Posts

Current Affairs

రాస్‌నెఫ్ట్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం

రోజుకు 5 లక్షల బ్యారెళ్ల (ఏడాదికి 25 మిలియన్‌ టన్నుల) చమురును పదేళ్లపాటు సరఫరా చేసే నిమిత్తం రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య జరిగిన ఇంధన ఒప్పందాల్లో ఇదే అతిపెద్దది.  10 ఏళ్ల ఒప్పందంలో భాగంగా, అంతర్జాతీయ సరఫరాలో 0.5% వాటాకు సమానమైన ముడిచమురును రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దిగుమతి చేసుకోనుంది. ప్రస్తుత ధరల వద్ద చూస్తే, ఈ విలువ ఏడాదికి 12-13 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.02 - 1.1 లక్షల కోట్ల) మేర ఉంటుంది. 

Current Affairs

సుఖోయ్‌ల కొనుగోలుకు హాల్‌తో ఒప్పందం

సుఖోయ్‌ యుద్ధ విమానాల కొనుగోలు కోసం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌తో (హాల్‌) రూ.13,500 కోట్ల ఒప్పందాన్ని రక్షణశాఖ కుదుర్చుకుంది. 2024, డిసెంబరు 12న కుదిరిన ఈ ఒప్పందం ద్వారా 12 సుఖోయ్‌ అత్యాధునిక యుద్ధ విమానాలు వాయుసేనకు అందుతాయి. రష్యాకు చెందిన ఈ విమానాల్లో 62.6 శాతం స్థానికంగా తయారైన విడిభాగాలనే వాడతారు. 

Current Affairs

నేపాల్‌ సైన్యాధిపతికి గౌరవ హోదా

నేపాల్‌ ప్రధాన సైన్యాధికారి జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్డెల్‌కు ‘భారత సైన్యంలో గౌరవ జనరల్‌’ హోదాను 2024, డిసెంబరు 12న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. 2024, నవంబరులో భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదిని ‘నేపాల్‌ సైన్యంలో గౌరవ జనరల్‌’ హోదాతో నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ సత్కరించారు. రెండు దేశాలు తమ ప్రధాన సైన్యాధికారులను 1950 నుంచి ఇలా పరస్పరం గౌరవించుకొంటున్నాయి. 

Current Affairs

వాయు కాలుష్యంతో 15 లక్షల మరణాలు

దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురికావడంతో 2009 నుంచి 2019 మధ్య భారత్‌లో ఏటా 15 లక్షల మరణాలు సంభవించాయని లాన్సెట్‌ ప్లానిటరీ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. 140 కోట్ల మంది దేశ జనాభా కూడా ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్దేశించిన ప్రమాణం (ఏడాదికి ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములు) కంటే ఎక్కువ పీఎం2.5 వాయుకాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది. ఈ పరిశోధనలో హరియాణాలోని అశోకా వర్సిటీ, దిల్లీలోని ‘దీర్ఘకాల వ్యాధుల నియంత్రణ కేంద్రం’ కూడా పాలుపంచుకున్నాయి. వాయుకాలుష్య వార్షిక స్థాయి 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌ సుబంసిరి జిల్లాలో అత్యల్పంగా (ఘనపు మీటరుకు 11.2 మైక్రాన్లు), 2016లో ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో అత్యధికంగా నమోదైనట్లు వెల్లడించింది. ఇది దిల్లీలో ఘనపు మీటరుకు 119 మైక్రాన్లుగా ఆ ఏడాది ఉందని పేర్కొంది. 

Current Affairs

ఎలాన్‌ మస్క్‌

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ 400 బిలియన్‌ డాలర్లను మించింది. ప్రపంచ చరిత్రలో ఈ స్థాయి సంపద ఆర్జించిన తొలి వ్యక్తిగా మస్క్‌ నిలిచారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం మస్క్‌ సంపద విలువ 447 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు)గా ఉంది. టెస్లా షేరు విలువ అమెరికా అధ్యక్ష ఎన్నికల తరవాత 65% పెరిగింది. కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్‌ ఏఐ విలువ మే నుంచి రెట్టింపై 50 బి.డా.కు చేరింది. స్పేస్‌ ఎక్స్‌ విలువ 350 బి.డా.కు చేరింది. 

Current Affairs

దొమ్మరాజు గుకేశ్‌

ప్రపంచ క్లాసిక్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్‌ విజేతగా నిలిచాడు. 2024, డిసెంబరు 12న సంగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో 14 రౌండ్లో డింగ్‌ లిరెన్‌ను (చైనా) ఓడించిన గుకేశ్, 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌ వయసు 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాస్పరోవ్‌ (1985లో 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు.  ప్రపంచ క్లాసిక్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడు గుకేశ్‌. 5 సార్లు టైటిల్‌ గెలిచిన ఆనంద్‌ అతనికంటే ముందున్నాడు.  విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది. రన్నరప్‌ లిరెన్‌ రూ.9.75 కోట్లు గెలుచుకున్నాడు. 

Government Jobs

UPSC - NDA & NAE (I) 2025

Union Public Service Commission invites applications from unmarried male/ female candidates for National Defence Academy & Naval Academy Examination (I), 2025. An Examination will be conducted by the UPSC on 13th April, 2025 for admission to the Army, Navy and Air Force wings of the NDA for the 155th Course and for the 117th Indian Naval Academy Course (INAC) commencing from 1st January, 2026. No. of Posts: 406. Details: National Defence Academy & Naval Academy Examination (I), 2025 I. National Defence Academy: 1. Army- 208 (including 10 for female candidates) 2. Navy- 42 (including 06 for female candidates) 3. Air Force- (a) Flying- 92 (including 02 for female candidates) (b) Ground Duties (Tech)- 18 (including 02 for female candidates) (c) Ground Duties (Non Tech)- 10 (including 02 for female candidates) II. Naval Academy (10+2 Cadet Entry Scheme): 36 (including 05 for female candidate) Qualifications: 12th Class pass of the 10+2 pattern, 12th Class pass with Physics, Chemistry and Mathematics of the 10+2 pattern. Age Limit: Only unmarried male/ female candidates born not earlier than 02nd July, 2006 and not later than 1st July, 2009 are eligible. Application fee: Rs.100 (excepting SC/ ST candidates/ female candidates are exempted from payment of fee). Selection procedure: Based on Two-stage tests, Medical examination, Interview etc. Examination Centres in Telangana & AP States: Anantpur, Hyderabad, Tirupati, Vijayavada, Vishakhapatnam, Hanumakonda (Warangal Urban). Last date for submission of applications: 31-12-2024 Date of Modification in application form: From 01-01-2025 to 07-01-2025. Last Date for modification of Registration: 07-01-2025. Date of Exam: 13-04-2025. Course commencing from: commencing from: 01-01-2026. Website:https://upsc.gov.in/ Apply online:https://upsconline.nic.in/upsc/OTRP/

Government Jobs

UPSC - Combined Defence Services Examination (I), 2025

Combined Defence Services Examination (I), 2025 will be conducted by the Union Public Service Commission on 13th April, 2025 for admission to the under mentioned courses. No. of Posts: 457. Details: Combined Defence Services Examination (I), 2025 Name of the Course and Approximate No. of Vacancies: 1. Indian Military Academy, Dehradun- 160th (DE) Course commencing in January, 2026 (including 13 vacancies reserved for NCC `C’ Certificate (Army Wing) holders): 100 Posts 2. Indian Naval Academy, Ezhimala- Course commencing in January, 2026 Executive Branch (General Service)/ Hydro (including 06 vacancies for NCC ‘C’ Certificate (Naval Wing) holders: 32 Posts 3. Air Force Academy, Hyderabad- (Pre-Flying) Training Course commencing in January, 2026 i.e. No. 219 F(P) Course. (including 03 vacancies are reserved for NCC `C’ Certificate (Air Wing) holders through NCC Special Entry): 32 Posts 4. Officers’ Training Academy, Chennai (Madras)- 123rd SSC (Men) (NT) (UPSC) Course commencing in April, 2026: 275 Posts 5. Officers Training Academy, Chennai (Madras)- 37th SSC Women (NT) (UPSC) Course commencing in April, 2026: 18 Posts Qualification: Degree, Degree in Engineering with Physical Standards. Age limit: For IMA- Unmarried male candidates born not earlier than 2nd January, 2002 and not later than 1st January, 2007 only are eligible.  For Indian Naval Academy- Unmarried male candidates born not earlier than 2nd January, 2002 and not later than 1st January, 2007 only are eligible.  Application Fee: Rs.200 (Female/ SC/ ST candidates who are exempted from payment of fee). Examination Centres in AP & Telangana States: Anantpur, Hyderabad, Tirupati, Vijayavada, Vishakhapatnam, Hanumakonda (Warangal Urban). Last date for submission of applications: 31-12-2024. Last date of modification of Registration: 07.01.2025. Modification in application form: From 01.01.2025 to 07.01.2025. Exam date: 13-04-2025 Website:https://upsc.gov.in/

