Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ఆటకు సైనా వీడ్కోలు

భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా నెహ్వాల్‌ 2026, జనవరి 19న ఆటకు వీడ్కోలు పలికింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలకు చేరింది. గత కొన్నేళ్లుగా సైనా ఆటకు దూరంగానే ఉంది. ఆమె చివరగా 2023లో సింగపూర్‌ ఓపెన్‌లో ఆడింది. మోకాళ్ల సమస్యే తన వీడ్కోలు నిర్ణయానికి కారణమని ఆమె తెలిపింది. విశేషాలు: 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్, సూపర్‌ సిరీస్‌లలో అంతకుముందెప్పుడూ చూడని విజయాలు భారత్‌ సొంతమయ్యాయంటే సైనానే కారణం. 2009లో అర్జున అవార్డు పొందిన సైనా.. 2010లో అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న సొంతం చేసుకుంది.  ఒలింపిక్స్‌తో పాటు బీడబ్ల్యూఎఫ్‌ మేజర్‌ టోర్నీలైన ప్రపంచ ఛాంపియన్‌షిప్, ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కనీసం ఒక పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌ సైనానే. 

Current Affairs

ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు 2026, జనవరి 19న ప్రాంభమైంది. దేశ విదేశాల నుంచి 3,000 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఇందులో 400 మంది రాజకీయ నేతలు ఉండగా, వారిలో 64 మంది దేశాధినేతలున్నారు. 1,000 మంది సీఈవోలు సదస్సులో పాల్గొన్నారు.  దావోస్‌ పర్వతాల మధ్య ఉండే అతి శీతల ప్రాంతం. 1880లో ఐరోపాలో టీబీ మహమ్మారి పీడించేది. దీంతో చాలా మంది స్వచ్ఛమైన గాలి కోసం దావోస్‌ పర్వత ప్రాంతాలకు వెళ్లేవారు. అలా వెళ్లినవారు అక్కడే ఒక చర్చిని నిర్మించారు. అదే చర్చి.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వేదికగా నిలుస్తోంది. 1971 నుంచి ఏటా జనవరిలో ఈ సదస్సు జరుగుతోంది. తొలుత ఈ సదస్సును యూరోపియన్‌ మేనేజ్‌మెంట్‌ ఫోరం నిర్వహించేది. మొదటి సదస్సుకు డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ స్వాబ్‌.. 400 మంది ఐరోపా వ్యాపారవేత్తలను పిలిచారు. ఆ తర్వాతి నుంచి అది ప్రపంచ దేశాల నేతల ఆర్థిక చర్చలకు వేదికగా నిలుస్తూ వస్తోంది. జెనీవా కేంద్రంగా ఏర్పడిన డబ్ల్యూఈఎఫ్‌ ఏటా ఈ సదస్సును నిర్వహిస్తోంది. 2026లో జరిగింది 56వ సదస్సు.

Current Affairs

జాతీయస్థాయి శాసన సదస్సులు

జాతీయ స్థాయి శాసన సదస్సులు ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ ఆధ్వర్యంలో 2026 జనవరి 19న లఖ్‌నవూలోని విధాన్‌ భవనంలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 86వ అఖిల భారత అధ్యక్ష అధికారుల సదస్సుతో పాటు, 62వ రాష్ట్ర శాసనసభ, శాసన మండళ్ల కార్యదర్శుల సదస్సు ఒకేసారి జరుగుతాయి. 

Current Affairs

సియామ్‌ నివేదిక

విదేశీ విపణిల్లో కార్లు, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు గిరాకీ పెరగడంతో.. 2025లో మనదేశం నుంచి 63,25,211 వాహనాలు ఎగుమతి అయ్యాయని వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ తెలిపింది. 2024లో ఎగుమతి అయిన 50,98,474 వాహనాలతో పోలిస్తే ఇవి 24.1% అధికం. పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల నుంచి మన వాహనాలకు గిరాకీ స్థిరంగా లభిస్తోందని వెల్లడించింది.  మోటార్‌ సైకిల్‌ ఎగుమతులు 27% పెరిగి 43,01,927కు చేరాయి. స్కూటర్ల ఎగుమతులు 8% వృద్ధితో 6,20,241గా నమోదయ్యాయి. మొత్తం వాణిజ్య వాహనాల ఎగుమతులు 27% పెరిగి 91,759కి చేరాయి. 

Current Affairs

రూ.1.84 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులు

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మనదేశం నుంచి 20.48 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే సమయ ఎగుమతుల కంటే ఇవి 6.5% ఎక్కువ. మన ఔషధాల ఎగుమతులు బ్రెజిల్, నైజీరియా దేశాలకు వేగంగా పెరుగుతున్నాయి.  2024-25 ఇదే సమయంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాకు 17.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,600 కోట్ల) అధికంగా ఔషధాలు మనదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. మన దేశం నుంచి పెరిగిన ఔషధ ఎగుమతుల్లో ఈ వాటా 14%. మన ఔషధాల ఎగుమతులు వేగంగా పెరిగింది ఈ దేశానికే. 

