ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ), ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఫ్యాకల్టీ, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 05 వివరాలు: 1. జూనియర్ ఫ్యాకల్టీ - 02 2. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ - 02 3. జూనియర్ ల్యాబ్ ఇన్‌స్ట్రక్టర్ - 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి కనీసం 55 శాతం మార్కులతో టెన్త్/ఇంటర్/ డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.30,000.- రూ.50,000. గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 27. Website:https://fddiindia.com/career