది. రిపబ్లిక్‌ డే వేడుకల పరేడ్‌కు కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ భవనీశ్‌ కుమార్‌ నేతృత్వం వహించారు. ఈ వేడుకల్లో తొలిసారిగా కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ్‌ లైట్‌ కమాండో బెటాలియన్‌ కవాతు నిర్వహించింది. దీంతోపాటు శక్తిబన్‌ రెజిమెంట్‌ పాల్గొంది. రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థ సూర్యాస్త్రను సైన్యం ప్రదర్శించింది. ఇది సుదూర ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడంతోపాటు కీలక మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకోగలదు.  ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్, దివ్యాస్త్ర బ్యాటరీ, ధ్రువ్‌ అత్యాధునిక హెలికాప్టర్, టీ-90 భీష్మ ట్యాంకు, నాగ్‌ క్షిపణి వ్యవస్థ, రోబోటిక్‌ శునకాలు, డ్రైవరు రహిత వాహనాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. రెండు మూపురాలున్న ఒంటెలు, ఝన్‌స్కార్‌ పోనీలు తొలిసారిగా పరేడ్‌లో పాల్గొన్నాయి. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 30 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. 

Walkins

సీఐటీడీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

హైదరాబాదులోని ఎంఎస్‌ఎంఈ-టూల్ రూం, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్ డిజైన్‌ ఒప్పంద ప్రాతిపదకన టీచింగ్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు:  ఫ్యాకల్టీ ఫర్‌ మ్యాథమెటిక్స్‌ ఫ్యాకల్టీ ఫర్‌ టూల్‌ డిజైన్‌ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌/ పీజీటీడీ/పీజీటీడీ అండ్‌ సీసీ, ఎంఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత టూల్‌ డిజైన్‌, తదితరాల అనుభవం ఉండాలి. వయోపరమితి: 35 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు: 05, 06.02.2026. వేదిక: ఎంఎస్‌ఎంఈ, బాలానగర్‌, హైదరాబాద్‌.  Website:https://citd.in/

Walkins

సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు

న్యూదిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్‌ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్‌) రిసెర్చ్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ ఫెలో, జేఆర్‌ఎఫ్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టులు: 39  వివరాలు: 1. రిసెర్చ్‌ అసోసియేట్‌: 04 2. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (హోమియో): 12 3. జేఆర్‌ఎఫ్‌: 06   4. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌: 01 5. ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01 6. సైంటిస్ట్‌: 02 7. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 05 8. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 03 9. ఆఫీసర్‌ అసిస్టెంట్‌: 03 10. ఫార్మసిస్ట్‌/కాంపౌండర్‌/డిస్పెన్సర్‌: 01 11. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, సంబందిత విభాగాల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, బీఫార్మసీ/ ఎంపార్మ్‌/ఎంవీఎస్సీ, పీజీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌/ఆర్‌ఈటీ స్కోర్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. పని ప్రదేశాలు: న్యూదిల్లీ, నోయిడా, జైపూర్‌, కోల్‌కతా, గ్యాంగ్‌టక్‌, భోపాల్‌, పూరీ, ఊటీ. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: 10, 11, 12, 13, 16, 17, 18, 24.02.2026; 10.03.2026. Website:https://www.ccrhindia.nic.in/

Internship

లీగలిటీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

లీగలిటీ కంపెనీ డెవలపర్స్‌ ఆర్గనైజేషన్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: లీగలిటీ పోస్టు పేరు: డెవలపర్స్‌ ఆర్గనైజేషన్స్‌  నైపుణ్యాలు: ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ఫార్మేషన్, సీఐ/సీడీ, లినక్స్, పైతాన్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.10,000 - రూ.15,000. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 20-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-developers-operations-internship-at-leegality-grey-swift-private-limited1768973227

Government Jobs

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌ (డీఐసీ) తాత్కాలిక ప్రాతిపదికన సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: సోషల్ మీడియా మేనేజర్ - తెలుగు అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు తెలుగు భాషలో చదవడం, రాయడం, మాట్లాడటంలో పూర్తి ప్రావీణ్యం ఉండాలి. దీనితో పాటు ఇంగ్లిష్,  హిందీ భాషలపై కూడా అవగాహన అవసరం. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 05-02-2026. Website:https://dic.gov.in/careers/

Government Jobs

బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉద్యోగాలు

వారణాసీలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 05 వివరాలు: 1. రిసెర్చ్ అసోసియేట్ : 01  2.రిసెర్చ్ అసిస్టెంట్ : 01  3.ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ : 03 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎంఫిల్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్ లో అర్హత సాధించి ఉండటంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ కు రూ.47,000. రిసెర్చ్ అసిస్టెంట్ కు రూ.37,000. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌ కు రూ.20,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. చిరునామా: సామాజిక శాస్త్రాల విభాగం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి - 221005, దరఖాస్తు చివరి తేదీ: 15-02-2026. Website:https://www.bhu.ac.in/site/tempvacancy/1_2_16

Government Jobs

ఎయిమ్స్ దిల్లీలో మీడియా జర్నలిస్ట్‌ పోస్టులు

దిల్లీలోని  ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ఎడ్యుకేషనల్ మీడియా జర్నలిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: ఎడ్యుకేషనల్ మీడియా జర్నలిస్ట్‌  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ(ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, సైకాలజీ, బిహేవియరల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్/కమ్యూనికేషన్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.67,700. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 14.02.2026.  Website:https://www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment

Walkins

Faculty Jobs In Central Institute of Tool Design, Hyderabad

MSME-Tool Room, Central Institute of Tool Design (CITD), Hyderabad is conducting interviews for the following teaching faculty positions on a contract basis.  Details: Faculty for Mathematics Faculty for Tool Design Eligibility: Candidates must have a BE/B.Tech, ME/M.Tech/PGTD/PGTD & CC, MA/M.Sc degree in the relevant field, along with experience in tool design, etc. Age Limit: Not exceeding 35 years. Interview Dates: 05, 06.02.2026. Venue: MSME, Balanagar, Hyderabad. Website:https://citd.in/

Walkins

Jobs at CCRH

The Central Council for Research in Homeopathy (CCRH) in New Delhi is conducting interviews to fill Research Associate, Research Fellow, JRF, Office Assistant, and Multi-Tasking Staff positions.  Number of Posts: 39 Details: 1. Research Associate: 04 2. Senior Research Fellow (Homoeopathy): 12 3. JRF: 06 4. Medical Laboratory Technologist: 01 5. Principal Project Associate: 01 6. Scientist: 02 7. Project Associate-2: 05 8. Multi Tasking Staff: 03 9. Office Assistant: 03 10. Pharmacist/Compounder/Dispenser: 01 11. Lab Technician: 02 Eligibility: Candidates should have passed 10th class, Intermediate, Degree, B.Pharmacy/M.Pharm/M.V.Sc., PG, M.Sc., Ph.D in relevant disciplines, along with NET/GATE/RET score, computer knowledge, and work experience. Work Locations: New Delhi, Noida, Jaipur, Kolkata, Gangtok, Bhopal, Puri, Ooty. Selection Process: Based on interview. Interview Dates: 10, 11, 12, 13, 16, 17, 18, 24.02.2026; 10.03.2026.  Website:https://www.ccrhindia.nic.in/