Posts

Current Affairs

జల్‌వాహక్‌

అంతర్గత నీటిమార్గాల్లో సరకు రవాణా ప్రోత్సాహానికి ‘జల్‌వాహక్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. జాతీయ జలమార్గాలు 1 (గంగా), 2 (బ్రహ్మపుత్ర), 16 (బరాక్‌ నది) ద్వారా స్థిరమైన, తక్కువ ఖర్చుతో రవాణాను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024, డిసెంబరు 15న మూడు కార్గో నౌకలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రి శర్బానంద సోనోవాల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకం కింద కార్గో యాజమానులు 300 కి.మీ వరకు దూరానికి సరకు రవాణా చేస్తే, ఇందుకు సంబంధించి అయ్యే ఖర్చుల్లో 35% వరకు వెనక్కి పొందొచ్చు. ఈ పథకం మూడేళ్ల వరకు అమల్లో ఉంటుంది. ఈ పథకాన్ని ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇన్‌లాండ్‌ అండ్‌ కోస్టల్‌ షిప్పింగ్‌ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.   

Current Affairs

జూనియర్‌ మహిళల ఆసియాకప్‌ హాకీ టోర్నీ

జూనియర్‌ మహిళల ఆసియాకప్‌ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ విజేతగా నిలిచింది. 2024, డిసెంబరు 15న మస్కట్‌లో జరిగిన ఫైనల్లో 1-1 (4-2)తో షూటౌట్లో చైనాను ఓడించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లూ చెరో గోల్‌ కొట్టాయి.  * షూటౌట్లో భారత్‌ నాలుగు గోల్స్‌ చేయగా.. చైనా రెండే కొట్టడంతో ట్రోఫీ భారత్‌ను వరించింది.

Current Affairs

15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు

2024 జనవరి నుంచి నవంబరు వరకు 15,547 కోట్ల యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.223 లక్షల కోట్లుగా నమోదైందని ఆర్థిక మంత్రిత్వశాఖ 2024, డిసెంబరు 14న వెల్లడించింది. భారత్‌కు సంబంధించిన డిజిటల్‌ చెల్లింపుల విప్లవం ఇతర దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్‌ వంటి కీలక మార్కెట్లలో యూపీఐ పని చేస్తోంది. * 2024, నవంబరులో 1,658 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.23.49 లక్షల కోట్లుగా ఉంది.

Current Affairs

జెంషెడ్‌జీ టాటా పురస్కారం

బయోకాన్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజందార్‌ షాకు ప్రతిష్ఠాత్మక జెంషెడ్‌జీ టాటా పురస్కారం దక్కింది. మన దేశంలో బయోసైన్సెస్‌ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ (ఐఎస్‌క్యూ) ఈ అవార్డును ప్రకటించింది. 2004లో ఐఎస్‌క్యూ ఈ అవార్డును ప్రారంభించింది. భారతీయ సమాజానికి గణనీయ సేవలు అందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ఐఎస్‌క్యూ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్‌క్యూ వార్షిక కాన్ఫరెన్స్‌ 2024లో కిరణ్‌కు ఈ పురస్కారం అందించబోతున్నట్లు ప్రకటించారు.  

Current Affairs

నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు-2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు-2024 దక్కింది. భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, సామర్థ్య చర్యలను ప్రోత్సహించి; అమలు చేసినందుకు ఈ అవార్డు లభించింది. కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రాష్ట్రాలను విద్యుత్‌ వినియోగం ఆధారంగా నాలుగు గ్రూపులుగా విభజించగా, అందులో ఏపీ గ్రూప్‌-2లో ఉంది. అందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచి, స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంఇక్స్‌ (ఎస్‌ఈఈఐ)-2024లో 87.25 పాయింట్లు సాధించింది.   

Current Affairs

జార్జియా అధ్యక్షుడిగా కవెలాష్విలి

మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు మిఖైల్‌ కవెలాష్విలి (53) 2024, డిసెంబరు 14న జార్జియా అధ్యక్షుడయ్యారు. కవెలాష్విలిని జార్జియన్‌ డ్రీమ్‌ పార్టీ మిఖైల్‌ను అధ్యక్షుడిగా నామినేట్‌ చేసింది. అతడు మాంచెస్టర్‌ సిటీ కోసం అనేక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాడు. 2016లో ఎంపీగా ఎన్నికయ్యాడు. 2022లో పీపుల్స్‌ పవర్‌ రాజకీయ ఉద్యమ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత జార్జియన్‌ డ్రీమ్‌ పార్టీలో తన పార్టీని విలీనం చేశాడు.  

