Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

అమెరికాతో బంగ్లాదేశ్‌ వాణిజ్య ఒప్పందం

అమెరికా, బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. దీంతో బంగ్లాపై సుంకాలు ప్రస్తుతమున్న 20 శాతం నుంచి.. 19 శాతానికి తగ్గనున్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్‌ గ్రీర్, బంగ్లాదేశ్‌ వాణిజ్య ప్రతినిధి షేక్‌ బషీరుద్దీన్‌లు వాషింగ్టన్‌లో ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు.   దుస్తుల తయారీకి అమెరికా నుంచి దిగుమతయ్యే కాటన్, ఫైబర్‌లను ఉపయోగించేందుకు తాము అంగీకరించినట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ వెల్లడించారు. ఇలా తయారుచేసి ఎగుమతి చేసే దుస్తులకు అమెరికా మార్కెట్‌లో సుంకాలు ఉండబోవని పేర్కొన్నారు. 

Current Affairs

జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

ప్రతిష్ఠాత్మక ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌-2026’ పురస్కారం, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌కు దక్కింది. 2026, ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా ‘టెక్‌ బయో అన్‌షీల్డ్‌: ఏఐ ఆటోమేషన్‌-బయాలజీ రివల్యూషన్‌’ అనే థీమ్‌తో ‘బయో ఆసియా సదస్సు-2026’ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా పురస్కార విజేతను ఫిబ్రవరి 10న ప్రభుత్వం ప్రకటించింది. సదస్సులోనే ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. 

Current Affairs

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజి మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ 2026, ఫిబ్రవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 37 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరైన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 32 మంది సేవలందిస్తున్నారు. బాలాజి నియామకంతో ఆ సంఖ్య 33కి చేరింది. న్యాయవాదుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు బాలాజి పేరును హైకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది.

Current Affairs

ప్రపంచ అవినీతి సూచీ 2025

ప్రపంచ అవినీతి సూచీ-2025ను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ 2026, ఫిబ్రవరి 10న విడుదల చేసింది. భారత్‌లో అవినీతి తగ్గుముఖం పట్టిందని సంస్థ వెల్లడించింది. ప్రపంచ అవినీతి సూచీ 2024లో 96వ స్థానంలో ఉన్న భారత్‌ 2025 నాటికి 91వ స్థానానికి ఎగబాకిందని పేర్కొంది.  విభిన్న కసరత్తులు, నిపుణుల విశ్లేషణలు, సర్వేల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు. ఇందులో 0 పాయింట్లు సాధించిన దేశం పూర్తి అవినీతిమయమని, 100 పాయింట్లు పొందిన దేశంలో అవినీతి లేనేలేదని అర్థం. డెన్మార్క్‌ 100కు 89 పాయింట్లు పొంది అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా అగ్రభాగాన నిలిచింది. తదుపరి రెండు స్థానాలు ఫిన్లాండ్, సింగపూర్‌లకు దక్కాయి.

Walkins

ఐఐటీ గువాహటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి ఒప్పంద ప్రాతిపదికన  అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 09 వివరాలు: అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. జీతం: నెలకు రూ.40,000. ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 25, వేదిక: ఈఈఈ కాన్ఫరెన్స్ రూమ్, ఐఐటి గువాహటీ. Website:https://www.iitg.ac.in/iitg_reqr?ct=RzNJNURKa005enFYa3RJWWtvM2cvQT09

Walkins

ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ (ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌: 18 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు. జీతం: నెలకు రూ.40,000 - రూ.55,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 20. Website:https://www.ecil.co.in/jobopenings

Internship

ఎన్‌ఐటీ వరంగల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), వరంగల్‌ ఇంటర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: ఇంటర్న్స్‌  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంటెక్‌ లేదా బీటెక్‌లో, ఎంసీఏలో ఉత్తీర్ణత ఉండాలి. జీతం: నెలకు రూ.10,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 15. Website:https://nitw.ac.in/page/?url=/careersnitw/Jobs/

Government Jobs

నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో పోస్టులు

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సైంటిఫిక్‌/టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఏ (గ్రూప్-బి, నాన్‌-గేజిటెట్‌ ఎస్‌ అండ్‌ టీ) పోస్టుల భర్తీకి షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  వివరాలు:  సైంటిఫిక్‌/టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఏ- 376 పోస్టులు  (అన్‌ రిజర్వ్‌డ్‌- 154; ఎస్సీ- 56; ఎస్టీ- 28; ఓబీసీ- 101; ఈడబ్ల్యూఎస్‌- 37) అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ఎంఎస్‌/ఎంసీఏ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు 2024/25/26 సంవత్సరాల్లో పొందిన వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి. జీతం: నెలకు రూ.35,400- రూ.1,12,400. దరఖాస్తు విధానం: గేట్-2026 ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 10 రోజుల్లోపు, వివరణాత్మక ప్రకటన ఎన్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్లో తాత్కాలికంగా అందుబాటులో ఉంటుంది. గమనిక: పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. గేట్‌-2026 ఫలితాలు విడుదల: 11.03.2026. చివరి తేదీ: 21.3.2026 Website:https://recruitment.nic.in/

Government Jobs

ఐఐటీ గువాహటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గువాహటి  (ఐఐటీ గువాహటి) ఒప్పంద ప్రాతిపదికన వివిద విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 09 వివరాలు: 1. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో - 03 2. బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01  3. అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 01  4. టెక్నికల్ అసిస్టెంట్: 02  5. ఆఫీస్ అసిస్టెంట్ (గ్రాఫిక్ డిజైన్): 02  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/డిప్లొమా/ బీటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/సీఏ/సీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. జీతం: నెలకు రూ.13,050. - రూ.44,910. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా nest@iitg.ac.in కు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 16, Website:https://www.iitg.ac.in/iitg_reqr?ct=RzNJNURKa005enFYa3RJWWtvM2cvQT09

Government Jobs

ఎయిమ్స్‌ బీబీనగర్‌లో జూనియర్ రెసిడెంట్‌ ఉద్యోగాలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), బీబీనగర్‌ జూనియర్ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: జూనియర్ రెసిడెంట్‌: 13  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,180, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.944. ఇతరులకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 23. Website:https://aiimsbibinagar.edu.in/recruitment.html