Posts

Current Affairs

Droupadi Murmu

♦The President of India  Droupadi Murmu has appointed Governors for five states on 24 December 2024.  ♦ Dr. Hari Babu Kambhampati, who currently holds the position of Governor of Mizoram, has been appointed as the Governor of Odisha. ♦ General (Dr.) Vijay Kumar Singh (Retd.) has been designated as the new Governor of Mizoram. ♦ Rajendra Vishwanath Arlekar, currently serving as the Governor of Bihar, will now assume the role of Governor of Kerala. ♦ Arif Mohammed Khan, the Governor of Kerala, has been assigned the position of Governor of Bihar. ♦ Former Union Home Secretary Ajay Kumar Bhalla has been appointed as the Governor of Manipur.

Current Affairs

పర్వ్‌కి రెండు కాంస్యాలు

ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కి చెందిన పర్వ్‌ చౌదరి రెండు కాంస్య పతకాలు నెగ్గాడు. 2024, డిసెంబరు 24న దోహాలో జరిగిన 96 కేజీల విభాగంలో స్నాచ్‌లో 135, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 168 కేజీలు ఎత్తిన పర్వ్‌ మొత్తంగా 303 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లోనూ అతడికి కంచు దక్కింది. * ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్‌ 12 పతకాలు గెలుచుకుంది. 

Current Affairs

దేశీయ విమాన ప్రయాణికులు 1.43 కోట్లు

2024 నవంబరులో దేశీయ విమాన మార్గాల్లో 1.43 కోట్ల మంది ప్రయాణించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) వెల్లడించింది. 2023, నవంబరులో ప్రయాణించిన 1.27 కోట్ల మందితో పోలిస్తే ఈ సంఖ్య 12% అధికం.  * మొత్తం ప్రయాణికుల్లో 63.3% మందిని చేరవేయడం ద్వారా ఇండిగో అగ్ర స్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానాల్లో ఎయిరిండియా (24.4%), ఆకాశ ఎయిర్‌ (4.7%), స్పైస్‌జెట్‌ (3.1%), అలయన్స్‌ ఎయిర్‌ (0.7%) ఉన్నాయి. 

Current Affairs

5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

కేంద్ర ప్రభుత్వం 2024, డిసెంబరు 24న మొత్తం 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరోచోటకు బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. * మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ మిజోరం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జనరల్‌ వీకే సింగ్‌ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. మరోవైపు ప్రస్తుతం ఒడిశా గవర్నర్‌గా ఉన్న రఘుబర్‌దాస్‌ రాజీనామా చేశారు.  * కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాను మణిపుర్‌ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికె పదవీకాలం 2024, జులై 30వ తేదీతో ముగియగా అప్పటి నుంచి ఆ బాధ్యతలను అస్సాం గవర్నర్‌ లక్ష్మణ్‌ప్రసాద్‌ ఆచార్య నిర్వర్తిస్తున్నారు.  * మరోవైపు కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్‌ మహమ్మద్‌ఖాన్‌ను బిహార్‌కు, అక్కడ గవర్నర్‌గా ఉన్న రాజేంద్రవిశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను కేరళకు కేంద్రప్రభుత్వం బదిలీ చేసింది. 

Walkins

Teaching Posts In PMSHRI Navodaya, Warangal

PMSHRI Javahar Navodaya Vidyalaya, Warangal District, Mamnoor is conducting interviews for filling up teaching posts on contractual basis. Details: PGT (IT/ Computer Science) TGT (English) TGT (Music) Counsellor Qualification: Degree, B.ED, D.Ed, PG, CTET as per the post.  Interview Dates: 31.01.2025 Venue: JNV Campus, Mamnoor, Warangal District. Website:https://navodaya.gov.in/nvs/en/Home1

Government Jobs

Head Constable, Constable Posts In ITBP

Indo-Tibetan Border Police Force (ITBP) invites online applications from Male candidates for filling up following vacancies to the post of Head Constable & Constable Group C Non-Gazetted (Non-Ministerial). No. of Posts: 51 Details: 1. Head Constable (Motor Mechanic): 7 Posts 2. Constable (Motor Mechanic): 44 Posts Qualification: For Head Constable posts- Passed 10+2 from a recognized board. Certificate in Motor Mechanic from a recognized institution or ITI with 3 years of practical experience in the trade, or a Diploma in Automobile Engineering. For Constable (Motor Mechanic)- Passed 10th class from a recognized board. ITI in the relevant trade or 3 years of experience in the trade. Age Limit (as on 22-01-2025): 18 to 25 years. Pay Scale: For Head Constable posts Rs.25500 - Rs.81100, For Constable posts Rs.21700-Rs.69100. Application Fee: Rs.100 for General/ OBC/ EWS. Exempted for SC/ ST/ Ex-Servicemen. Selection Process: Based on Physical Efficiency Test, Physical Standard Test, Documentation, Written Examination, Practical(Skill) Test, Medical Examination. Last date for online application: 22-01-2025. Website:https://recruitment.itbpolice.nic.in/rect/index.php

Walkins

వరంగల్‌ పీఎంశ్రీ నవోదయలో టీచింగ్‌ పోస్టులు

తెలంగాణ రాష్ట్రం, వరంగల్‌ జిల్లా, మమునూరులోని పీఎంశ్రీ జవహార్‌ నవోదయ విద్యాలయలో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: పీజీటీ (ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌) టీజీటీ (ఇంగ్లిష్‌) టీజీటీ (మ్యూజిక్‌) కౌన్సెలర్‌ అర్హత: అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఎడ్‌, డీఎడ్‌, పీజీ సీటెట్‌ ఉత్తీర్ణత.  ఇంటర్వ్యూ తేదీలు: 31.01.2025 వేదిక: జేఎన్‌వీ క్యాంపస్‌, మమ్నూర్‌, వరంగల్‌ జిల్లా. Website:https://navodaya.gov.in/nvs/en/Home1

Government Jobs

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు

గ్రూప్ సి నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు (ఐటీబీపీ) ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 51. వివరాలు: 1. హెడ్ కానిస్టేబుల్(మోటార్ మెకానిక్): 7 పోస్టులు 2. కానిస్టేబుల్(మోటార్ మెకానిక్): 44 పోస్టులు అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు పన్నెండో తరగతి, మోటార్‌ మెకానిక్‌ సర్టిఫికెట్‌/ డిప్లొమా(ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. కానిస్టేబుల్ ఖాళీలకు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 22-01-2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. జీత భత్యాలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25500 - రూ.81100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21700-రూ.69100. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-01-2024. Website:https://recruitment.itbpolice.nic.in/rect/index.php

Current Affairs

National Farmers’ Day (Kisan Diwas)

♦ National Farmers’ Day (Kisan Diwas) is observed every year on December 23 to commemorate the birth anniversary of Choudhary Charan Singh, the former Prime Minister of India. Choudhary Charan Singh served as the Prime Minister of India from 1979 to 1980. During his tenure, he introduced various welfare initiatives aimed at improving the welfare of farmers. In recognition of his significant contributions, the Government of India declared December 23 as National Farmers' Day in 2001. ♦ 2024 theme: "Empowering 'Annadatas' for a Prosperous Nation."  

Current Affairs

Rudrankksh Balasaheb Patil

♦ Rudrankksh Balasaheb Patil set a new world record en route to winning the junior title at the National Shooting Championship in Bhopal on 23 December 2024. He shot a sizzling 254.9 to win the junior final, surpassing the existing senior finals world record held by Olympic Champion Sheng Lihao of China, by a margin of 0.4.