Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

16వ ఆర్థిక సంఘం సిఫార్సు

కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41 శాతంగా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోతపెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కనబెట్టింది. దీనికితోడు రంగాలవారీ, రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకూ తెరదించింది. దీనివల్ల గత ఐదేళ్లతో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాలు నికరంగా రూ.4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది.

Current Affairs

కేంద్ర బడ్జెట్‌ 2026-27

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 2026, ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్‌ను సమర్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి. మొత్తం బడ్జెట్‌ రూ. 53,47,315 కోట్లు. రెవెన్యూ వసూళ్లు: రూ.35,33,150 కోట్లు; రెవెన్యూ వ్యయం: రూ.41,25,494 కోట్లు; మూలధన వసూళ్లు: రూ.18,14,165 కోట్లు; మూలధన వ్యయం: రూ.12,21,821 కోట్లు.  చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్‌ వరసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్టును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు. వేర్వేరు పదవీకాలాల్లో పదిసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డుకు ఆమె చేరువయ్యారు. 1959-64 మధ్య ఆరుసార్లు, 1967-69 మధ్య నాలుగుసార్లు మొరార్జీకి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. కేంద్ర మాజీ మంత్రుల్లో పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్‌ ముఖర్జీ 8 సార్లు వేర్వేరు ప్రభుత్వాల్లో బడ్జెట్లు సమర్పించారు. అందువల్ల వరసగా తొమ్మిదేళ్లు, అదీ ఒకే ప్రధాని (నరేంద్రమోదీ) హయాంలో కేంద్ర పద్దు సమర్పించిన ఘనత మాత్రం నిర్మలదే అవుతుంది.  బడ్జెట్‌లో రంగాలవారీ కేటాయింపులు - ముఖ్య విశేషాలు వ్యవసాయ రంగం: 2026-27 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇది 2025-26 సంవత్సరానికి సవరించిన అంచనాల మొత్తమైన రూ.1,51,853 కోట్ల కంటే 7.12% ఎక్కువ. ఉత్పాదకత పెంపు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి లక్షిత ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఆమె చెప్పిన ప్రకారం.. ఆకాంక్షిత జిల్లాల స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి ‘ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన’ను చేపట్టనున్నారు. తక్కువ దిగుబడులు వస్తున్న 100 జిల్లాల్లో ఇప్పుడున్న పథకాలను, ప్రత్యేక చర్యల్ని కలిపి దీనిని అమలు చేస్తారు.  దేశీయంగా మత్స్య పరిశ్రమకు ఊతమివ్వడానికి 500 జలాశయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. అమృత్‌ సరోవర్లను తీర్చిదిద్దుతారు.  రక్షణ రంగం.. 2026-27 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.7,84,678 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయింపుల (రూ.6.81 లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఈ దఫా ప్రధానంగా ఆధునికీకరణకు పెద్దపీట వేశారు. ప్రభుత్వం 2026-27లో చేయదలిచిన వ్యయంలో రక్షణ వాటా 14.67 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖలన్నింటిలోకీ ఇదే అత్యధికం. మొత్తంమీద గత 26 ఏళ్లలో రక్షణ బడ్జెట్‌ 40 శాతం పెరిగింది.   బయోఫార్మా శక్తి.. దేశాన్ని బయోఫార్మా హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. దీని కింద ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 1,000 క్లినికల్‌ ట్రయల్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌ఓ)ను పటిష్ఠపరుస్తారు. హోంశాఖ.. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో హోంశాఖకు రూ.2.55 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఈ శాఖకు 2025-26లో కేటాయించిన రూ.2.33 లక్షల కోట్లతో పోలిస్తే 9.44 శాతం అధికం.  హోంశాఖకు చేసిన కేటాయింపుల్లో ‘పోలీసు’ పద్దు కింద రూ.1.73 లక్షల కోట్లను ప్రత్యేకించారు. మొత్తం హోంశాఖ బడ్జెట్‌లో ఇది 68 శాతం. అంతరిక్ష విభాగానికి.. అంతరిక్ష విభాగానికి ఈ దఫా రూ.13,705.60 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.13,416 కోట్లతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదలే. అయితే 2025-26కు సంబంధించిన సవరించిన అంచనాల ప్రకారం అంతరిక్ష విభాగానికి వాస్తవానికి రూ.12,448.60 కోట్లే అందాయి.  తాజా బడ్జెట్‌లో ‘అంతరిక్ష పరిజ్ఞాన’ పద్దు కింద రూ.10,397.06 కోట్లను కేటాయించారు. దీనికింద ఇస్రోలోని వివిధ కేంద్రాలకు, వాహకనౌక, ఉపగ్రహ ప్రాజెక్టులకు నిధులు అందుతాయి.  నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖకు 2026-27 సంవత్సరానికి రూ.9,885.80 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాది బడ్జెట్‌ అంచనాల కన్నా 62 శాతం ఎక్కువ. ఈ నిధుల్లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన ‘పీఎం సేతు’కు రూ.6,140.50 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధికి రూ.6,100 కోట్లు కేటాయించగా తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2,703.54 కోట్లకు చేరింది. 

