Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ఆర్థిక సంఘం నివేదిక

గత 11 ఏళ్లలో రెండు ఆర్థిక సంఘాలు చేసిన సిఫార్సులు తారుమారైనట్లు ఆర్థిక సంఘం నివేదికలోని అంశాల విశ్లేషణ ఆధారంగా వెల్లడైంది. పన్నులు, గ్రాంట్ల రూపంలో 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల కంటే వాస్తవంగా రాష్ట్రాల ఖజానాలకు చేరిన మొత్తం దాదాపు 20% తగ్గగా, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే రాష్ట్రాలకు వచ్చిన వాస్తవ మొత్తం 23% పెరిగింది. గత రెండు ఆర్థిక సంఘాల కాలంలో అవి సిఫార్సు చేసిన పన్నులు, గ్రాంట్ల మొత్తంకన్నా రాష్ట్రాలకు 0.42% మొత్తం అధికంగా వచ్చింది. గత 11 ఏళ్లలో పన్నుల రూపంలో రూ.90,28,122 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.17,71,438 కోట్లు కలిపి రూ.1,07,99,562 కోట్లను రాష్ట్రాలకు బదిలీ చేయాలని అవి సిఫార్సు చేశాయి. వాస్తవంగా పన్నుల రూపంలో రూ.93,82,951 కోట్లు (+3.93%), గ్రాంట్ల రూపంలో రూ.14,62,475 కోట్లు (-17,44%) వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం కాలంలో పన్నుల్లో వాటాలో 21.05%, గ్రాంట్లలో 8.85% మేర కోతపడింది. 15వ ఆర్థిక సంఘం ఒక్క 2020-21 సంవత్సర కాలానికి విడిగా చేసిన సిఫార్సుల్లో పన్నుల్లో 30.39%, గ్రాంట్లలో 8.43% మేర ఆదాయం తగ్గింది. అదే ఆర్థిక సంఘం 2021-26 మధ్యకాలానికి చేసిన సిఫార్సుల్లో పన్నుల వాటా 34.23% పెరగ్గా, గ్రాంట్లు 23.66% తగ్గాయి.

Current Affairs

2-నానోమీటర్‌ సెమీకండక్టర్‌

కొత్తతరం అవసరాలకు అనుగుణంగా నానో మీటర్‌ సెమీకండక్టర్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2026, ఫిబ్రవరి 7న బెంగళూరులో ఆవిష్కరించారు. క్వాల్‌కమ్‌ సంస్థ అభివృద్ధి చేసిన 2నానోమీటర్‌ (ఎన్‌ఎం) సెమీకండక్టర్‌ భారతీయ 5వ పారిశ్రామిక విప్లవానికి ప్రతీకగా ఆవిష్కృతమైందన్నారు. అత్యాధునిక మైక్రో ఎలక్ట్రానిక్స్‌లతో తయారైన ఈ చిప్‌లో 20-30 బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. జీపీయూ, సీపీయూల సామర్థ్యం ఒకే చిప్‌లో ఉన్న ఈ సెమీకండక్టర్‌ కొత్తతరం కృత్రిమ మేధను ఆటోమొబైల్స్, విమానాలు, హైస్పీడ్‌ రైళ్ల సేవల్లో విస్తృతంగా వినియోగించేందుకు దోహదపడుతుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Current Affairs

వింటర్‌ ఒలింపిక్స్‌

వింటర్‌ ఒలింపిక్స్‌ ఇటలీలోని మిలన్‌లో 2026, ఫిబ్రవరి 7న ఘనంగా మొదలయ్యాయి. ఇటలీలోనే అతి పెద్ద స్టేడియమైన సా సిరోలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పరేడ్‌లో అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ భారత మువ్వన్నెల పతాకాన్ని చేబూని మన బృందానికి నాయకత్వం వహించాడు. అతడు కాకుండా భారత్‌ నుంచి స్టాంజిన్‌ లండప్‌ మాత్రమే ఈ క్రీడల్లో పోటీపడుతున్నాడు. అల్పైన్‌ స్కీయింగ్‌లో అరిఫ్, క్రాస్‌ కంటీ స్కీయింగ్‌ స్టాంజిన్‌ అర్హత సాధించారు. మిలన్‌తో పాటు కోర్టినా డంపెజో ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. 

