Posts

Current Affairs

హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు

ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి (మిస్‌ వరల్డ్‌) పోటీలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. 2025, మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్‌ ఫినాలే సహా ప్రారంభ, ముగింపు వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర ఈవెంట్లు జరగనున్నాయి. ఈ మేరకు పోటీల నిర్వాహకులు 2025, ఫిబ్రవరి 19న ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. మన దేశంలో ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలు గతంలో 1996, 2024లలో జరిగాయి. 

Current Affairs

డబ్ల్యూహెచ్‌వో చట్రంలోకి ఆయుర్వేదం

డబ్ల్యూహెచ్‌వో ఏటా విడుదల చేసే వ్యాధి గణాంకాల నమోదు, విశ్లేషణ, వ్యాఖ్యానాల సంకలనం (ఐసీడీ)- 11లో సంప్రదాయ వైద్యరీతులకు స్థానం కల్పించింది. దీనికి సంబంధించి తాజా ఐసీడీ-11లో కొత్త మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. దీంతో దేశీయ వైద్య రీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానీలకూ అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లైందని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ వైద్య సేవా వ్యూహాల్లో, వైద్య విధానాల్లో దేశీయ వైద్యానికి స్థానం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయుష్‌ శాఖ పేర్కొంది.

Current Affairs

సీఈసీగా జ్ఞానేశ్‌ బాధ్యతల స్వీకరణ

దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్‌ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషీ 2025, మార్చి 19న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్‌కు సీఈసీగా పదోన్నతి లభించగా, ఆయన స్థానంలో వివేక్‌ జోషి ఎలక్షన్‌ కమిషనర్‌గా వచ్చారు. జోషి అంతకుముందు హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఎన్నికల సంఘంలో మరో కమిషనర్‌గా సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు కొనసాగుతున్నారు.

Current Affairs

భారత్‌-అర్జెంటీనా కీలక ఒప్పందం

రీఛార్జిబుల్‌ బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం అన్వేషణతో పాటు గనుల రంగంలో పరస్పరం సహకరించుకొనే విషయమై భారత్, అర్జెంటీనాలు అవగాహనకు వచ్చాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ రంగ సంస్థ మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్, కెటమార్కా ప్రొవెన్షియల్‌ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య 2025, ఫిబ్రవరి 19న దిల్లీలో ఒప్పందం కుదిరింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, అర్జెంటీనాలోని కెటమార్కా గవర్నర్‌ రౌల్‌ అలెజాండ్రోజలీల్‌ల సమక్షంలో ఇది జరిగింది. 

Current Affairs

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను (50 ఏళ్లు) 2025, ఫిబ్రవరి 19న ఎంపికయ్యారు. 48 మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన భాజపా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖాకు సీఎంగా అవకాశం ఇచ్చింది. భాజపా అధికారంలో ఉన్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం రేఖాగుప్తాను ఎంపిక చేసింది. శాలీమార్‌ బాగ్‌ నుంచి ఆమె ఆప్‌ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు.  హరియాణాలోని జులానాలో 1974 జులై 19న రేఖా గుప్తా జన్మించారు. 1992లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో దిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు.  ప్రస్తుతం ఆమె భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. 

Walkins

ఐసీఏఆర్-సీఆర్‌ఐడీఏలో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

హైదరాబాద్‌ ఐసీఏఆర్‌-సెంట్రల్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైలాండ్ అగ్రికల్చర్‌ ( ఐసీఏఆర్-సీఆర్‌ఐడీఏ) సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ(అగ్రికల్చర్‌, డైరీ ఎకనామిక్స్‌, ఎకనామిక్స్‌, అగ్రిస్టాటిక్స్‌, స్టాటిక్స్‌, అగ్రోమెటీరియాలజీ, అగ్రి ఫిజిక్స్‌, అగ్రోనమీ, సోయిల్ సైన్స్‌, అగ్రి ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఐటీ, జీయోఇన్‌ఫర్‌మ్యాటిక్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మార్చి 4వ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ. 37,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఐసీఏఆర్‌- ఐసీఏఆర్‌-సెంట్రల్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైలాండ్ అగ్రికల్చర్‌ (ఐసీఏఆర్-సీఆర్‌ఐడీఏ), సంతోష్‌ నగర్‌, హైదరాబాద్‌-500059. ఇంటర్వ్యూ తేదీ: 4 మార్చి 2025 Website:https://www.icar-crida.res.in/recruit.html

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) వివిధ విభాగాల్లో సైట్‌ అసెసర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 6 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, బీఈ, బీటెక్(సీఎస్/ఐటీ) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 26-01-2025 తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-03-2025. Website:https://www.rites.com/Career

Government Jobs

పీజీసీఐఎల్‌లో మేనేజిరియల్‌ పోస్టులు

హరియాణాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్‌) మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు సంఖ్య: 115 వివరాలు: 1. మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 09 2. డిప్యూటీ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 48 3. అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 58  అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: మేనేజర్‌ పోస్టుకు 39; డిప్యటీ మేనేజర్‌కు 36, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 33 ఏళ్లు మించకూడదు. పే స్కేల్: నెలకు మేనేజర్‌ పోస్టుకు రూ.1,13,500; డిప్యటీ మేనేజర్‌కు రూ.97300; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.76,700. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12-03-2025. Website:https://www.powergrid.in/job-opportunities Apply online:https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx

Government Jobs

ఐఎఫ్‌సీఐ దిల్లీలో డైరెక్టర్‌ పోస్టులు

దిల్లీలోని ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఐఎఫ్‌సీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు సంఖ్య: 08 వివరాలు: 1. డైరెక్టర్‌: 01 2. డైరెక్టర్‌(ఐటీ): 01 3. అసోసియేట్‌ డైరెక్టర్‌: 01 4. అసోసియేట్ డైరెక్టర్‌(ఎస్టేట్‌, సర్వీస్‌, అడ్మినిస్ట్రేషన్‌): 01 5. సీనియర్‌ అసోసియేట్‌: 02 6. సీనియర్‌ అసోసియేట్‌(ఐటీ): 01 7. అసోసియేట్‌ (అడ్వైజరీ): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీసీఏ, బీఈ, బీటెక్‌, సీఏ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 జనవరి 1వ తేదీ నాటికి అసోసియేట్‌కు 35 ఏళ్లు, అసోసియేట్‌ డైరెక్టర్‌కు 55 ఏళ్లు, డైరెక్టర్‌కు 57 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా email at contract@ifciltd.com.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025. Website:https://www.ifciltd.com/?q=en/content/current-openings

Government Jobs

డీఐబీటీలో జూనియర్‌ రిసెర్చ్‌ పోస్టులు

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో- డిఫెన్స్‌ టెక్నాలజీస్‌ (డీఐబీటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 18 వివరాలు:  విభాగాలు: మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ సైన్స్‌/ ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/ గేట్‌ స్కోర్‌ ఉండాలి.  వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.37,000. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17.03.2024. Website:https://www.drdo.gov.in/drdo/careers