Posts

Current Affairs

అంతర్జాతీయ ముప్పుగా ‘మెదడువాపు’

అంటు, స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించిన మెదడువాపు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. దీంతో ఇది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా మారింది. డబ్ల్యూహెచ్‌వో, ఎన్‌సెఫలిటిస్‌ ఇంటర్నేషనల్‌ ఈ వ్యాధిపై క్లిష్ట సాంకేతిక సమాచారాన్ని అందించడం ప్రారంభించాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాధితో ఇబ్బందులు, దాని నిరోధానికి తీసుకోవలసిన మరిన్ని చర్యలు, సమాచార సేకరణ-పర్యవేక్షణ, రోగనిర్ధారణ, చికిత్స, చికిత్సానంతర సంరక్షణ, అవగాహన, పరిశోధనల అవిష్కరణలు లాంటివి ఉన్నాయి. 

Current Affairs

దిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణం

దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా 2025, ఫిబ్రవరి 20న రామ్‌లీలా మైదానంలో ప్రమాణం చేశారు. అదే వేదికపై మంత్రులుగా మరో ఆరుగురితోనూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్‌ వర్మ, కపిల్‌ మిశ్రా, మంజిందర్‌ సింగ్‌ సిర్సా, ఆశీశ్‌ సూద్, రవీందర్‌ ఇంద్రజ్‌ సింగ్, పంకజ్‌ సింగ్‌ ఉన్నారు.

Current Affairs

ఆర్థిక నిపుణుల పదవీ కాలాల పొడిగింపు

నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) బీవీఆర్‌ సుబ్రమణ్యం పదవీ కాలాల్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన 2023 ఫిబ్రవరిలో రెండేళ్ల కాలానికి నీతి ఆయోగ్‌ సీఈవోగా నియమితులయ్యారు. పదవీ కాలం ముగుస్తుండటంతో తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్‌ నియామకాల కమిటీ 2025, ఫిబ్రవరి 20న మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది.  కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ పదవీ కాలాన్ని కేంద్రం రెండేళ్లు పొడిగించింది. 2022 జనవరి 28న తొలుత ఆయన సీఈఏగా నియమితులయ్యారు. 

Current Affairs

రోహిత్‌ శర్మ

వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగుల సాధించిన బ్యాటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. 2025, ఫిబ్రవరి 20న దుబాయ్‌ కేంద్రంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్‌ 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.  కోహ్లి (222 ఇన్నింగ్స్‌) ముందున్నాడు.  11 వేల వన్డే పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌ రోహిత్‌. 

Current Affairs

పంకజ్‌ అడ్వాణీ

భారత క్యూ స్పోర్ట్స్‌ స్టార్‌ పంకజ్‌ అడ్వాణీ ఆసియా స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 2025, ఫిబ్రవరి 20న దోహాలో జరిగిన ఫైనల్లో అమీర్‌ సార్కోష్‌ (ఇరాన్‌)పై 4-1తో పంకజ్‌ విజయం సాధించాడు. పంకజ్‌కి ఇది 14వ ఆసియా టైటిల్‌.  ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పంకజ్‌ ఇప్పటిదాకా స్నూకర్‌లో 5, బిలియర్డ్స్‌లో 9 టైటిళ్లు నెగ్గాడు. 2006, 2010 ఆసియా క్రీడల్లోనూ అతడు పసిడితో మెరిశాడు.

Government Jobs

సీఎస్‌ఐఆర్‌-ఐఐఐఎంలో సైంటిస్ట్‌ పోస్టులు

జమ్మూ కశ్మీర్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ (సీఎస్‌ఐఆర్‌-ఐఐఐఎం) వివిధ విభాగాల్లో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 11 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.1,20,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, సెమినార్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 07-03-2025. Website:https://iiim.res.in/

