Posts

Current Affairs

Vigyan Bhawan

♦ The Union Government launched Gram Panchayat-Level Weather Forecasting in Vigyan Bhawan, New Delhi on 24 October 2024. This initiative, developed in collaboration between the Ministry of Panchayati Raj (MoPR) the India Meteorological Department (IMD), and the Ministry of Earth Sciences (MoES), marks a major step forward in climate preparedness at the grassroots level.  ♦ Rajiv Ranjan Singh alias Lalan Singh, Minister of Panchayati Raj, Dr Jitendra Singh, Minister of State (Independent Charge) for Science and Technology & Earth Sciences, and Prof. S. P. Singh Baghel, Minister of State for Panchayati Raj have participated in this event. ♦ The initiative will provide Gram Panchayats with a five-day weather forecast and hourly updates, enabling rural communities to plan agricultural activities better and prepare for weather-related risks. ♦ The launch of the Gram Panchayat-Level Weather Forecasting system is a momentous milestone in empowering rural communities and building a climate-resilient India. It will help rural populations make informed decisions about agricultural activities, disaster preparedness, and infrastructure planning, ensuring a higher quality of life and contributing to the nation’s progress.

Current Affairs

Noor Rahman Sheikh

♦ India’s Ambassador to Lebanon, Noor Rahman Sheikh handed over the first tranche of humanitarian assistance sent by India to Lebanon on 24 October 2024.   ♦ Lebanon’s Health Minister Firas Abiad received the consignment of medicines.  ♦ On 18 October 2024, India had dispatched the first tranche of 11 tons of medical supplies to Lebanon as part of a humanitarian effort to support the nation amid rising tensions and the ongoing conflict in southern Lebanon. A total of 33 tons of medical supplies are being sent.

Current Affairs

Sanjeev Khanna

♦ Justice Sanjeev Khanna was appointed as the 51st Chief Justice of India on 24 October 2024. He will take the oath of office on November 11. Khanna is expected to serve a six-month term, concluding in May 2025. ♦ The current Chief Justice of India DY Chandrachud will retire on November 10. He took over as the CJI on 8 November 2022.  ♦ Recently Chandrachud recommended Justice Sanjiv Khanna's name as his successor. He is the second-most senior judge of the Supreme Court. ♦ Born on May 14, 1960, Justice Khanna began his legal career after enrolling as an advocate with the Bar Council of Delhi in 1983. ♦ He was a member of the Constitution Bench that upheld the dilution of Article 370 of the Constitution in Jammu and Kashmir.

Current Affairs

Prime Minister

♦ The Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved two railway projects of Ministry of Railways with total estimated cost of Rs.6,798 crore (approx.) on  24 October 2024.  ♦ Two approved projects are – (a) doubling of Narkatiaganj-Raxaul-Sitamarhi-Darbhanga & Sitamarhi-Muzaffarpur Section covering 256 kms and (b) construction of new line between Errupalem and Namburu via Amaravati covering 57 kms to be completed in 5years.  ♦ The Two projects covering 8 districts in 3 states i.e., Andhra Pradesh, Telangana and Bihar will increase the existing network of Indian Railways by about 313 kms. Other decisions: ♦ The Union Cabinet has also approved the creation of a Rs.1,000 crore venture capital fund dedicated to the space sector, under the supervision of the Indian National Space Promotion and Authorization Center (IN-SPACe). ♦ The fund is expected to deploy an average of Rs.150-250 crore per year, depending on the investment landscape and startup requirements. As part of India’s 2020 space reforms, IN-SPACe was established to promote private sector participation in space activities. Currently, India’s space economy is valued at $8.4 billion, with a target to expand it to $44 billion by 2033. 

Current Affairs

Rajnath Singh

♦ Defence Minister Rajnath Singh inaugurated the second edition of Indian Army's flagship international seminar, the Chanakya Defence Dialogue, at the Manekshaw Centre, New Delhi on 24 October 2024. ♦ "Drivers in Nation Building: Fuelling Growth Through Comprehensive Security" is the theme for this seminar. ♦ Rajnath Singh also launched the Indian Army’s Green Initiative 1.0 and Digitisation of IA 1.0. 