Current Affairs

మోదీ మలేసియా పర్యటన

మలేసియాలో రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 7న కౌలాలంపూర్‌ చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఉమ్మడిగా రూపాంతరీకరణను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్‌-మలేసియా భాగస్వామ్యం’ (ఇంపాక్ట్‌) అనేదే రెండు దేశాలకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం, ఇద్దరు మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. భరతనాట్యం, కథకళి, కూచిపూడి, ఒడిస్సీ తదితర శాస్త్రీయ నృత్యాలతో 800 మంది కళాకారులు మోదీని స్వాగతించడం ‘మలేసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో నమోదైంది.

Walkins

ఈఎస్‌ఐసీ జైపుర్‌లో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు

జైపుర్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్  పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: సీనియర్‌ రెసిడెంట్ - 43 విభాగాలు: ఐసీయూ, అనస్థీషియాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ,   గైనకాలజీ, న్యూరాలజీ, బయోకెమిస్ట్రీ తదితర విభాగాలు...   అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/పీజీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసి ఉండాలి. జీతం: నెలకు రూ.67,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 25. వేదిక: ఈఎస్ఐసీ  మెడికల్ కాలేజీ & హాస్పిటల్ లక్ష్మీ నగర్, అజ్మీర్ రోడ్, జైపుర్, రాజస్థాన్ - 302006. Website:https://esic.gov.in/recruitments

Internship

స్టాల్‌వార్ట్‌ పీపుల్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

స్టాల్‌వార్ట్‌ పీపుల్‌ కంపెనీ హ్యూమన్‌ రిసోర్సెస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: స్టాల్‌వార్ట్‌ పీపుల్‌ పోస్టు పేరు: హ్యూమన్‌ రిసోర్సెస్‌  నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-వర్డ్‌లొ నైపుణ్యం ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు రూ.2,000 - రూ. 2,500.  వ్యవధి: 2 నెలలు దరఖాస్తు గడువు: 27-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-human-resources-hr-internship-at-stalwart-people-company-spc1769578807

Government Jobs

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్, గుజరాత్ స్పోర్ట్స్ కోటాలో రెగ్యులర్‌ ప్రాతిపదికన మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, టాక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 46 వివరాలు: 1. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ -28 2. టాక్స్ అసిస్టెంట్ - 18 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు టాక్స్ అసిస్టెంట్ పోస్టుకు  కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు టాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 – రూ.81,100. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ కు రూ.18,000 – రూ.56,900. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 21. Website:https://incometaxgujarat.gov.in/

Government Jobs

ఎయిమ్స్ దిల్లీలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

దిల్లీలోని  ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - I  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - I  అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎల్‌టీ/డీఎంఎల్‌టీ/డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల మించకూడదు. జీతం: నెలకు రూ.20,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా aiprojecticmr@gmail.com కు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: 27.02.2026.  Website:https://www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment

Admissions

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌ యూజీ) 2026

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (నీట్‌ యూజీ 2026) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. వివరాలు: నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌ యూజీ) 2026 అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 17 ఏళ్లు నిండి ఉండాలి. పరీక్ష వ్యవధి: 180 నిమిషాలు (3 గంటలు). దరఖాస్తు రుసుము: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.1700 కాగా, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జండర్‌ అభ్యర్థులకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్థులైతే దరఖాస్తు రుసుం రూ.9500లుగా నిర్ణయించారు.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08.03.2026.  నీట్ పరీక్ష తేదీ: మే 4న మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు జరగనుంది.  Website:https://neet.ntaonline.in/

Walkins

Senior Resident Jobs In ESIC Jaipur

The Employees' State Insurance Corporation (ESIC) in Jaipur is conducting interviews to fill Senior Resident posts on a contract basis.  Details: Senior Resident - 43 Departments: ICU, Anesthesiology, Medicine, Pediatrics, Radiology, Orthopedics, Cardiology, Nephrology, Medical Oncology, Gynecology, Neurology, Biochemistry, and other departments. Eligibility: Depending on the post, candidates must have passed a Diploma/PG/DNB in ​​the relevant field from a recognized university and be registered with the State Medical Council. Salary: per month Rs. 67,000  Selection Process: Based on interview. Interview Date: February 25, 2026 Venue: ESIC Medical College & Hospital, Lakshmi Nagar, Ajmer Road, Jaipur, Rajasthan - 302006. Website:https://esic.gov.in/recruitments