Government Jobs

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఖాళీలు

కొచ్చిన్ పోర్ట్ అథారిటీ (సీపీఏ), కేరళ కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 65 వివరాలు: 1. టగ్ హ్యాండ్లర్‌: 02 2. జి.పి క్ర్యూ: 46 3. జి.పి క్ర్యూ ఇంజిన్‌: 05 4. జి.పి.క్ర్యూ ఎలక్ట్రికల్: 02 5. టెక్నికల్ సూపర్‌వైజర్‌: 01 6. మెరైన్‌ మోటర్‌ మెకానిక్‌: 04 7. ఫైర్‌ సూపర్‌వైజర్‌: 03 8. సీమెన్‌ గ్రేడ్‌-2: 01 9. వించ్‌ ఆపరేటర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: వించ్ ఆపరేటర్‌, సీమెన్‌ గ్రేడ్‌-2కు 60 ఏళ్లు, టెక్నికల్ సూపర్ వైజర్‌, మెరైన్‌ మోటర్‌ మెకానిక్‌, ఫైర్‌ సూపర్‌ వైజర్‌కు 40 ఏళ్లు, జి.పి క్ర్యూకు 46 ఏళ్లు, టగ్‌ హ్యాండ్లర్‌కు 58 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు టగ్ హ్యాండ్లర్‌ పోస్టుకు రూ.50,000, మెరైన్‌ మోటర్‌ మెకానిక్‌, జి.పి క్ర్యూ, జి.పి క్ర్యూ ఇంజిన్‌కు రూ.23,400, జి.పి క్ర్యూ ఎలక్ట్రికల్‌, టెక్నికల్ సూపర్‌వైజర్‌కు రూ.28,800, ఫైర్‌ సూపర్‌ వైజర్‌కు రూ.40,000, సీమెన్‌ గ్రేడ్‌-2కు రూ.30,000, వించ్‌ ఆపరేటర్‌కు రూ.27,500. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-03-2025. Website:https://cochinport.gov.in/careers

Government Jobs

Scientist Posts In CSIR-IIIM

CSIR-Indian Institute of Integrative Medicine (CSIR-IIIM) in Jammu and Kashmir is inviting applications for the Scientist posts in various departments. No. of Posts: 11 Details: Qualification: PhD in the relevant discipline along with work experience as per the post. Age Limit: 32 years. Salary: Rs. 1,20,000 per month. Application Fee: Rs. 500 for General, OBC, EWS candidates, SC, ST, PWBD candidates will be exempted from the fee. Selection Process: Based on Written Test, Seminar, Interview. Last Date of Online Application: 07-03-2025. Website:https://iiim.res.in/

Government Jobs

Posts In Cochin Port Authority

Cochin Port Authority (CPA), Kerala is inviting applications for the following posts. Number of Posts: 65 Details: 1. Tug Handler: 02 2. GP Crew: 46 3. GP Crew Engine: 05 4. GP Crew Electrical: 02 5. Technical Supervisor: 01 6. Marine Motor Mechanic: 04 7. Fire Supervisor: 03 8. Seaman Grade-2: 01 9. Winch Operator: 01 Qualification: Candidates should have passed 10th class, ITI, Diploma, Degree in the relevant discipline as per the post and should have work experience. Age limit: 60 years for Winch Operator, Seaman Grade-2, 40 years for Technical Supervisor, Marine Motor Mechanic, Fire Supervisor, 46 years for GP Crew, and 58 years for Tug Handler. Salary: per month Rs. 50,000 for the post of Tug Handler, Rs. 23,400 for Marine Motor Mechanic, GP Crew, GP Crew Engine, Rs. 28,800 for GP Crew Electrical, Technical Supervisor, Rs. 40,000 for Fire Supervisor, Rs. 30,000 for Seaman Grade-2, Rs. 27,500 for Winch Operator. Last Date of Online Application: 11-03-2025. Website:https://cochinport.gov.in/careers

Current Affairs

Goa Shipyard Ltd (GSL)

♦ Goa Shipyard Ltd (GSL), one of India’s premier defense shipbuilding yards is showcasing its indigenously designed Fast Patrol Vessels (FPVs) and Offshore Patrol Vessels (OPVs) at NAVDEX 2025 in Abu Dhabi on 19 February 2025. ♦ The Fast Patrol Vessel(Model) on display is a 50-meter-long, high-speed craft capable of reaching 35 knots. ♦ Designed and built in-house by GSL, it is primarily intended for patrolling, anti-smuggling, and anti-terrorist operations. ♦ The vessel is powered by three 2,720 kW diesel engines driving independent waterjets, offering high maneuverability and efficiency.  ♦ Established in 1957, GSL has evolved into a leading defense shipbuilder, recognized by the Department of Scientific and Industrial Research (DSIR) for its indigenous warship design and development.  ♦ NAVDEX 2025, held alongside IDEX, serves as a vital platform f  or international cooperation in defense and security. Organized by ADNEC Group in partnership with the UAE Ministry of Defence and Tawazun Council.