Posts

Current Affairs

క్రిష్, కైరా

భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ కవలలు ప్రసిద్ధ మెన్సా సంస్థ నిర్వహించిన అత్యున్నత స్థాయి ఐక్యూ (తెలివితేటల సూచిక) పరీక్షలో అగ్రస్థానంలో నిలిచారు. మెన్సా ఛాలెంజ్‌ పరీక్షలో 11 సంవత్సరాల క్రిష్‌ 162 పాయింట్లు పొంది అత్యధిక ఐక్యూ కలిగిన 0.26 శాతం మంది పిల్లల కోవలో స్థానం పొందాడు. ఆ బాలుడి సోదరి కైరా 152 పాయింట్లు సాధించి అత్యున్నత ఐక్యూ కలిగిన 2 శాతం చిన్నారుల కోవలోకి చేరారు. ఐక్యూ పరీక్షలో 140 పాయింట్లు సాధించిన పిల్లలు అసాధారణ ప్రతిభా పాటవాలు ఉన్నట్లు లెక్క.

Current Affairs

చాన్‌జిన్‌ ఆంగ్మో

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన (8,848 మీటర్ల) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి అంధ మహిళగా చాన్‌జిన్‌ ఆంగ్మో (29) రికార్డు సాధించారు. ఈమె హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం చాంగోకు చెందినవారు. దండు షెర్పా, గురుంగ్‌ మైలాలతో కలిసి ఆమె ఈ ఘనత సాధించారు.  మూడో తరగతి చదువుతుండగా ఎనిమిదేళ్ల వయసులో ఆంగ్మో కంటిచూపు కోల్పోయారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ హిస్టరీలో పీజీ చేశారు. దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్నందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి చాన్‌జిన్‌ ఆంగ్మో పురస్కారాన్ని అందుకొన్నారు.   

Government Jobs

ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

ఎన్టీపీసీ లిమిటెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్‌, సీ&ఐ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 150 వివరాలు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సీ&ఐ 1. డిప్యూటీ మేనేజర్‌(ఎలక్ట్రికల్): 40 2. డిప్యూటీ మేనేజర్‌(మెకానికల్‌): 70 3. డిప్యూటీ మేనేజర్‌(సీ&ఐ): 40 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌(ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కంట్రోల్‌ & ఇనుస్ట్రుమెంటేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 40 ఏళ్లు ఉండాలి.  జీతం: నెలకు రూ.70,000 - రూ.2,00,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 9. Website: https://careers.ntpc.co.in/recruitment/

Government Jobs

ఎఫ్‌డీడీఐ చెన్నైలో ఉద్యోగాలు

చెన్నైలోని ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) అడమిక్‌ & నాన్‌ అకడమిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అకడమిక్‌ & నాన్‌ అకడమిక్‌: 47 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్‌/బీఈ, డిప్లొమా, టెన్త్‌, పీజీ, ఎంఈ/ఎంటెక్‌, ఎంఫిల్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: జూనియర్‌ ఫ్యాకల్టీకి 35 ఏళ్లు, ఫ్యాకల్టీకి 40 ఏళ్లు, సీనియర్‌ గ్రేడ్‌-2 ఫ్యాకల్టీకి 45 ఏళ్లు, సీనియర్ ఫ్యాకల్టీ గ్రేడ్‌-1కు 50 ఏళ్లు, చీఫ్‌ ఫ్యాకల్టీకి 53 ఏళ్లు, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, ల్యాబ్‌ అసిస్టెంట్‌కు 40 ఏళ్లు, సీనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌కు 45 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 33 ఏళ్లు. జీతం: నెలకు జూనియర్‌ ఫ్యాకల్టీకి రూ.45,000, ఫ్యాకల్టీకి రూ.65,000, సీనియర్‌ గ్రేడ్‌-2 ఫ్యాకల్టీకి రూ.80,000, సీనియర్ ఫ్యాకల్టీ గ్రేడ్‌-1కు 1,10,000, చీఫ్‌ ఫ్యాకల్టీకి రూ.1,50,000, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.22,000, ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.25,000, సీనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.30,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000.  ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 30. Website: https://fddiindia.com/career

Government Jobs

సీఐఓఆర్‌లో టెక్నికల్‌ స్టాప్‌ పోస్టులు

కేరళలోని ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ పరిధిలోని సీఐఓర్‌ బోర్డ్‌ సెంట్రల్‌ కాయర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అలప్పుజ, కేరళ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాయర్‌ టెక్నాలజీ, బెంగళూరు కర్ణాటకలో కాంట్రక్ట్‌ ప్రాతిపదికన ప్రాజెక్ట్‌/ టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హలైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 22 వివరాలు:  పోస్టులు: టెక్స్‌టైల్‌ టెక్నాలజిస్ట్‌, డిజైన్‌ అసిస్టెంట్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-అనలిటికల్‌ కెమిస్ట్‌, ప్రాజెక్ట్‌ హెల్పర్‌, ట్రైనర్‌, ఇన్‌స్ట్రక్టర్‌, బాయిలర్‌ ఆపరేటర్‌, స్టోర్‌ అసిస్టెంట్‌, లైబేరియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగం/ ట్రేడులో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు టెక్స్‌టైల్‌ టెక్నాలజిస్ట్‌, డిజైన్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.28,000; బాయిలర్‌ ఆపరేటర్‌, స్టోర్స్‌ అసిస్టెంట్‌, లైబ్రేరియన్‌కు రూ.25,000; ఇతర పోస్టులకు రూ.20,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20-06-2025. Website: http://coirboard.gov.in/