Private Jobs

Member Technical Posts In Oracle

Oracle Company Invites applications for Member Technical Posts  Details: Post: Member Technical  Company: Oracle Experience: 0 - 2 years Qualification: BS or MS degree in Computer Science or equivalent. Experience: 0-2+ years  Skills: Programming skills in Java or similar OO languages, Algorithms, Debugging, Microservices, Programming Languages, Software Architecture, Software Engineering, Troubleshooting skills etc. Job Location: Bengalore. Application Mode: Through Online. Last date: 15.1.2025 Website:https://careers.oracle.com/jobs/#en/sites/jobsearch/job/259969?lastSelectedFacet=AttributeChar6&location=India&locationId=300000000106947&selectedFlexFieldsFacets=%22AttributeChar6%7C0+to+2%2B+years%22

Government Jobs

Havildar & Naib Subedar Posts In Indian Army

Indian Army invites applications from Unmarried Indian Male and Female candidates to appear in recruitment trials of outstanding Sportsperson to join the Indian Army as Direct Entry Havildar and Naib Subedar (Sports) Intake 03/2024 Under Sports Quota Entry. Details: Havildar & Naib Subedar (Sports) Intake 03/2024 Sports Disciplines: Athletics (Men), Archery (Men), Basketball (Men), Boxing (Men), Diving (Men), Football (Men), Fencing (Men), Gymnastics (Men), Hockey (Men), Handball (Men), Judo (Men), Kayaking & Canoeing (Men), Kabaddi (Men), Swimming (Men), Sailing (Men), Shooting (Men), Triathlon (Men), Volleyball (Men), Wushu (Men), Weight Lifting (Men), Wrestling (Men), Winter Games (Men), Rowing (Men). Qualification: Matric/ Intermediate with Physical Standards. Outstanding sportsperson who have participated at International/ Junior or Senior National Championship/ Khelo India Games/ Youth Games/  Khelo India University Games from 01 Oct 2022 or after. Age Limit: from 17 ½1/2 to 25 years. Date of Birth: Candidates born between 31 Mar 2000 to 01 Apr 2007 (both dates inclusive) are eligible to apply. Selection Criteria: Based on Sports trials, physical fitness test, physical Standards test, skill test, medical examination, certificate verification etc. How to apply: Filled in applications should be submitted to Directorate of PT & Sports, General Staff Branch, IHQ (Army), Room No. 747, ‘A’ Wing, Sena Bhawan, PO New Delhi. Last date for Receipt of Application: 28-02-2025. Website:https://joinindianarmy.nic.in/Authentication.aspx

Freshers

Associate, Quality Services, Alexa Routines Posts In Amazon

Amazon Company invites application for Associate, Quality Services, Alexa Routines Posts. Details: Post: Associate, Quality Services, Alexa Routines Company: Amazon  Qualification: Bachelor's degree. Skills: Knowledge of QA methodology and tools, Understanding about software testing · Ability to complete assigned tasks accurately and promptly. Job Location: Chennai. Application Mode: Through Online. Last date: 20.12.2024 Website:https://www.amazon.jobs/en/jobs/2766920/associate-quality-services-alexa-routines

Walkins

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో కెమిస్ట్‌ ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (బెల్‌).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: కెమిస్ట్‌- 03  జియోలజిస్ట్‌- 02 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు కెమిస్ట్‌ పోస్టుకు రూ.70,000; జియోలజిస్ట్‌కు రూ.80,000. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 24 నుంచి 50 ఏళ్లు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: మహానంది బెసిన్‌ ప్రాజెక్ట్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, ఐడీసీఓ టవర్స్‌, మూడో అంతస్తు, జనపత్‌, భువనేశ్వర్‌, ఒడిశా. ఇంటర్యూ తేదీలు: 22-12-2024. Website:https://www.oil-india.com/