జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2025
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు మెయిన్ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. వివరాలు: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2025 అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్)-2025 పరీక్షకు హాజరు కావచ్చు. పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు. పేపర్-1 300, పేపర్-2 400 మార్కులకు ఉంటుంది. ఛాయిస్ ఎత్తివేత జేఈఈ మెయిన్ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎత్తివేశారు. జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, జగిత్యాల. ఏపీ: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. తొలి విడత ఆన్‌లైన్ దరఖాస్తులు: అక్టోబర్ 28 నుంచి నవంబరు 22 వరకు. హాల్‌టికెట్లు: పరీక్షకు 3రోజుల ముందు. పరీక్షలు: జనవరి 22- జనవరి 31 మధ్య. ఫలితాలు: ఫిబ్రవరి 12 నాటికి. రెండో విడత ఆన్‌లైన్ దరఖాస్తులు: జనవరి 31- ఫిబ్రవరి 24 వరకు. హాల్‌టికెట్లు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు. పరీక్షలు: ఏప్రిల్ 1- 8 మధ్య. ఫలితాలు: ఏప్రిల్ 17 నాటికి. ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్‌చేయవచ్చు. Website:https://jeemain.nta.nic.in/ Apply online:https://examinationservices.nic.in/JeeMain2025/root/Home.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgDUffqDdG1LTsAPBKFcEC9W88CTkt2ITzilIsFR7gKxO