Posts

Government Jobs

ఎన్‌టీపీసీలో ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన గేట్‌-2024 స్కోర్‌ ద్వారా ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 475 వివరాలు: 1. ఎలక్ట్రానిక్స్‌- 135 2. మెకానికల్‌- 180 3. ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌- 85 4. సివిల్‌- 50 5. మైనింగ్‌- 25 అర్హత: ఇంజినీరింగ్‌ లేదా టెక్నాలజీ/ఏఎంఐఈలో 65 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫుల్‌ టైం బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు 55%)తో పాటు గేట్‌ 2024 స్కోర్‌ తప్పనిసరి ఉండాలి. జీత భత్యాలు: నెలకు రూ.40,000- రూ.1,40,000. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: గేట్‌ 2024 స్కోర్‌, షార్ట్‌లిస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.02.2025. Website:https://ntpc.co.in/jobs-ntpc

Government Jobs

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్‌ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) రెగ్యులర్‌ ప్రాతిపదికన క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 1000 (ఎస్సీ- 150; ఎస్టీ- 75; ఓబీసీ- 270; ఈడబ్ల్యూఎస్‌- 100; జనరల్- 405) వివరాలు: గ్రేడ్‌/ స్కేల్‌: జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌/ స్కేల్‌-1 (JMGS 1) అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ 55 శాతం) ఉండాలి. వయోపరిమితి: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు; ఓబీసీకి మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది). పే స్కేల్: నెలకు రూ.48,480 - రూ.85,920 వరకు వేతనం ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.750, జీఎస్‌టీ(ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175, జీఎస్‌టీ). పరీక్ష విధానం: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రిజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌ (రిలేటెడ్‌ బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ) సబ్జెక్టుల నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున  ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎస్సై పరీక్ష రెండు ప్రశ్నలకు 30 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది.  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.02.2025. Website:https://centralbankofindia.co.in/en Apply online:https://ibpsonline.ibps.in/cbicojan25/

Current Affairs

ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2025, జనవరి 29న దిగ్విజయంగా 100వ ప్రయోగ మైలురాయిని అందుకుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లి ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీఓ)లో ప్రవేశపెట్టింది.  2,250 కేజీల ఎన్‌వీఎస్‌-02 స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ (నావిక్‌)లో రెండో జనరేషన్‌ ఉపగ్రహం. ఇందులో ఉండే ‘రుబిడియం అటామిక్‌ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్‌’ అణు గడియారం ఉపగ్రహానికి కీలకమైంది.  భారత్‌తో పాటు చుట్టుపక్కల 1,500 కి.మీ. ఈ ఉపగ్రహం పరిధిలోకి వస్తుంది. ఉపరితల, వాయు, సముద్ర నావిగేషన్, వ్యవసాయం, శాటిలైట్‌ల గమన మార్గం, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) తదితరాలకు ఎన్‌వీఎస్‌-02 సేవలు ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది.

Current Affairs

నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా 2025, జనవరి 29న నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జనవరి 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో హరీష్‌కుమార్‌ గుప్తాకు పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌వోపీఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.  జమ్మూకశ్మీర్‌కు చెందిన హరీష్‌కుమార్‌ గుప్తా న్యాయవిద్యను అభ్యసించారు. 2013లో శాంతిభద్రతల విభాగం ఐజీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్‌ గుప్తా 2017 వరకూ దాదాపు నాలుగేళ్లపాటు ఆ పోస్టులో సేవలందించారు. 

Current Affairs

గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఎ.కె.ప్రధాన్‌

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌గా ఎ.కె.ప్రధాన్‌ నియమితులయ్యారు. కేంద్ర జల సంఘంలో చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కొద్దిరోజుల క్రితం వరకు బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన ముఖేష్‌కుమార్‌ సిన్హా కేంద్ర జల సంఘం ఛైర్మన్‌గా పదోన్నతిపై నియమితులు కావడంతో ఈయన స్థానంలో ప్రధాన్‌ను నియమిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Current Affairs

