Posts

Current Affairs

Tamil Nadu Chief Minister M.K. Stalin

♦ Tamil Nadu Chief Minister M.K. Stalin inaugurated India’s first glass bridge over the sea on 30 December 2024, connecting the Thiruvalluvar Statue and Vivekananda Rock Memorial in Kanyakumari. Constructed at 37 crores, the 77 metres bridge was inaugurated as part of silver jubilee celebration of the Tiruvalluvar statue, now renamed as statue of Wisdom by the state government. ♦ The statue was unveiled on 1 January 2000, by the then Chief Minister M. Karunanidhi, is celebrating its 25th anniversary. Designed by renowned sculptor V. Ganapathi Sthapathi, the statue stands at a combined height of 133 feet, which denotes the 133 chapters of Tirukkural.

Current Affairs

Justice V. Ramasubramanian

♦ Justice V. Ramasubramanian assumed charge as the Chairperson of the National Human Rights Commission (NHRC), India, on 30 December 2024. He is a former Judge of the Supreme Court of India,  Justice (Dr.) Vidyut Ranjan Sarangi also took office as a Member of the Commission.  ♦ Ramasubramanian was born on 30 June 1958, in Mannargudi, Tamil Nadu. In 2019, he was appointed Chief Justice of the Himachal Pradesh High Court and later that year became a Judge of the Supreme Court. Justice Ramasubramanian retired on June 29, 2023. ♦ Justice (Dr.) Vidyut Ranjan Sarangi was born on July 20, 1962, in Nayagarh, Odisha. He was honored with the prestigious Haricharan Mukherjee Memorial Award and Gold Medal in 2002. On June 20, 2013, Dr. Sarangi was appointed as a Permanent Judge of the Orissa High Court. In July 2024, he was appointed Chief Justice of the Jharkhand High Court.  

Current Affairs

IPS officer Vitul Kumar

♦ The Ministry of Home Affairs (MHA) gave an additional charge to senior IPS officer Vitul Kumar as Central Reserve Police Force (CRPF) Director General on 30 December 2024. Vitul Kumar is a 1993-batch IPS officer of Uttar Pradesh cadre. He is currently posted as the special Director General of CRPF (HT).  ♦ Following the retirement of the incumbent DG, Anish Dayal Singh, Kumar has been assigned officiating charge for the post of DG of CRPF. 

Current Affairs

"Space Docking Experiment" (SpaDeX)

♦ The Indian Space Research Organisation (ISRO) successfully launched "Space Docking Experiment" (SpaDeX) at 10 pm from the Satish Dhawan Space Centre (SDSC) SHAR in Sriharikota on 30 December 2024. The mission was carried out using the PSLV-C60 rocket. ♦ The SpaDeX mission aims to achieve the challenging task of docking two satellites in space. This cost-effective technology demonstration will test and validate in-space docking capabilities using two small spacecraft, SDX01 and SDX02. These technologies are critical for future missions, including Chandrayaan-4, the Indian space station, and the manned Gaganyaan mission. ♦ With this success, India became the fourth country in the world with space docking technology – after Russia (the former USSR), the US and China.

Current Affairs

అమితవ ముఖర్జీ

ఎన్‌ఎండీసీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అమితవ ముఖర్జీ పదవీ కాలాన్ని కేంద్రం 2024 నవంబరు 20 నుంచి ఏడాది పొడిగించింది. కంపెనీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఉన్న ఆయనకు ఇంతకు ముందు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Current Affairs

ద్రవ్యోల్బణం పెరుగుదల రాష్ట్రంలో తక్కవ

ప్రజలు నిత్యం వినియోగించే వివిధ రకాల నిత్యావసర సరకుల ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలోనే అతితక్కువగా(4.24%) నమోదైంది. 2023 నవంబరుతో 2024 నవంబరులోని ధరల పెరుగుదల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘వినియోగదారుల ధరల సూచిక’ (సీపీఐ)ను కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసింది. ఆహార ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, పెట్రోలు, డీజిల్, దుస్తులు, ఇళ్లు తదితరాల ధరలను దేశంలోని వివిధ ప్రాంతాల మార్కెట్ల నుంచి సేకరించి సీపీఐని రూపొందిస్తారు. ఈ ధరల పెరుగుదల శాతం ఆధారంగా రాష్ట్రాలవారీగా ద్రవ్యోల్బణం శాతాన్ని ప్రకటిస్తారు.  రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌ 8.39%, బిహార్‌ 7.55%, ఒడిశా 6.78 శాతంతో తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం జాతీయ సగటు 5.48%. అన్ని రాష్ట్రాలకన్నా అతి తక్కువగా తెలంగాణలో 4.24% ఉన్నట్లు సీపీఐ నివేదిక స్పష్టంచేసింది. 

Current Affairs

2024-25లో 6.6% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీఐ నివేదిక అంచనా వేసింది. డిసెంబరు నెల ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌)ను ఆర్‌బీఐ 2024, డిసెంబరు 30న విడుదల చేసింది. దీని ప్రకారం, బలమైన లాభదాయకత, తగ్గుతున్న నిరర్థక ఆస్తులు, మూలధన, ద్రవ్యలభ్యత నిల్వలతో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు(ఎస్‌సీబీలు) కనిపిస్తున్నాయి.

Current Affairs

ప్రపంచ జనాభా 809 కోట్లు

నూతన సంవత్సర వేళ (2025 జనవరి 1తో) ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకోనుంది. 2024లో జనాభా 7.1 కోట్లకుపైగా పెరిగింది. ఈ మేరకు గణాంకాలను ‘యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో ఎస్టిమేట్స్‌’ 2024, డిసెంబరు 30న విడుదల చేసింది.  2023లో పెరిగిన 7.5 కోట్ల మందితో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల శాతం (0.9) స్వల్పంగా నమోదైంది. 

Current Affairs

జస్టిస్‌ రామసుబ్రమణియన్‌

జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ 2024, డిసెంబరు 30న బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని మానవాధికార్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు జస్టిస్‌ బిద్యుత్‌ రంజన్‌ సారంగి సంఘం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 

Current Affairs

జిమ్మీ కార్టర్‌ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ (100) జార్జియా రాష్ట్రం ప్లెయిన్స్‌ నగరంలో 2024, డిసెంబరు 29న మరణించారు. కార్టర్‌ అమెరికాకు 39వ అధ్యక్షుడు. 1977-81 మధ్య ఆ పదవిలో ఉన్నారు. ఇప్పటిదాకా అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసినవారిలో అత్యధిక కాలం జీవించింది ఈయనే. కార్టర్‌ డెమోక్రాటిక్‌ పార్టీ నేత. ఈయనకు 2002లో నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది.