Posts

Government Jobs

రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు

దిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (రైల్‌టెల్‌) వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు సంఖ్య: 48 (యూఆర్‌-21; ఓబీసీ-13; ఎస్సీ-08; ఎస్టీ-01; ఈడబ్ల్యూఎస్‌-08) వివరాలు: విభాగాలు: సిగ్నలింగ్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ 1. అసిస్టెంట్ మేనేజర్‌: 30 2. డిప్యూటీ మేనేజర్‌: 18 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 జూన్‌ 30 నాటికి అసిస్టెంట్ మేనేజర్‌కు 21 - 28 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 21 - 30 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.30,000 - రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 30. Website:https://www.railtel.in/careers.html

Government Jobs

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) హైదరాబాద్ మార్కెటింగ్ అండ్‌ బీడీ విభాగాల్లో సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 05 వివరాలు: విభాగాలు: మార్కెటింగ్ అండ్ బీడీ పోస్టు పేరు-ఖాళీలు 1. సీనియర్‌ మేనేజర్‌: 04 2. మేనేజర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 45 ఏళ్లు ఉండాలి.   వేతనం: నెలకు మేనేజర్‌కు రూ.60,000 - 1,80,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూన్‌ 16. చిరునామా: ఎస్.ఎం, సి-హెచ్ఆర్(టీఏ & సీపీ), కార్పొరేట్ ఆఫీస్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, గచ్చిబౌలి, హైదరాబాద్-500032. Website:https://bdl-india.in/recruitments

Government Jobs

Posts In Railtel Corporation Limited

Rail India Technical Railtel Corporation of India Limited (RAILTEL), Gurugram is inviting applications for the Manager posts in various departments.  No. of Posts: 48 (UR-21; OBC-13; SC-08; ST-01; EWS-08) Details: Departments: Signaling, Marketing, Finance 1. Assistant Manager: 30 2. Deputy Manager: 18 Qualification: Candidates should have passed B.Sc, B.Tech/BE, Diploma, MBA/PGDM, PG Diploma in the relevant discipline along with work experience. Age Limit: Assistant Manager should be 21 - 28 years and Deputy Manager should be 21 - 30 years as on 30th June 2025. Salary: Rs.30,000 - Rs.1,20,000 per month for Assistant Manager, Rs.40,000 - Rs.1,40,000 for Deputy Manager. Application Fee: Rs.1200 for General, OBC, EWS candidates. Rs.600 for SC, ST, PWBD candidates. Selection Process: Based on Written Test. Online Application Last Date: June 30, 2025. Website:https://www.railtel.in/careers.html

Government Jobs

Manager Posts in Bharat Dynamics Limited

Bharat Dynamics Limited (BDL) Hyderabad is inviting applications for the Senior Manager and Manager posts in Marketing and BD departments. Number of Posts: 05 Details: Departments: Marketing and BD 1. Senior Manager: 04 2. Manager: 01 Qualification: Candidates should have passed BE/BTech in the relevant department along with work experience as per the post. Age Limit: 40 years for Manager and 45 years for Senior Manager. Salary: Rs.60,000 - Rs.1,80,000 per month for Manager, Rs.70,000 - Rs.2,00,000 for Senior Manager. Application Mode: Offline. Last Date for Application: 16th June 2025. Address: S.M, C-HR (TA & CP), Corporate Office, Bharat Dynamics Limited, Gachibowli, Hyderabad-500032. Website:https://bdl-india.in/recruitments

Current Affairs

ఆర్‌బీఐ వార్షిక నివేదిక

భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ అత్యంత వేగవంతమైన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొసాగుతుందని, ఇందుకు బలమైన స్థూల ఆర్థిక మూలాలు చేదోడుగా నిలుస్తాయని 2025, మే 29న విడుదల చేసిన వార్షిక నివేదికలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. నివేదిక ముఖ్యాంశాలు: అంతర్జాతీయ మార్కెట్‌ ఊగిసలాటలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరాలో ఇబ్బందులు, పర్యావరణ మార్పులు వంటివి ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరొచ్చు.  వరుసగా రెండు సమీక్షల్లో కీలక రేట్లను తగ్గించినందున, ద్రవ్యోల్బణాన్ని 4% లోపు కట్టడి చేయగలం. 2025, మార్చి 31 నాటికి మొత్తం మీద మిగులు ఏడాది కిందటితో పోలిస్తే 27.37% పెరిగి రూ.2.68 లక్షల కోట్లకు చేరింది. 