హాకీ జట్టు సారథిగా వందన

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీలో పాల్గొనే భారత మహిళల జట్టుకు వందన కటారియా సారథ్యం వహించనుంది. ఫిబ్రవరి 15న భువనేశ్వర్‌లో ప్రారంభమయ్యే లీగ్‌ కోసం 24 మంది క్రీడాకారిణులతో 2025, జనవరి 29న భారత జట్టును ప్రకటించారు. భారత్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ బరిలో దిగే ఈ లీగ్‌లో ఒక్కో జట్టు రెండేసి మార్లు తలపడతాయి. భారత జట్టు:  గోల్‌ కీపర్లు: సవిత, బిచు దేవి; డిఫెండర్లు: సుశీల చాను, నిక్కి ప్రధాన్, ఉదిత, జ్యోతి, ఇషిక చౌదరి, జ్యోతి ఛత్రి;  మిడ్‌ ఫీల్డర్లు: వైష్ణవి ఫాల్కే, నేహా, మనీషా చౌహాన్, సలీమా టెటె, సునెలిత తోపో, లాల్రెంసియామి, బల్జీత్‌ కౌర్, షర్మిల దేవి; ఫార్వర్డ్‌లు: నవనీత్‌ కౌర్, ముంతాజ్‌ ఖాన్, ప్రీతి దూబె, రుతుజ పిసల్, బ్యూటీ డుంగ్‌డుంగ్, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా.

Current Affairs

గణతంత్ర శకటాలు

గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటిన ఏటికొప్పాక పర్యావరణ అనుకూల శకటానికి మూడో బహుమతి లభించింది. తొలి రెండు బహుమతులకు ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన మహాకుంభమేళా శకటం, త్రిపురకు చెందిన 14 దేవతామూర్తుల ఆరాధన శకటాలకు లభించాయి. ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జీల ప్యానల్‌ వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాల రూపకల్పన, వాటి ఇతివృత్తాలను పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర రక్షణశాఖ అవార్డులను ప్రకటించింది. 

Current Affairs

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2025, జనవరి 29న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంది. ఏడేళ్ల వ్యవధిలో రూ.34,300 కోట్ల వ్యయం అంచనాతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ (ఎన్‌సీఎంఎం)కు ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్‌కు కేంద్రం రూ.16,300 కోట్లు సమకూర్చనుంది. ప్రభుత్వరంగ సంస్థలు రూ.18 వేల కోట్లను అందించనున్నాయి. కీలక ఖనిజాల (క్రిటికల్‌ మినరల్స్‌) రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా, హరిత ఇంధన రంగానికి ఊతం దిశగా ఈ మిషన్‌ దోహదం చేయనుంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ ఖనిజాల అన్వేషణను ప్రోత్సహిస్తుంది.

Government Jobs

Project Associate Posts In RITES

Rail India Technical and Economic Service (RITES) Gurugram invites applications for the Project Associate posts on contract basis. No. of Posts: 5 Details: Eligibility: Bachelor's/Engineering Degree. Age Limit: Not more than 40 years as on the last date of application. Selection Process: Based on educational qualifications, interview etc. Basic Pay: Per monthRs.22,660 . Last Date for Online Application: 13-02-2025. Interview Dates: 12, 13, 14-02-2025. Venue: RITES Office Ahmedabad, RITES Corporate Office, Shikhar, Sector-29, Haryana, Gurugram. Website:https://www.rites.com/

Government Jobs

Various Posts In Cochin Shipyard Ltd

Cochin Shipyard Limited, Kochi, Kerala, is inviting applications for the following vacancies on fixed term basis.  No. of Posts: 11 Details: 1. Serang- 09 2. Engine Driver- 01 3. Lasker (Floating Craft)-01 Eligibility: Must have passed 7th class along valid Serang / Lascar cum Serang Certificate issued by the Competent Authority under the relevant statutes. Salary: Per month Rs.23,300 for Serang and Engine Driver posts in the first year, Rs.24,000 in the second year; Rs.24,800 in the third year; Rs.22,100 in the first year, Rs.22,800 in the second year; Rs.23,400 in the third year. Age limit: Not more than 30 years as on the last date of application. 5 years for SC candidates; 3 years relaxation for OBC candidates. Selection process: Based on practical test. Application fee: Rs. 200, fee exemption for SC/ST/Divyang candidates. Last date for online application: 13-02-2025. Website:https://cochinshipyard.in/