Current Affairs

వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ)

ద్రవ్యోల్బణ  అంచనాకు ఉపయోగించే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) లెక్కింపునకు కేంద్ర ప్రభుత్వం కొత్త సూత్రాన్ని అనుసరించడానికి సిద్ధమైంది. వినియోగదారుల వ్యవహార శైలిలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకొని ఈ సూచికను కచ్చితంగా నిర్ధారించేందుకు అవసరమైన కొత్త విధాన రూపకల్పన కోసం కేంద్ర గణాంకాల శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఇందులోని ముఖ్యాంశాలు..  సీపీఐ లెక్కింపునకు ఇప్పటివరకూ ప్రామాణిక సంవత్సరంగా ఉన్న 2011-12కు బదులు 2023-24ను తీసుకోవాలని సిఫార్సు చేసింది.  సీపీఐ లెక్కింపు కోసం మొత్తం 12 డివిజన్లు, 43 గ్రూపులు, 62 తరగతులు, 192 ఉప తరగతులనుంచి 358 వస్తువులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. 

Current Affairs

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2026, జనవకి 31న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో అయిదో సీడ్‌ రిబకినా 6-4, 4-6, 6-4తో టాప్‌ సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌)పై విజయం సాధించింది. రిబకినా 2022 (వింబుల్డన్‌)లో తన తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. సబలెంకా తన చివరి నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో మూడు ఓడిపోయింది. 

Current Affairs

‘రామ్‌సర్‌’ జాబితాలోకి మరో రెండు చిత్తడి నేలలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం, గుజరాత్‌లోని ఛారీ ఢాండ్‌ ప్రాంతాలు రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలోకి చేరాయి. దీంతో భారత్‌లో రామ్‌సర్‌ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 98కి చేరింది.  సముద్ర, నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటితో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు అంటారు. 

Current Affairs

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర

నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ దివంగత అధినేత అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ (62) 2026, జనవరి 31న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె ఖ్యాతి గడించారు. సునేత్రకు ఎక్సైజ్‌ శాఖ కేటాయించారు.

Current Affairs

కంప్యూటర్‌ దీదీ- దీదీకా దుకాణ్‌

గ్రామీణ మహిళలకు డిజిటల్‌ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘కంప్యూటర్‌ దీదీ- దీదీకా దుకాణ్‌’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పైలట్‌ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఉంది. యునిసెఫ్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్టు కింద 2,500 మంది మహిళల్ని లక్షాధికారు (లఖ్‌పతి దీదీ)లుగా తయారుచేయాలన్నది లక్ష్యం. 

Internship

సన్‌ ఇండియా ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ కంపెనీలో పోస్టులు

సన్‌ ఇండియా ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ కంపెనీ కోఆర్డినేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: సన్‌ ఇండియా ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్స్‌  పోస్టు పేరు: కోఆర్డినేషన్‌ ఎగ్జిక్యూటివ్‌  నైపుణ్యాలు: కోఆర్డినేషన్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఈమెయిల్‌ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-వర్డ్, షెడ్యూలింగ్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.12,000 - రూ.20,000.  వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 28-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-email-marketing-internship-at-quantum-it-innovation1769679359

Government Jobs

ఎస్‌సీఎంపీకేలో సీనియర్ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు

కోల్‌కతాలోని శ్యాంప్రసాద్‌ ముఖర్జీ పోర్టు (ఎస్‌సీఎంపీకే) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సీనియర్‌ డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సీనియర్ డిప్యూటీ మేనేజర్‌: 04 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 37 ఏళ్లు. జీతం: నెలకు రూ.32,900 - రూ.58,000. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా. ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 17. Website:https://smp.smportkolkata.in/smpk/en/job-openings/

Government Jobs

ఐఐటీ జమ్మూలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జమ్మూ (ఐఐటీ జమ్మూ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(ఎలక్ట్రోకెమిస్ట్రీ స్పెషలైజేషన్‌ కెమికల్ సైన్సెస్‌)లో ఉత్తీర్ణతతో పాటు యూజీసీ/సీఎస్‌ఐఆర్ గేట్‌/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.31,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 13, Website:https://www.iitjammu.ac.in/post/advt-IITJMURCRP-100334A-160-jrf