Current Affairs

విజయ్‌ హజారే

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని విదర్భ తొలిసారి కైవసం చేసుకుంది. 2026, జనవరి 18న బెంగళూరులో జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. మొదట విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర.. 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది.  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా అథర్వ తైదె (128; 118 బంతుల్లో 15×4, 3×6) నిలిచాడు.

Government Jobs

సీసీఎంబీలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టులు

హైదరాబాద్‌ హబ్సిగూడలోని సీఎస్ఐఆర్- సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: 1. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌: 02 2. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-3: 01  3. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌-1: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 28 నుంచి 45 ఏళ్లు. జీతం: నెలకు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000,  ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-3 కి రూ.78,000, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌-1కు రూ.18,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 28.  Website:https://www.ccmb.res.in/Careers/Project-Positions

Admissions

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌-2026 ప్రవేశాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్ 2026 సంవత్సరానికి బ్యాచిలర్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌, పీజీ డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: 1. బ్యాచిలర్స్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడీఈఎస్)-నాలుగేళ్లు: 180 సీట్లు 2. మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎండీఈఎస్)- రెండేళ్లు: 60 సీట్లు 3. పీజీ డిప్లొమా ఇన్‌ డిజైన్‌ ఫౌండేషన్‌- ఏడాది: 20 సీట్లు మొత్తం సీట్లు: 260 స్పెషలైజేషన్లు: హార్డ్‌ మెటీరియల్‌ డిజైన్‌, సాఫ్ట్‌ మెటీరియల్‌ డిజైన్‌, ఫైర్డ్‌ మెటీరియల్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ క్లాతింగ్‌ డిజైన్‌, జువెల్లరీ డిజైన్‌, క్రాఫ్ట్‌ కమ్యూనికేషన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌. అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్‌, డిజైన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో ఏదైనా డిగ్రీ (బీడీఎస్‌, బీఆర్క్‌, బీఏ, బీఎస్సీ, వొకేషనల్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా), ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. (యూసీడ్‌/సీడ్‌/నిఫ్ట్‌/నిడ్‌లో క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో మినహాయింపు ఉంటుంది).  దరఖాస్తు ఫీజు: రూ.1,750. దరఖాస్తు చివరి తేదీ: 31.03.2026. ఆన్‌లైన్ ఎంట్రెన్స్‌ టెస్ట్‌: 05.04.2026. అడ్మిన్‌ కార్డ్స్‌ అండ్‌ పరీక్ష పేపర్‌ డౌన్‌లోడింగ్‌: 05.04.2026. ఇంటర్వ్యూ తేదీ: మే 1 నుంచి.. ఫలితాలు (మొదటి విడుత): మే 15. Website:https://www.iicd.ac.in/new-admissions-2026/

Government Jobs

Senior Project Associate posts at CCMB

CSIR-Centre for Cellular and Molecular Biology (CCMB) in Habsiguda, Hyderabad is inviting applications for following positions on a temporary basis.  Number of Posts: 04 Details: 1. Senior Project Associate: 02 2. Project Scientist-3: 01 3. Project Technical Support-1: 01 Eligibility: Depending on the post, candidates must have a degree, post graduate degree, or PhD in the relevant field, along with work experience. Maximum age limit: 28 to 45 years. Salary: Rs. 42,000 per month for Senior Project Associate, Rs. 78,000 for Project Scientist-3, and Rs. 18,000 for Project Technical Support-1. Selection process: Based on interview.  Application process: Online. Last date for online application submission: January 28, 2026. Website:https://www.ccmb.res.in/Careers/Project-Positions

Admissions

Indian Institute of Crafts and Design-2026 Admissions

The Indian Institute of Crafts and Design is inviting applications for admissions into Bachelor's, Master's of Design, and PG Diploma programs for the year 2026.  Details: 1. Bachelor of Design (B.Des) - Four years: 180 seats 2. Master of Design (M.Des) - Two years: 60 seats 3. PG Diploma in Design Foundation - One year: 20 seats Total Seats: 260 Specializations: Hard Material Design, Soft Material Design, Fired Material Design, Fashion Clothing Design, Jewellery Design, Craft Communication, Interior Design. Eligibility: Intermediate, Degree in Design and Architecture (B.Des, B.Arch, BA, B.Sc, Vocational degree, PG Diploma), Graduation in any Discipline. Selection Process: Based on entrance examination and interview.  Application Fee: Rs. 1,750. Application Deadline: 31.03.2026. Online Entrance Test: 05.04.2026. Admit Card cum Question Paper Available to Download: 05.04.2026. Interview Date: 1st May 2026 onwards. Website:https://www.iicd.ac.in/