Posts

Current Affairs

డబ్ల్యూహెచ్‌వో మలేరియా నివేదిక-2024

మలేరియా కేసులు, ఆ వ్యాధితో ముడిపడ్డ మరణాలను గణనీయంగా తగ్గించడంలో భారత్‌ గణనీయ పురోగతి సాధించిందని డబ్ల్యూహెచ్‌వో మలేరియా నివేదిక-2024 పేర్కొంది. భారత్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి మలేరియా కేసులు, మరణాలను గణనీయంగా తగ్గిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.  ఈ వ్యాధి ఎక్కువగా కనిపించే రాష్ట్రాల్లో కేసులను బాగా తగ్గించగలగడంతో మలేరియా అధికంగా ఉండే ‘హై బర్డన్‌ టు హై ఇంపాక్ట్‌’ (హెచ్‌బీహెచ్‌1) గ్రూప్‌ నుంచి భారత్‌ ఈ ఏడాది బయటపడింది. 

Current Affairs

హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు

ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ మాసంగా జరుపుకొనేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని ఒహాయో స్టేట్‌ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా జరుపుకోవాలని ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర సెనేటర్‌ నీరజ్‌ అంతానీ బిల్లు ప్రవేశపెట్టారు. ఒహాయో చరిత్రలోనే తొలి హిందూ, భారతీయ అమెరికన్‌ స్టేట్‌ సెనేటర్‌గా అంతానీ గుర్తింపు పొందారు. అంతేకాకుండా స్టేట్‌ లేదా సమాఖ్యకు ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడైన హిందూ, భారతీయ అమెరికన్‌గా కూడా ఆయన చరిత్ర సృష్టించారు.

Current Affairs

సైన్యానికి ఎల్‌&టీ నుంచి వజ్ర ఫిరంగులు

భారత సైన్యానికి కే9 వజ్ర మర ఫిరంగులను ఎల్‌ అండ్‌ టీ సరఫరా చేయనుంది. ఇందుకోసం రూ.7,628 కోట్ల కాంట్రాక్టు సంస్థకు లభించింది. అత్యంత కచ్చితత్వంతో, ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఇవి ఉపయోగ పడతాయని రక్షణ శాఖ తెలిపింది. దేశ సరిహద్దుల్లో మోహరించేందుకు 100 వజ్ర ఫిరంగులను రక్షణ శాఖ సమీకరించనుంది.

Current Affairs

నేవీ చేతికి రెండు అధునాతన యుద్ధనౌకలు

భారత నౌకాదళానికి ఒక స్టెల్త్‌ ఫ్రిగేట్, ఒక స్టెల్త్‌ డిస్ట్రాయర్‌ యుద్ధనౌకలు అందాయి. ముంబయిలోని మజ్గావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) వీటిని నిర్మించింది. స్టెల్త్‌ ఫ్రిగేట్‌కు ఐఎన్‌ఎస్‌ నీలగిరి అని, డిస్ట్రాయర్‌కు ఐఎన్‌ఎస్‌ సూరత్‌ అని పేరు పెట్టారు. ‘నీలగిరి’ని ప్రాజెక్ట్‌ 17ఏ కింద, ‘సూరత్‌’ను ప్రాజెక్ట్‌ 15బి కింద నిర్మించారు. వీటిని నౌకాదళానికి చెందిన వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో డిజైన్‌ చేసింది.  నీలగిరిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.  ‘సూరత్‌’ సాగరంలో అన్ని రకాల పోరాటాలను చేయగలదు. 

Current Affairs

జేపీసీ ఛైర్‌పర్సన్‌గా పీపీ చౌధరి

జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి రాజస్థాన్‌ ఎంపీ పీపీ చౌధరి నేతృత్వం వహించనున్నారు. 2024, డిసెంబరు 20న స్పీకర్‌ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పీపీ చౌధరి రాజస్థాన్‌లోని పాళి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   2025 బడ్జెట్‌ సమావేశాల చివరి వారం తొలిరోజు తన నివేదికను జేపీసీ పార్లమెంటుకు సమర్పించాలని గడువు విధించారు.

Current Affairs

కొబ్బరి కనీస మద్దతుధర పెంపు

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతుధరను పెంచింది. మిల్లింగ్‌ కొబ్బరి ధర క్వింటా రూ.11,582గా, బంతి కొబ్బరి ధరను రూ.12,100గా నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024, డిసెంబరు 20న జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది.  2024తో పోలిస్తే మిల్లింగ్‌ కొబ్బరి ధర క్వింటాకు రూ.422, బంతి కొబ్బరి ధర రూ.100 మేర పెంచారు.

Current Affairs

ఓం ప్రకాశ్‌ చౌటాలా కన్నుమూత

హరియాణా మాజీ ముఖ్యమంత్రి, జాట్‌ నేత, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) చీఫ్‌ ఓం ప్రకాశ్‌ చౌటాలా (89) 2024, డిసెంబరు 20న గురుగ్రామ్‌లో మరణించారు. ఆయన 1989 నుంచి 2005 మధ్య అయిదుసార్లు హరియాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఓం ప్రకాశ్‌ చౌటాలా 1935లో జన్మించారు. ఉప ప్రధానిగా పనిచేసిన చౌధరీ దేవీలాల్‌ అయిదుగురు సంతానంలో ఓం ప్రకాశ్‌ పెద్దవారు.

Current Affairs

జ్యోష్న రికార్డు స్వర్ణం

భారత వెయిట్‌లిఫ్టర్‌ జోష్న సబర్‌ యూత్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గింది. 2024, డిసెంబరు 20న దోహాలో జరిగిన యూత్‌ బాలికల 40 కేజీల విభాగంలో జోష్న 135 కిలోలు (స్నాచ్‌ 60 కేజీలు + క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 75 కేజీలు) బరువులెత్తి సరికొత్త రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది.  యూత్‌ బాలికల 45 కేజీలలో పాయల్‌ 155 కిలోలు (70+85) బరువులెత్తి బంగారు పతకం సాధించింది. జూనియర్‌ బాలికల 45 కేజీల విభాగంలో పాయల్, యూత్‌ బాలుర 49 కేజీలలో బాబూలాల్‌ హేమ్‌బ్రోమ్‌ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

Current Affairs

పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాత్రపు జెస్సీరాజ్‌కు ప్రతిష్ఠాత్మక ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ వరించింది. దేశవ్యాప్తంగా ఏటా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. తాజా జాబితాను ఇటీవల కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది.  జెస్సీ వయసు 14 ఏళ్లు.. తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె అంతర్జాతీయ స్కేటింగ్‌ క్రీడాకారిణి. స్వస్థలం గుంటూరు జిల్లాలోని మంగళగిరి. తన తొమ్మిదో ఏట నుంచి స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ 50 పతకాలు, బహుమతులు సాధించింది.

Admissions

TGCET-2025 for 5th Class

Applications for Common Entrance Test for Admission into 5th Class for the academic year 2025-26 (in TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS and TGREIS). Common Entrance Test for Admission into 5th Class for the academic year 2025-26 Details: Eligibility: Studying in 4th Class during the year 2024-2025. Selection Process: Based on entrance test, rule of reservation. Application Fee: Rs.100. Starting date for online application: 21-12-2024. Last date for online application: 01-02-2025. Date of Entrance Test: 23-02-2025. Contact numbers: Help line number: 1800 425 45678 TGSWREIS: 040- 23391598 TGTWREIS: 9491063511 MJPTBCWREIS: 040- 23328266 TGREIS: 040- 24734899 Website:https://tgcet.cgg.gov.in/TGCETWEB/