Posts

Current Affairs

ఇన్‌కాయిస్‌

హిందూ మహాసముద్రంలో సునామీ బీభత్సాన్ని సృష్టించి డిసెంబరు 26 నాటికి 20 ఏళ్లు అయిన సందర్భంగా హైదరాబాద్‌ ప్రగతినగర్‌లోని భారత జాతీయ మహాసముద్ర పరిశోధనా కేంద్రం(ఇన్‌కాయిస్‌)లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నవేరియాలో ఉండే షిప్‌లకు సునామీ సమాచారం అందించే వ్యవస్థను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ప్రారంభించారు.  2004లో సునామీ సృష్టించిన అల్లకల్లోలంతో దేశంలో 10,749 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 2.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

Current Affairs

‘ఏఐ’పై 8 మందితో కమిటీ

ఆర్థిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ)ను బాధ్యతాయుతంగా, నైతికతతో తీసుకొచ్చేందుకు ఒక నియమావళిని అభివృద్ధి చేయడానికి 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2024, డిసెంబరు 26న ప్రకటించింది. దీనికి ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం) పుష్పక్‌ భట్టాచార్య నేతృత్వం వహించనున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో ఆర్థిక సేవల్లో ఏఐ ప్రస్తుత స్థాయిని ఈ ప్యానెల్‌ అంచనా వేస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగంపై దృష్టి సారించి ఏఐపై నియంత్రణ, పర్యవేక్షక విధానాలను కూడా సమీక్షిస్తుంది. ఏఐ వినియోగంతో ఎదురయ్యే ప్రమాదాలను కూడా గుర్తిస్తుంది. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌లు, పీఎస్‌ఓలతో పాటు ఆర్థిక సంస్థలకు పర్యవేక్షణ ఫ్రేమ్‌వర్క్‌ను సిఫారసు చేస్తుంది.

Current Affairs

అతిపెద్ద గ్రామీణ బ్యాంకుగా టీజీబీ

దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (టీజీబీ) అవతరించనుంది. గ్రామీణ బ్యాంకులను పటిష్ఠపరిచేలా కేంద్రం తీసుకున్న ‘ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు’ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌(ఏపీజీవీబీ)కు చెందిన తెలంగాణలోని శాఖలన్నీ ఇకపై టీజీబీలో విలీనం కానున్నాయి. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని 2024, డిసెంబరు 26న టీజీబీ ఛైర్మన్‌ వై.శోభ వెల్లడించారు.  ప్రస్తుతం ఏపీజీవీబీ తెలుగు రాష్ట్రాల్లో 771 శాఖలతో సేవలందిస్తోంది. దీనికి తెలంగాణలో ఉన్న 493 శాఖలు టీజీబీలో విలీనమవుతాయి. 

Current Affairs

ఫార్మాగ్జిల్‌ కొత్త ఛైర్మన్‌గా నమిత్‌ జోషి

ఫార్మాసూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌(ఫార్మాగ్జిల్‌) కొత్త ఛైర్మన్‌గా నమిత్‌ జోషి 2024, డిసెంబరు 26న బాధ్యతలు చేపట్టారు. ఫార్మాగ్జిల్‌ 20వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనను ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ ఆయన వైస్‌ఛైర్మన్‌గా పనిచేశారు. బెయిన్‌ కేపిటల్‌కు చెందిన సెంట్రియంట్‌ ఫార్మాసూటికల్స్‌కు డైరెక్టర్‌ (కమర్షియల్‌)గానూ వ్యవహరిస్తున్నారు. ఈయన ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందినవారు.

Current Affairs

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు

ప్రతిష్ఠాత్మక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ, దిల్లీ) డైరెక్టర్‌గా చెరుకుపల్లి శ్రీనివాసరావు 2024, డిసెంబరు 26న నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి, శాస్త్రవేత్త ఈయనే. శ్రీనివాసరావు స్వస్థలం ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని అనిగండ్లపాడు.  బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1982-86లో ఏజీ బీఎస్సీ, 1986-88 వరకు పీజీ చదివారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ చేశారు. 1992లో శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

Current Affairs

ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌

ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ నిర్మాణానికి చైనా ఆమోదముద్ర వేసింది. భూమిపై ఇప్పటి వరకూ నిర్మితమైన ప్రాజెక్టులన్నిటి కంటే పెద్దదైన దీని నిర్మాణ వ్యయం 137 బిలియన్‌ డాలర్లు. టిబెట్‌లో భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్రా నదిపై నిర్మించనుంది. టిబెట్‌లో యార్లంగ్‌ జంగ్బో నదిగా ప్రసిద్ధమైన బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హిమాలమ పర్వతాల్లోని ఒక విశాల అగాధంలో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. 

