Posts

Current Affairs

Chairperson of the National Human Rights Commission

♦ President of India Droupadi Murmu appointed retired Supreme Court Justice V. Ramasubramanian as the Chairperson of the National Human Rights Commission on 23 December 2024. President also appointed Priyank Kanoongo and retired Justice Bidyut Ranjan Sarangi as Members of the NHRC-India. ♦ Justice Ramasubramanian was born on 30 June 1958. He was enrolled as a member of the Bar on February 16, 1983. He was sworn in as the Chief Justice of Himachal Pradesh High Court on June 22, 2019, and later appointed Judge of the Supreme Court on September 23, 2019. ♦ The post of NHRC chairperson had been lying vacant since Justice (retd) Arun Kumar Mishra completed his tenure on 1 June 2024. Mishra served as the eighth chairperson of the rights panel and was appointed to its top post in June 2021.

Current Affairs

Veteran filmmaker Shyam Benegal

♦ Veteran filmmaker Shyam Benegal passed away in Mumbai on 23 December 2024. He was 90.  He was born on 14 December 1934, in Hyderabad. Shyam Benegal was known for films like Ankur, Mandi, Manthan and more, most of which were released in the mid-70s or 80s. ♦ Benegal was honoured by the Government of India with the Padma Shri in 1976 and the Padma Bhushan in 1991. He also received the Dadasaheb Phalke Award, the highest honour in Indian cinema, in 2005. ♦ He was a member of the Rajya Sabha from 2006 to 2012.

Current Affairs

నిస్సాన్, హోండా విలీనం!

జపాన్‌ వాహన దిగ్గజ సంస్థలు హోండా, నిస్సాన్‌ 2026 కల్లా విలీనమయ్యేలా 2024, డిసెంబరు 23న ఒక అవగాహనా ఒప్పందం (ఎమ్‌ఓయూ)పై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద మూడో వాహన సంస్థగా విలీన కంపెనీ మారుతుంది.  హోండా, నిస్సాన్, మిత్సుబిషిల మార్కెట్‌ విలువ ప్రకారం విలీన సంస్థ విలువ 50 బి.డాలర్ల (దాదాపు రూ.4.2 లక్షల కోట్లు)కు పైగా ఉండొచ్చు. 

Current Affairs

దేశంలో వలసల తగ్గుముఖం

దేశంలో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనావేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 45,57,87,621 మంది వలస వెళ్లినట్లు తేల్చగా, 2023 నాటికి ఆ సంఖ్య 40,20,90,396కి తగ్గినట్లు పేర్కొంది. 2011తో పోలిస్తే ఇది 11.78% తక్కువ అని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వలసల రేటు 37.64% ఉండగా, ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అది 28.88%కి పడిపోయినట్లు వెల్లడించింది.  గతంతో పోలిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, మౌలికవసతులు, అనుసంధానతలాంటి సేవలు పెరగడం, ఆర్థిక అవకాశాలు మెరుగుపడటం వలసలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆర్థికసలహా మండలి అభిప్రాయపడింది. 

Current Affairs

సంజనకు రెండు రజతాలు

భారత యువ వెయిట్‌ లిఫ్టర్‌ సంజన ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు సాధించింది. 2024, డిసెంబరు 23న దోహాలో జరిగిన మ్యాచ్‌లో 76 కేజీల విభాగంలో ఆమె స్నాచ్‌లో 90 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 120 కేజీల బరువులెత్తి రెండు పతకాలు గెలుచుకుంది.  ఈ టోర్నీలో ఇప్పటికే జ్యోష్న సబర్, పాయల్‌ స్వర్ణాలు సాధించగా; కోయల్‌ బార్, నీలమ్‌ దేవి రజతాలు గెలిచారు. 

Current Affairs

ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ జి.నరేందర్‌

ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జి.నరేందర్‌ నియామకానికి 2024, డిసెంబరు 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రీతుబాహరీ అక్టోబరు 10న పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో జస్టిస్‌ నరేందర్‌ను నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది. 

Current Affairs

శ్రీరామ్‌ కృష్ణన్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ భారత సంతతికి చెందిన శ్రీరామ్‌ కృష్ణన్‌ను తన సలహాదారుల బృందంలో ఒకరిగా నియమించుకున్నారు. వ్యాపారవేత్త, అంకుర సంస్థల పెట్టుబడిదారు (వెంచర్‌ కేపిటలిస్ట్‌), రచయిత అయిన శ్రీరామ్‌ కృష్ణన్‌ ట్రంప్‌ బృందంలో కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా వ్యవహరిస్తారు. వైట్‌హౌస్‌లో కృత్రిమ మేధ, క్రిప్టో సంబంధ వ్యవహారాలను చూసుకునే డేవిడ్‌ ఓ స్యాక్స్‌తో కలిసి కృష్ణన్‌ పనిచేస్తారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన శ్రీరామ్‌ కృష్ణన్‌ అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. 

Current Affairs

రుద్రాంక్ష్ ప్రపంచ రికార్డు

జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్‌ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్‌ (మహారాష్ట్ర) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2024, డిసెంబరు 23న భోపాల్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో 254.9 పాయింట్లతో అతడు స్వర్ణం గెలిచాడు. ఈ క్రమంలో షెంగ్‌ లిహావో (చైనా, 254.5) పేరిట ఉన్న జూనియర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్‌ శేఖర్‌ (251.4, కర్ణాటక) రజతం, హిమాంశు (229.9, హరియాణా) కాంస్య పతకాలు సాధించారు. 

Current Affairs

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌

జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2024, డిసెంబరు 23న ఆమోదముద్ర వేశారు. సభ్యులుగా ప్రియాంక్‌ కనూంగో, డాక్టర్‌ జస్టిస్‌ బిద్యుత్‌రంజన్‌ షడంగిలను నియమించారు.  ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ మిశ్ర 2024, జూన్‌ 1న పదవీ విరమణ చేయగా, సభ్యురాలు విజయభారతీ సయానీ ప్రస్తుతం యాక్టింగ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 

Current Affairs

శ్యామ్‌ బెనెగల్‌ మరణం

ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌(90) 2024, డిసెంబరు 23న ముంబయిలో కన్నుమూశారు. ఈయన 1934 డిసెంబరు 14న హైదరాబాద్‌లో జన్మించారు. సికింద్రాబాద్‌ మహబూబ్‌ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగింది.  సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం 2005లో ఆయన్ని వరించింది. 2013లో ఏఎన్నార్‌ జాతీయ పురస్కారంతో ఆయన్ని గౌరవించారు. బెనెగల్‌ రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు.