Posts

Current Affairs

G20 Summit

♦ The 19th G20 Summit started at the Museum of Modern Art in Rio de Janeiro of Brazil on 18 November 2024. ♦ The heads of member states and representatives of international organizations participated in the various sessions and deliberate on the priority areas of this year’s declaration. ♦ This year (2024) G20 summit starts with the theme of “Building a just and sustainable world”. 

Current Affairs

K Sanjay Murthy

♦ President Droupadi Murmu appointed K Sanjay Murthy as the new Comptroller and Auditor General (CAG) of India on 18 November 2024. ♦ He is an IAS officer of the 1989 batch, belonging to the Andhra Pradesh cadre. Currently, he is serving as the Secretary of the Department of Higher Education in the Ministry of Education. ♦ Murthy will replace Girish Chandra Murmu, who was appointed as the CAG in August 2020.  ♦ The Comptroller and Auditor General of India is empowered to audit all union and state government departments, including railways, defence, India post, and telecommunications. ♦ Moreover, the CAG can audit over 1500 public commercial enterprises, over 400 non-commercial autonomous bodies, various bodies and authorities “substantially financed” from union government bodies and local bodies, Panchayati raj institutions. ♦ The CAG is empowered through Article 149 of the Constitution, called the “CAG’s Duties, Powers and Conditions Act in 1971.”

Current Affairs

దేశంలోనే తొలి మిథనాల్‌ తయారీ ప్లాంట్‌!

దేశంలోనే తొలిసారి సింగరేణి సంస్థకు చెందిన థర్మల్‌ విద్యుత్కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ తయారీ ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తోంది. రోజుకు 500 కేజీల కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి 180 కిలోల మిథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తోంది. కోల్‌ ఇండియా, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి చేసిన ప్రయోగం సఫలమైతే భారీ మిథనాల్‌ యూనిట్‌ స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో గల సింగరేణి థర్మల్‌ విద్యుత్కేంద్రం పక్కనే ఈ ప్లాంటును నిర్మిస్తోంది.  థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల కార్బన్‌ డయాక్సైడ్‌ను సేకరించి, హైడ్రోజన్‌తో కలిపి చివరిగా మిథనాల్‌ ద్రవాన్ని పొందేలా ప్లాంటును ఏర్పాటుచేస్తోంది.

Current Affairs

మల్లికా శ్రీనివాసన్‌

ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక బోర్డు (పీఈఎస్‌బీ) అధిపతిగా మరో ఏడాదీ మల్లికా శ్రీనివాసన్‌ను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె వయసు 65 ఏళ్లు దాటిన తర్వాత కూడా,  పదవీ కాలాన్ని పొడిగించారు. ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ (టీఏఎఫ్‌టీ) ఛైర్మన్, ఎండీగా మల్లికా శ్రీనివాసన్‌ ఉన్నారు.  2021 ఏప్రిల్‌లో పీఈఎస్‌బీ ఛైర్‌పర్సన్‌గా మూడేళ్ల కాలానికి ఆమెను ప్రభుత్వం నియమించింది. 2024 ఏప్రిల్‌ 9న ఆమె పదవీ కాలం పూర్తవగా, నవంబరు 18న ఆమె వయసు 65 సంవత్సరాలు దాటే వరకు ఆమెను కొనసాగిస్తున్నట్లు అప్పట్లో పేర్కొంది. తాజాగా మరో ఏడాది గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Current Affairs

2024-25లో భారత వృద్ధి రేటు 6.7%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారతదేశ వృద్ధి రేటును మోర్గాన్‌ స్టాన్లీ 6.7 శాతానికి పరిమితం చేసింది. గతంలో అంచనా వేసిన 7% నుంచి 0.3% తగ్గించింది. జులై-సెప్టెంబరులో అంచనా వేసిన దాని కంటే బలహీన గణాంకాలు నమోదు కానుండటంతోనే, మొత్తం ఆర్థిక సంవత్సరానికి అంచనాలను తగ్గించినట్లు పేర్కొంది.  2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో 6.5% వృద్ధి రేటు అంచనాలను మాత్రం మార్పు చేయకుండా స్థిరంగా ఉంచింది. ద్రవ్యోల్బణం 2024-25లో 4.9%, 2025-26లో 4.3% నమోదు కావొచ్చని అంచనా వేసింది. 

Current Affairs

అమెరికా, ఫిలిప్పీన్స్‌ల మధ్య సైనిక ఒప్పందం

ఫిలిప్పీన్స్‌కు అమెరికా అందించే కీలక ఆయుధాలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం, ముఖ్య సాంకేతికతను బదిలీ చేసేలా 2024, నవంబరు 18న మనీలాలో రెండు దేశాల మధ్య సైనిక ఒప్పందం జరిగింది.  ఈ రెండు దేశాల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాలతో పాటు భారీ సంయుక్త సైనిక విన్యాసాలు చేసేలా అమెరికా, ఫిలిప్పీన్స్‌ దేశాల రక్షణ మంత్రులు లాయిడ్‌ ఆస్టిన్, గిల్‌బర్టో టియోడోరోలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Current Affairs

ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ

ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో ఇటలీ స్టార్‌ యానెక్‌ సినర్‌ విజేతగా నిలిచాడు. 2024, నవంబరు 18న ట్యూరిన్‌ (ఇటలీ)లో జరిగిన పురుషుల సింగిల్స్‌ తుదిపోరులో అతడు 6-4, 6-4తో ఫ్రిట్జ్‌ (అమెరికా)ను ఓడించాడు. ఈ పోరులో 14 ఏస్‌లు సంధించిన సినర్‌.. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏటీపీ సీజన్లో జోరు కొనసాగిస్తున్న అతడు గత 27 మ్యాచ్‌ల్లో 26 విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్, యుఎస్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచి నంబర్‌వన్‌ ర్యాంకునూ సొంతం చేసుకున్నాడు.

Current Affairs

ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌-2024

యూఎస్‌ఏకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ రూపొందించిన ఓపెన్‌ డోర్స్‌ రిపోర్ట్‌-2024ను న్యూదిల్లీలో 2024, నవంబరు 18న భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి విడుదల చేశారు. ఇందులోని ముఖ్యాంశాలు.. అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించే దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. భారత్, చైనా తర్వాత జాబితాలో దక్షిణకొరియా, కెనడా, తైవాన్‌ దేశాలు ఉన్నాయి. గత విద్యా సంవత్సరం (2023-24) నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్‌ తొలిస్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే.  అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా.. వారిలో 29 శాతం మంది మనవాళ్లే. 

Current Affairs

భారత కాగ్‌గా కొండ్రు సంజయ్‌మూర్తి

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ను 15వ కాగ్‌గా నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ 2024, నవంబరు 18న పేర్కొంది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న గిరీశ్‌చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్‌మూర్తికి అవకాశం కల్పించారు. ఈ పదవి చేపట్టబోతున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి రికార్డులకెక్కారు. ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది.

Private Jobs

Associate Technical Support Engineer Posts In Powerschool

PowerSchool Company, Bangalore.. is inviting applications for filling up the vacancies of Associate Technical Support Engineer. Details: Post: Associate Technical Support Engineer  Company: PowerSchool  Experience: 0-2 years. Qualification: Any Degree Skills: Salesforce experience, customer service, communication skills (listening, writing) etc. Job Location: Bangalore. Application Mode: Through Online Last date: 16.12.2024 Website:https://www.powerschool.com/