Walkins

Research Assistant Posts In NIMR

ICMR-National Institute of Malaria Research (NIMR) in New Delhi is conducting interviews for the following posts on a temporary basis. No. of Posts: 39 Details: Research Assistant: 13 Laboratory Technician: 13 Multi-Tasking Staff: 13 Eligibility: Tenth, Intermediate, Diploma (MLT/DMLT/Engineering), Degree (MLT/Life Science) as per the post along with work experience. Age limit: Not more than 35 years. Salary: Per month Rs.32,000 for Research Assistant; Rs.20,000 for Laboratory Technician; Rs.18,000 for Multi-Tasking Staff. Interview dates: 29, 30.05.2025; 02, 03, 05, 06, 09.06.2025. Job Location: Goa, Mizoram, Meghalaya, West Bengal, Chennai, Gujarat, Tripura, Odisha, Jharkhand, Maharashtra, Chhattisgarh, Madhya Pradesh. Website: https://hindi.nimr.org.in/

Government Jobs

Deputy Manager Posts in NTPC

NTPC Limited (NTPC) is inviting applications for the Deputy Manager posts in Mechanical, Electrical, and C&I departments.  Number of Posts: 150 Details: Departments: Mechanical, Electrical, C&I 1. Deputy Manager (Electrical): 40 2. Deputy Manager (Mechanical): 70 3. Deputy Manager (C&I): 40 Qualification: Candidates should have passed BE/BTech (Electrical, Mechanical, Control & Instrumentation) with 60% marks in the relevant discipline from any recognized university along with work experience. Age Limit: Must be 40 years.  Salary: Rs.70,000 - Rs.2,00,000 per month. Application Fee: Rs.300 for General, OBC, EWS candidates. No fee for SC, ST, PWBD, ESM and Women candidates. Selection Process: Candidates will be selected on the basis of written test and interview. ​​​ Application Process: Online. Application Start Date: Starting from May 26, 2025. Application Last Date: Candidates can apply till June 9, 2025. Website: https://careers.ntpc.co.in/recruitment/

Government Jobs

Posts In FDDI Chennai

Footwear Design and Development Institute (FDDI), Chennai is inviting applications for the Academic & Non-Academic posts. Details: Academic & Non-Academic: 47 Qualification: Degree, B.Sc, B.Tech/BE, Diploma, TENT, PG, ME/MTech, MPhil/PhD in the relevant discipline as per the posts along with work experience. Age limit: 35 years for Junior Faculty, 40 years for Faculty, 45 years for Senior Grade-2 Faculty, 50 years for Senior Faculty Grade-1, 53 years for Chief Faculty, 35 years for Junior Lab Assistant, 40 years for Lab Assistant, The senior lab assistant is 45 years old, and the assistant manager is 33 years old. Salary: Rs.45,000 per month for Junior Faculty, Rs.65,000 for Faculty, Rs.80,000 for Senior Grade-2 Faculty, Rs.1,10,000 for Senior Faculty Grade-1, Rs.1,50,000 for Chief Faculty, Rs.22,000 for Junior Lab Assistant, Rs.25,000 for Lab Assistant, Rs.30,000 for Senior Lab Assistant, Rs.40,000 for Assistant Manager.  Selection Process: Candidates will be selected on the basis of written test and interview. Online Application Deadline: 30th May 2025 Website: https://fddiindia.com/career

Government Jobs

Technical Staff Posts In CIOR Board

The CIOR Board under the Ministry of MSME, Government of India invites online applications from eligible candidates for the recruitment of Project/Technical Staff posts on contract basis in Central Coir Research Institute, Alappuzha, Kerala, and Central Institute of Coir Technology, Bangalore, Karnataka. No. of Posts: 22 Details: Posts: Textile Technologist, Design Assistant, Fitter, Welder, Machinist, Electrician, Project Assistant, Project Assistant-Analytical Chemist, Project Helper, Trainer, Instructor, Boiler Operator, Store Assistant, Librarian, Lab Technician etc. Eligibility: ITI, Diploma, Degree, PG in the relevant discipline/trade as per the post along with work experience. Age Limit: Not to exceed 40 years. Salary: Per month Rs.28,000 for Textile Technologist, Design Assistant, Project Assistant, Lab Technician posts; Rs.25,000 for Boiler Operator, Stores Assistant, Librarian; Rs.20,000 for other posts. Selection Process: Based on educational qualifications, work experience, interview. Last Date for Online Applications: 20-06-2025. Website: http://coirboard.gov.in/

Current Affairs

ప్రపంచ తాబేళ్ల దినోత్సవం

తాబేళ్ల ప్రాముఖ్యతలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో ఏటా మే 23న ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇవి సముద్ర పర్యావరణానికి చాలా ముఖ్యమైనవి. జెల్లీ ఫిష్‌లు, స్పాంజ్‌ల జనాభాను నియంత్రిస్తాయి. ఇవి భూమి, జలావరణంలో నివసిస్తాయి. తాబేళ్ల గురించి ప్రజలకు తెలియజేయడంతోపాటు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య  ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: తాబేళ్లను, వాటి జాతిని పరిరక్షించే ఉద్దేశంతో 1990లో అమెరికన్‌ టార్టాయిస్‌ రెస్క్యూ (ఏటీఆర్‌) ఏర్పడింది. తాబేళ్ల రక్షణ, పునరావాసం లాంటి చర్యలు ఇది నిర్వహిస్తుంది. వాటి ఆవాసాలను రక్షించి, మనుగడ - వృద్ధికి సాయపడేలా మానవ చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటీఆర్‌ సంస్థ ఏటా మే 23న ‘ప్రపంచ తాబేళ్ల దినోత్సవం’గా జరుపుకోవాలని 2000లో తీర్మానించింది. 2025 నినాదం: Dancing Turtles Rock!