Posts

Current Affairs

India State of Forest Report 2023 (ISFR 2023)

♦ Minister for Environment, Forest and Climate Change, Bhupender Yadav released the ‘India State of Forest Report 2023 (ISFR 2023) at Forest Research Institute, Dehradun on 21 December 2024. ♦ The ISFR is brought out by the Forest Survey of India (FSI) on a biennial basis since 1987.  ♦ FSI carries out in-depth assessment of the forest and tree resources of the country based on interpretation of Remote Sensing satellite data and field based National Forest Inventory (NFI), and the results are published in the ISFR.  ♦ The India State of Forest Report 2023 is 18th such report in the series. The report contains information on forest cover, tree cover, mangrove cover, growing stock, carbon stock in India’s forests, instances of forest fire, Agroforestry, etc. Highlights: ♦ As per the present assessment, the total Forest and Tree cover is 8,27,357sq km, which is 25.17 percent of the geographical area of the country. ♦ The Forest Cover has an area of about 7,15,343sq km (21.76%) whereas the Tree Cover has an area of 1,12,014 sq km (3.41%). ♦ The Forest and Tree cover of the country is 8,27,357 sq km which is 25.17 percent of the geographical area of the country, consisting of 7,15,343 sq km (21.76%) as forest cover and 1,12,014 sq km (3.41%) as tree cover. ♦ As compared to assessment of 2021, there is an increase of 1445 sq km in the forest and tree cover of the country which includes 156 sq km increase in the forest cover and 1289 sq km increase in tree cover. ♦ Top four states showing maximum increase in forest and tree cover are Chhattisgarh (684 sq km) followed by Uttar Pradesh (559 sq km), Odisha (559 sq km) and Rajasthan (394 sq km). ♦ Top three states showing maximum increase in forest cover are Mizoram (242 sq km) followed by Gujarat (180 sq km) and Odisha (152 sq km). ♦ Area wise top three states having largest forest and tree cover are Madhya Pradesh (85,724 sq km) followed by Arunachal Pradesh (67,083 sq km) and Maharashtra (65,383 sq km). ♦ Area wise top three states having largest forest cover are Madhya Pradesh (77,073 sq km) followed by Arunachal Pradesh (65,882 sq km) and Chhattisgarh (55,812 sq km). ♦ In terms of percentage of forest cover with respect to total geographical area, Lakshadweep (91.33 percent) has the highest forest cover followed by Mizoram (85.34 percent) and Andaman & Nicobar Island (81.62 percent). ♦ The present assessment also reveals that 19 states/UTs have above 33 percent of the geographical area under forest cover. ♦ Out of these, eight states/ UTs namely Mizoram, Lakshadweep, A & N Island, Arunachal Pradesh, Nagaland, Meghalaya, Tripura, and Manipur have forest cover above 75 percent. ♦ The total mangrove cover is 4,992 sq km in the country.

Current Affairs

Madan B. Lokur

♦ Former Supreme Court judge Justice Madan B. Lokur was appointed Chairperson of the United Nations Internal Justice Council on 21 December 2024. His term will end on 12 November 2028. ♦ Born in 1953, Justice Lokur was appointed a judge of the Supreme Court on June 4, 2012. ♦ He demitted office on December 30, 2018, upon attaining the age of superannuation. ♦ In 2019, Justice Lokur was appointed to the Supreme Court of Fiji as a judge of its non-resident panel. ♦ He was the first Indian judge to be appointed as a judge in the Supreme Court of another country. ♦ The other members of the Council are: Ms. Carmen Artigas (Uruguay), distinguished external jurist nominated by staff; Ms. Rosalie Balkin (Australia), distinguished external jurist nominated by management; Mr. Stefan Brezina (Austria), staff representative; and Mr. Jay Pozenel (USA), management representative.

Current Affairs

నారా దేవాంశ్‌ ప్రపంచ రికార్డు

చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా నారా దేవాంశ్‌ (9 ఏళ్లు) ‘ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌-175 పజిల్స్‌’ రికార్డును సొంతం చేసుకోవడంతోపాటు, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇతడు ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్‌ తనయుడు. దేవాంశ్‌ సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-లండన్‌’ అధికారికంగా ధ్రువీకరించింది.

Current Affairs

ఆర్‌బీఐ గణాంకాలు

దేశంలో 2,664 మంది పారిశ్రామిక/ వాణిజ్య వేత్తలు ఉద్దేశ పూర్వకంగా బ్యాంకులకు రూ.1,96,441 కోట్లు ఎగవేసినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. 2024, మార్చి ఆఖరు నాటికి ఇంతమొత్తం ఎగవేసినట్లు తెలిపింది.  వ్యక్తులతో పాటు విదేశీ రుణ గ్రహీతలను మినహాయించి, ‘ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగవేసిన తొలి 100 మంది కార్పొరేట్ల’ పేర్లను ఆర్‌బీఐ తెలిపింది. 2020 మార్చి ఆఖరుకు 2,154 మంది రూ.1,52,860 కోట్లను బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా ఎగవేయగా, గత 4 ఏళ్లలో ఇది మరింత పెరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలతో స్పష్టమైంది. 

Current Affairs

అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ

తొలి మహిళల అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. 2024 డిసెంబరు 22న కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్లో 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మంచి ప్రతిభ కనబరచిన తెలుగమ్మాయి గొంగడి త్రిష (52; 47 బంతుల్లో 5×4, 2×6) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. 

Current Affairs

జైశంకర్‌కు విశిష్ట పురస్కారం

ప్రజా నాయకత్వ విభాగంలో ‘దక్షిణ భారత విద్యా సొసైటీ’ 2024 ఏడాదికి జాతీయ విశిష్ట పురస్కారాన్ని (నేషనల్‌ ఎమినెన్స్‌ అవార్డును) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు ప్రదానం చేసింది. శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి పేరిట ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. 

Current Affairs

మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని నరేంద్రమోదీకి కువైట్‌ ప్రభుత్వం 2024, డిసెంబరు 22న తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ ది గ్రేట్‌’ను ప్రదానం చేసింది. కువైట్‌ రాజు షేక్‌ మెషాల్‌ అల్‌-అహ్మద్‌ అల్‌-జబేర్‌ అల్‌-సబా దీన్ని మోదీకి అందజేశారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్, జార్జ్‌ బుష్, బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ తదితరులు ఈ అవార్డు అందుకున్నారు.  వివిధ దేశాల నుంచి మోదీకి ఇంతవరకు 20 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. 

Current Affairs

ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ నివేదిక

భారతదేశ అటవీ నివేదిక-2023 (ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌)ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ 2024, డిసెంబరు 21న విడుదల చేశారు. భారత్‌లో 2021 నుంచి మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగిందని, 2023లో భౌగోళిక ప్రాంతంలో ఇది 25.17 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. 2021-23 మధ్య కాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. ఇందులో దేశంలోని అటవీ, చెట్ల విస్తీర్ణంతోపాటు, కర్బన ఉద్గారాల తగ్గింపును కూడా ప్రస్తావించింది.  ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం: ఆంధ్రప్రదేశ్‌లో 2021 ఏడాదితో పోలిస్తే 2023 నాటికి అటవీ విస్తీర్ణం 138.66 చదరపు కిలోమీటర్ల మేర తగ్గినట్లు ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌-2023 వెల్లడించింది.  ఏపీలో 2021లో 30,223.62 చ.కి.మీ. మేర ఉన్న అటవీ విస్తీర్ణం 2023 నాటికి 30,084.96 చ.కి.మీ.కు తగ్గింది. అత్యధికంగా తగ్గిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉంది.  తెలంగాణలో అటవీ విస్తీర్ణం: తెలంగాణలో 2021-23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్ల (చ.కి.మీ.ల) అటవీ విస్తీర్ణం తగినట్లు ‘ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌-2023’ వెల్లడించింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్‌ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్‌ (138.66) తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. 2021-23 మధ్యలో రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీవిస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగింది. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 115.50 చ.కి.మీ.లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55, నిర్మల్‌ జిల్లాలో 45.37 చ.కి.మీ.ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. జగిత్యాల జిల్లాలో 54.70 చ.కి.మీ.లు, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 50.33, మంచిర్యాల జిల్లాలో 34.96 చ.కి.మీ.ల మేర విస్తీర్ణం పెరిగింది.

Current Affairs

జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయ మండలి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆ పదవిలో ఆయన 12 నవంబరు 2028 వరకు కొనసాగుతారు. 1953లో జన్మించిన జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ జూన్‌ 4, 2012న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై డిసెంబరు 30, 2018న పదవీ విరమణ చేశారు. 2019లో ఆయన ఫిజీ సుప్రీంకోర్టులో నాన్‌ రెసిడెంట్‌ ప్యానెల్‌ జడ్జిగా నియమితులయ్యారు. విదేశానికి చెందిన సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తి ఆయనే. 

Current Affairs

భారత్‌లో షూటింగ్‌ ప్రపంచకప్‌

2025లో జరిగే జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను భారత్‌ దక్కించుకుంది. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. 2025 సెప్టెంబరు-అక్టోబరు లేదా అక్టోబరు-నవంబరులో ఈ టోర్నీ నిర్వహించే అవకాశముంది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో నిర్వహించే తొమ్మిదో అత్యున్నత స్థాయి షూటింగ్‌ టోర్నీ ఇది.  ఇటీవల కాలంలో అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) టోర్నీలకు మన దేశం తరచుగా ఆతిథ్యమిస్తోంది. 2023లో భోపాల్‌లో ప్రపంచకప్‌ జరగగా, ఇటీవల ప్రపంచకప్‌ ఫైనల్‌ పోటీలకు దిల్లీ వేదికగా నిలిచింది.