Current Affairs

యూఎన్‌ఈపీ నివేదిక

ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఉద్గారాల వ్యత్యాస వార్షిక నివేదికను 2024, అక్టోబరు 24న విడుదల చేసింది. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు ప్రపంచ దేశాలన్నీ కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ఇప్పటికే భూతాపం 1.3 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగినట్లు తెలిపింది. ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలో కొనసాగితే.. ఈ శతాబ్దాంతానికి భూతాపం మరో 1.8 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే ముప్పుందని హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్న హామీలను అన్ని దేశాలూ పక్కాగా నెరవేరిస్తే ఈ పెరుగుదలలో 0.5 డిగ్రీల మేర కోత పెట్టొచ్చని పేర్కొంది. అయినప్పటికీ వడగాలులు, కార్చిచ్చులు, తుపానులు, కరవుల వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను తగ్గించడం కష్టమేనని అభిప్రాయపడింది. 

Current Affairs

సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

దేశ సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 2024, అక్టోబరు 24న నియమితులయ్యారు. తన పదవీ కాలం నవంబరు 10న ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును ఇటీవల సిఫార్సు చేశారు. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. నూతన సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నవంబరు 11న ప్రమాణం చేయనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. 2025 మే 13 వరకు జస్టిస్‌ ఖన్నా సీజేఐగా కొనసాగుతారు. 1960 మే 14న జన్మించిన సంజీవ్‌ ఖన్నా దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు.

Current Affairs

ధ్యాన్‌చంద్‌ స్థానంలో అర్జున

క్రీడల్లో సేవలకు గాను అందించే ధ్యాన్‌చంద్‌ జీవిత కాల పురస్కారం స్థానంలో 2024 నుంచి నుంచి కొత్తగా అర్జున జీవిత కాల పురస్కారాన్ని అందచేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2024, అక్టోబరు 24న ప్రకటించింది. దేశంలో క్రీడా పురస్కారాలను హేతుబద్ధం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  దిగ్గజ హాకీ ఆటగాడు, దివంగత మేజర్‌ ధ్యాన్‌చంద్‌ పేరు మీద 2002లో ధ్యాన్‌చంద్‌ జీవిత కాల పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. 

Current Affairs

రాణి రాంపాల్‌

భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (29) 2024, అక్టోబరు 24న ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. హరియాణాకు చెందిన ఈమె 16 ఏళ్ల కెరీర్‌లో భారత్‌ తరఫున 254 మ్యాచ్‌లు ఆడి, దాదాపు 200 గోల్స్‌ చేసింది.   రాణి గౌరవార్థం ఆమె జెర్సీ నంబర్‌ 28కు రిటైర్మెంట్‌ ప్రకటించిన హాకీ ఇండియా, తనకు రూ.10 లక్షల నగదు బహుమతి కూడా అందజేసింది. 

Current Affairs

అర్జున్‌ ఇరిగేశి

భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత 2800 లైవ్‌ రేటింగ్‌ పాయింట్లకు చేరుకున్న రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. యూరోపియన్‌ క్లబ్‌ చెస్‌ టోర్నీలో 2024, అక్టోబరు 24న అయిదో రౌండ్లో ఆంద్రీకిన్‌ ద్మిత్రిపై గెలుపుతో అర్జున్‌ ఈ మైలురాయిని అందుకున్నాడు. లైవ్‌ రేటింగ్స్‌లో అతడు ప్రస్తుతం 2802.1 పాయింట్లతో ఉన్నాడు. చెస్‌ చరిత్రలో అర్జున్‌ కంటే ముందు 15 మంది మాత్రమే 2800 రేటింగ్‌ పాయింట్లు సాధించారు. అతడు ఈ టోర్నీలో అల్కలాయిడ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  2011 మార్చిలో విశ్వనాథన్‌ ఆనంద్‌ అత్యధికంగా 2817 రేటింగ్‌ను అందుకున్నాడు.