రాష్ట్రంలో 1,70,509 మంది ప్రవాసాంధ్రులు
విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర దేశాల్లో 1,70,509 మంది ప్రవాసాంధ్రులు ఉన్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సర్వేలో వెల్లడైంది. 14,999 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,68,36,434 ఇళ్లకు వెళ్లి సర్వే చేశారు. ఇందులో 1,11,909 ఇళ్లలో 1,70,509 ప్రవాసాంధ్రులు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఉద్యోగ, ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం కోసం వేర్వేరు దేశాల్లో ఉంటున్నట్లు వారి కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తేల్చారు. అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 17,980 మంది ప్రవాసాంధ్రులు ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరిలో 15,471, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15,378 మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం వెళ్లినవారని అంచనా వేస్తున్నారు.