Posts

Current Affairs

జాన్‌ మెక్‌ఫాల్‌

దివ్యాంగుడైన జాన్‌ మెక్‌ఫాల్‌కు రోదసియాత్ర చేయడానికి ఆమోదం లభించింది. దీంతో వైకల్యంతో రోదసిలోకి వెళుతున్న తొలి మానవుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. జాన్‌ (43) స్వస్థలం బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌. 19 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉండగా మోటారు బైకు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నారు. 2005లో పారా అథ్లెట్‌గా మారారు. అనేక పోటీల్లో విజేతగా నిలిచారు. 2008లో బీజింగ్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్నారు.  2022లో ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ‘ఫ్లై’ అనే ప్రాజెక్టులో పాలుపంచుకోవడానికి ఆయనకు అనుమతి లభించింది. వైకల్యమున్న వ్యోమగామిని రోదసిలోకి తీసుకెళ్లడంలో ఉన్న సవాళ్లను అధ్యయనం చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. భూకక్ష్యలో ఉన్న అంతరాత్జీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో దీర్ఘకాల యాత్ర చేపట్టడానికి జాన్‌ అర్హుడేనన్న వైద్యపరమైన ధ్రువీకరణ లభ్యమైనట్లు ఈఎస్‌ఏ ప్రకటించింది. ఆయన ఐఎస్‌ఎస్‌కు పయనమయ్యే తేదీ ఇంకా వెల్లడికాలేదు. పారాఆస్ట్రోనాట్‌గా ఆయన గుర్తింపు పొందనున్నారు. 

Walkins

ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్‌లో పోస్టులు

హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిసైన్‌ (ఎంఎస్‌ఎంఈ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: 1. ఫ్యాకల్టీ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్ 2. ఫ్యాకల్టీ ఫర్‌ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 3. అడ్మినిస్ట్రేటివ్ ఆసిస్టెంట్‌ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24, 25 వేదిక: ఎంస్‌ఎంఈ-టూల్‌ రూమ్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిసైన్‌, బాలానగర్‌, హైదరాబాద్-500037 Website: https://citdindia.org/index.php

Government Jobs

ఎన్‌హెచ్‌ఏఐలో కన్సల్టెంట్ పోస్టులు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 04 వివరాలు: 1. ప్రిన్సిపల్‌ కన్సల్టెంట్‌ ((ఆర్‌ఏఎంస్‌): 01 2. కన్సల్టెంట్‌(ఆర్‌ఏఎంస్‌): 02 3. కన్సల్టెంట్(ఆర్‌ఏఎంఎస్‌-ఐటీ): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌( సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌ పోస్టుకు 55 ఏళ్లు, కన్సల్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌కు రూ.2,30,000, కన్సల్టెంట్‌ పోస్టులకు రూ.1,50,000. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-03-2025. Website:https://nhai.gov.in/#/

Government Jobs

దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విశాఖపట్నంలో పోస్టులు

విశాఖపట్నంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 04 పోస్టు పేరు - ఖాళీలు: 1. లేడీ(పీఈటీ): 01 2. పీఆర్టీ-ఇంగ్లీష్‌: 02 3. పీఆర్టీ మ్యాథ్స్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీనీఈడి, బీఈడీ, టెట్‌, సెట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: పీఈటీ పోస్టుకు 40 ఏళ్లు, పీఆర్టీ మాథ్స్‌, ఇంగ్లీష్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా E mail-dpsvisakhapatnam@gmail.com, ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 4-03-2025. Website:http://www.dpsvisakhapatnam.org/pages/current_openings.html

Government Jobs

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా కింది స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌ (ఎంఎంజీఎస్‌-II) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 10 వివరాలు: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యర్హత ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.64820- రూ.93,960. వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్‌ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04.03.2025. Website:https://bankofindia.co.in/

Government Jobs

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌), బెంగళూరు ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 7 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.30,000 - 1,20,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-03-2025. Website:https://bel-india.in/job-notifications/

Apprenticeship

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ట్రైనీ అప్రెంటిస్‌ పోస్టులు

మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌, ఐటీఐ ట్రేడ్‌ ట్రైనీ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 1,765. వివరాలు: 1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 227  2. డిప్లొమా అప్రెంటిస్‌-  597 3. ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌- 941 స్ట్రీమ్స్‌/ కోర్సెస్‌/ ట్రేడులు: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మైనింగ్‌ ఇంజినీరింగ్‌, బ్యాక్‌-ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మోడ్రన్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్రెటేరియల్‌ ప్రాక్టిస్‌, ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌ (ఆటో). స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.7700. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24-02-2025. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 7.3.2025 Website:https://www.nclcil.in/

Walkins

Posts In MSME Hyderabad

Central Institute of Tool Design (MSME), Hyderabad is conducting interviews to fill the faculty posts.  Details: 1. Faculty of Electronics Engineering 2. Faculty of Electrical Engineering 3. Administrative Assistant Qualification: Candidates should have passed BE, BTech, ME, MTech (Electrical, Electronics) in the relevant discipline as per the post along with work experience. Selection Process: Based on Interview. Interview Date: February 24, 25 Venue: MSME-Tool Room, Central Institute of Tool Design, Balanagar, Hyderabad-500037 Website:http://https//citdindia.org/index.php

Government Jobs

Consultant Posts In NHAI

National Highway Authority of India (NHAI) is inviting applications for the Consultant posts on contractual basis.  Number of Posts: 04 Details: 1. Principal Consultant ((RAMS): 01 2. Consultant (RAMS): 02 3. Consultant (RAMS-IT): 01 Qualification: Candidates should have passed B.Tech (Civil, Computer Science, IT Engineering) in the relevant discipline as per the post along with work experience. Age Limit: Not more than 55 years for the post of Principal Consultant and 50 years for the posts of Consultant. Salary: Rs. 2,30,000 per month for Principal Consultant and Rs. 1,50,000 for Consultant posts. Last Date for Online Application: 05-03-2025. Website:https://nhai.gov.in/#/

Government Jobs

Posts In Delhi Public School Visakhapatnam

Delhi Public School (DPS) in Visakhapatnam is inviting applications for the vacant faculty posts.  Number of Posts: 04 Details: 1. Lady (PET): 01 2. PRT-English: 02 3. PRT Maths: 01 Qualification: Must have passed B.Ed, B.Ed, TET, SET in the relevant discipline as per the post and have work experience. Age limit: Not more than 40 years for PET post, 30 years for PRT Maths and English posts. Application process: Through e-mail E mail-dpsvisakhapatnam@gmail.com, Selection process: Based on interview. Last date of application: 4-03-2025. Website:http://www.dpsvisakhapatnam.org/pages/current_openings.html