Current Affairs

ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన

మణిపుర్‌లో ఇటు రవాణాకు, అటు వ్యూహాత్మకంగానూ ఉపయోగపడే వంతెన - 164 (నోనీ బ్రిడ్జి) నిర్మాణాన్ని భారతీయ రైల్వే పూర్తి చేసింది. 141 మీటర్ల ఎత్తు ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే పియర్‌ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. ఈ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) సరికొత్త ఘనత సాధించింది.  111 కి.మీ.ల జిరిబామ్‌-ఇంఫాల్‌ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. 

Current Affairs

కాశిమేడు తీరంలో అరుదైన సూక్ష్మజీవులు

చెన్నై సమీపంలోని కాశిమేడు తీరంలో పెరోనస్‌ జాతికి చెందిన అరుదైన సూక్ష్మజీవుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవులు ఇప్పటి వరకు ప్రపంచంలో రెండు, మూడుచోట్ల మాత్రమే కనిపించగా ఆ తర్వాత వాటి ఉనికి ఇక్కడే బయటపడటం విశేషం. జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ)కు చెందిన మహిళా శాస్త్రవేత్తలు డాక్టర్‌ అంజుమ్‌ రిజ్వీ, రితికా దత్తా ఈ పరిశోధనలు చేశారు. వీటిల్లో ఒకరకం 1966లో దక్షిణాఫ్రికా తీరంలో కనిపించగా, మరోరకం 2015లో చైనా తీరంలో చూసినట్లుగా వారు వివరించారు. మూడో రకం సూక్ష్మజీవులను ఇప్పుడు తమిళనాడు తీరంలో గుర్తించామని తెలిపారు.  ఈ జీవులకు పరిశోధకులు ‘పెరోనస్‌ జైరాజ్‌పురి’ అని పేరుపెట్టారు. దేశంలో ప్రముఖ నెమటాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ ఎంఎస్‌ జైరాజ్‌పురి గౌరవార్థంగా ఈ పేరు ఖరారు చేసినట్లు జెడ్‌ఎస్‌ఐ ప్రకటించింది.

Current Affairs

ఎన్‌డీఏలో శిక్షణ ముగించుకున్న తొలి మహిళా బ్యాచ్‌

దేశ సైనిక చరిత్రలో తొలిసారిగా 17 మంది మహిళలు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో శిక్షణ ముగించి పట్టా అందుకున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో 2025, మే 29న జరిగిన ఎన్‌డీఏ 148వ స్నాతకోత్సవం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా మహిళా కేడెట్లతో సహా మొత్తం 339 మంది పట్టా పుచ్చుకున్నారు. వీరిలో 84 మంది బీఎస్సీ, 85 మంది కంప్యూటర్‌ సైన్సు, 59 మంది బీఏ, 111 మంది బీటెక్‌ పట్టాలు పొందారు. వీరిని త్రివిధ దళాల్లో అధికారులుగా నియమిస్తారు.

Current Affairs

సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అతుల్‌ ఎస్‌.చందూర్కర్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా లాంఛనంగా నియమితులయ్యారు. ఈ మేరకు  2025, మే 29న వారి నియామకాలను కేంద్రం ఖరారుచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ మే 30న వారి చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓక్, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌ల పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామకం జరిపారు.

Current Affairs

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో స్వర్ణం సాధించింది. 2025, మే 29న గమి (దక్షిణ కొరియా)లో జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌ రేసును ఆమె 12.96 సెకన్లలో ముగించింది. 1998లో ఓల్గా షిషిజినా (కజకిస్తాన్‌), 2011లో సున్‌ యావీ (చైనా) నెలకొల్పిన ఛాంపియన్‌షిప్‌ రికార్డు (13.04 సెకన్లు)ను తిరగరాసింది. 2023లోనూ జ్యోతి స్వర్ణం (13.09) సాధించింది. 100 మీ హర్డిల్స్‌లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువసార్లు పసిడి పతకాలు సాధించిన అయిదో క్రీడాకారిణి ఆమె.  3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌ సాబ్లే 8 నిమిషాల 20.92 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో స్టీపుల్‌చేజ్‌లో భారత్‌కు స్వర్ణం లభించడం 36 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిగా 1989లో దీనారామ్‌ పసిడి నెగ్గాడు.