రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు
లఖ్‌నవూలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఆర్‌ఆర్‌ఎల్‌ఐఎంఎస్) రెగ్యులర్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 09 వివరాలు: 1. ట్యూటర్: 02 2. ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్: 01 3. వైస్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్: 01 4. అసోసియేట్ ప్రొఫెసర్(మెడికల్ సర్జికల్): 01 5. అసోసియేట్ ప్రొఫెసర్(కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్): 01 6. అసిస్టెంట్ ప్రొఫెసర్(మిడ్‌వైఫెరీ/ఒబెస్ట్రిక్స్/గైనకాలజీ నర్సింగ్): 01 7. అసిస్టెంట్ ప్రొఫెసర్(చైల్డ్ హెల్త్ నర్సింగ్): 01 8. అసిస్టెంట్ ప్రొఫెసర్(మెంటల్ హెల్త్ నర్సింగ్): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొదింన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఎంఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(నర్సింగ్)/పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్), పీహెచ్‌డీ(నర్సింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: ట్యూటర్ పోస్టుకు 40 ఏళ్లు, మిగతా పోస్టులన్నింటికి 50 ఏళ్లు. వేతనం: నెలకు ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్‌కు రూ.1,31,100 - రూ.2,16,600, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800 - రూ.2,09,200, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.67,700 - రూ.2,08,700, ట్యూటర్‌కు రూ.47,600 - రూ.1,51,100. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.708. ఎంపిక: ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్‌కు ఇంటర్వ్యూ, మిగతా పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్ 30. Website:https://www.drrmlims.ac.in/recruitment