ఎన్‌ఐఐఎంహెచ్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
హైదరాబాద్, గడ్డి అన్నారంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్‌కు చెందిన (సీసీఆర్ఏఎస్) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఎన్‌ఐఐఎంహెచ్) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఆయుర్వేద): 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.42,000. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. ఈ మెయిల్:niimh.hyderabad@gmail.com; niimh.hyderabad@gov.in. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఈ మెయిల్ చేయాల్సిన చివరి తేదీ: 29-10-2024. ఇంటర్వ్యూ తేదీ: 01-11-2024. వేదిక: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఎన్‌ఐఐఎంహెచ్), రెవెన్యూ బోర్డ్ కాలనీ, గడ్డి అన్నారం, హైదరాబాద్. Website:https://niimh.nic.in/#/home