Government Jobs

యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్‌ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్

రక్షణ రంగంలోని వివిధ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2025 సంవత్సరానికి మొదటి విడత నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 1 జనవరి 2026 నుంచి ప్రారంభమయ్యే 155వ కోర్సులో, 117వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.  మొత్తం పోస్టుల సంఖ్య: 406 వివరాలు: యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (1)-2025 ఖాళీలు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్- 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 36 ఉన్నాయి.  అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.  వయోపరిమితి: అభ్యర్థులు 2 జులై, 2006కి ముందు, 1 జులై, 2009కి తర్వాత పుట్టి ఉండకూడదు.  దరఖాస్తు: దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలి. దరఖాస్తు చేసిన తర్వాత ఏదైనా కారణాల వల్ల దరఖాస్తు ఉపసంహరించుకోవానుకుంటే చేసుకోవచ్చు.  ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్-1 మ్యాథమేటిక్స్- 300 మార్కులు (సమయం రెండున్నర గంటలు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులుంటాయి(సమయం రెండున్నర గంటలు). రుణాత్మక మార్కులుంటాయి. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్‌ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.  కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక‌వుతారు. అలా ఎంపికైన‌వారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చ‌ద‌వ‌చ్చు.  శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ, పుణెలో చ‌దువు, శిక్షణ పొందుతారు. అనంత‌రం ఆర్మీ క్యాడెట్ల‌ను దేహ్రాదూన్‌లోని ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీకి; నేవ‌ల్‌‌ క్యాడెట్ల‌ను ఎజిమ‌ల‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ల‌ను హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బ‌ట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. కోర్సు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.  దరఖాస్తు రుసుం: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హనుమకొండ (వరంగల్ అర్బన్). ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-12-2024.  దరఖాస్తు సవరణ తేదీలు: 01-01-2025 నుంచి 07-01-2025 వరకు. పరీక్ష తేదీ: 13-04-2025. కోర్సు ప్రారంభం: 01-01-2026. Website:https://upsc.gov.in/ Apply online:https://upsconline.nic.in/upsc/OTRP/

Government Jobs

యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2025

ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్సుల్లోని ఉన్నత ఉద్యోగాల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) - కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) నిర్వహిస్తుంది.  ప్రస్తుతం సీడీఎస్‌ఈ 2025(1) ప్రకటన వెలువడింది. మొత్తం పోస్టుల సంఖ్య: 457.  వివరాలు: యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2025.  విభాగాల వారీ ఖాళీలు: 1. ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), దేహ్రాదూన్- 100 2. ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల- 32 3. ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్- 32 4. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌- 275 5. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ నాన్‌ టెక్నికల్‌- 18. విద్యార్హత: మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఏయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీలకు జనవరి 2, 2002 కంటే ముందు; జనవరి 1, 2007 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీ పోస్టులకు జనవరి 2, 2002 కంటే ముందు, జనవరి 1, 2006 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 2001 కంటే ముందు, జనవరి 1, 2007 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు. ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు. శిక్షణ, ఉద్యోగం: అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్స్‌, ఓటీఏ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడమీలో చేరినవాళ్లకు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి ఎంపికైనవారికి పైలట్‌ శిక్షణ హైదరాబాద్‌లో ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో శిక్షణలో పాల్గొంటారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెప్టినెంట్‌, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌, ఏయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది.  దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, హనుమకొండ (వరంగల్ అర్బన్), విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31 డిసెంబరు 2024. దరఖాస్తు సవరణ తేదీలు: 01.01.2025 నుంచి 07.01.2025 వరకు. దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 07.01.2025. పరీక్ష తేదీ: 13-04-2025. Website:https://upsc.gov.in/