Current Affairs

రాష్ట్రీయ బాలపురస్కార్‌

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్‌ క్రీడాకారిణి జెస్సీరాజ్‌ మాత్రపు (14) 2024, డిసెంబరు 26న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ను అందుకుంది. స్కేటింగ్‌లో అసాధారణ కళాత్మకత చూపినందుకు ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం వరించింది.  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొత్తం 7 విభాగాల్లో 17 మంది బాలలకు ఈ పురస్కారాలు అందించారు. 

Current Affairs

మన్మోహన్‌ సింగ్‌ మరణం

భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌ సింగ్‌ (92) 2024, డిసెంబరు 26న దిల్లీలో మరణించారు. యూపీఏ హయాంలో 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ సింగ్, 2014 వరకూ కొనసాగారు. 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.  ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్‌లోని గహ్‌లో 1932 సెప్టెంబరు 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్‌ సింగ్‌ జన్మించారు.  1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.  1991లో ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రి అయ్యారు. 

Government Jobs

Scientific Assistant Posts In TMC-ACTREC

Tata Memorial Center - Advanced Center for Treatment, Research and Education in Cancer (ACTREC), Mumbai invites applications for the following posts.  No. of Posts: 17 Details: Scientific Officer 'E' : 01 Nurse 'A'- 04 Assistant Administrative Officer- 02 Scientific Assistant 'B'- 04 Technician 'A'- 05 Lower Division Clerk- 01 Eligibility: Diploma, Degree, BE/B.Tech, B.Sc, BE, H.S.C, Ph.D in the relevant discipline as per the post along with work experience and computer knowledge. Salary: Per month Rs.78,800 for Scientific Officer 'E' post; Rs.44,900 for Nurse, Assistant Administrative Officer; Rs.35,400 for Scientific Assistant; 19,900 for Technician, Lower Division Clerk. Age Limit: 45 years for Scientific Officer 'E' post; Nurse, Scientific Assistant 30 years; Assistant Administrative Officer 40 years; Technician, Lower Division Clerk should not exceed 27 years. (SC/ ST five years; OBC three years; 10 years age relaxation for PwBD candidates) Place of Work: ACTREC, Tata Memorial Centre, Kharghar, Navi Mumbai. Last date of online application: 24-01-2025. Website:https://actrec.gov.in/

Government Jobs

Probationary Officer Posts In SBI

State Bank of India, Central Recruitment & Promotion Department, Corporate Centre, Mumbai invites applications for appointment as Probationary Officers(POs). No. of Posts: 600 (SC- 87, ST- 57, OBC- 158, EWS- 58, UR- 240) Details: Qualifications: Graduation in any discipline. Age Limit (As on 01.04.2024): Not below 21 years and not above 30 years. Pay scale: Per month Rs.48,480 to Rs.85,920. Application Fee: Rs.750 (exempted for SC/ ST/ PwBD candidates). Selection Procedure: Based on Phase I- Preliminary Examination, Phase II- Main Examination, Phase III- Psychometric Test, Group Exercise, Interview, Document Verification, Medical Examination. Preliminary Examination Subjects: English Language (40 Questions), Quantitative Aptitude (30 Questions), Reasoning Ability (30 Questions). Total no. of questions: 100. Total Maximum Marks: 100. Exam Duration: 1 hour. Main Examination Subjects: Reasoning & Computer Aptitude (40 Questions- 60 Marks), Data Analysis & Interpretation (30 Questions- 60 Marks), General Awareness / Economy/ Banking Knowledge (60 Questions- 60 Marks), English Language (40 Questions- 20 Marks). Total no. of questions: 170. Total Maximum Marks: 200. Exam Duration: 3 hour. Preliminary Examination Centre in AP & Telangana States: Chittoor, Eluru, Guntur/ Vijaywada, Kadapa, Kakinada, Kurnool, Nellore, Ongole, Rajahmundhry, Srikakulam, Tirupati, Vishakhapatnam, Vizianagaram, Hyderabad, Karimnagar, Khammam, Warangal. Main Examination Centre in AP & Telangana States: Guntur/ Vijayawada, Kurnool, Vishakhapatnam, Hyderabad. On-line registration including Editing/ Modification of Application: 27.12.2024 to 16.01.2025. Payment of Application Fee: 27.12.2024 to 16.01.2025. Download of Preliminary Examination Call Letters: 3rd or 4th week of February 2025 onwards. Phase-I Online Preliminary Examination: 8th & 15th March 2025. Declaration of Result of Preliminary Examination: April 2025. Download of Main Examination Call letter: 2nd Week of April 2025 onwards. Phase-II Online Main Examination: April / May 2025. Declaration of Result of Main Examination: May / June 2025. Download of Phase-III Call Letter: May / June 2025. Phase-III Psychometric Test: May / June 2025. Interview & Group Exercises: May / June 2025. Declaration of Final Result: May / June 2025. Website:https://bank.sbi/web/careers/current-openings Apply online:https://ibpsonline.ibps.in/sbiponov24/