Posts

Current Affairs

United States will introduce a “Gold Card” programme

♦ US President Donald Trump announced that the United States will introduce a “Gold Card” programme for wealthy foreigners, granting them the right to live and work in the country, with a pathway to citizenship, in exchange for a USD 5 million fee. ♦ The Gold Card will replace the existing EB-5 immigrant investor visa program.

Current Affairs

Defence Research and Development Organisation (DRDO)

♦ The Defence Research and Development Organisation (DRDO) and the Indian Navy successfully conducted flight trials of the first-of-its-kind Naval Anti-Ship Missile (NASM-SR) from the Integrated Test Range (ITR) in Chandipur on 26 February 2025. ♦ The missile, launched from an Indian Navy Sea King helicopter, demonstrated its capability against ship targets, marking a significant advancement in India’s defense technology. ♦ During the trial, the missile engaged a small ship target in sea-skimming mode at its maximum range, successfully validating its Man-in-Loop feature. ♦ This capability enables real-time target selection and in-flight retargeting, enhancing operational flexibility. ♦ The missile is equipped with an indigenous Imaging Infra-Red Seeker for terminal guidance, ensuring high-accuracy strikes. ♦ Developed by multiple DRDO laboratories, including the Research Centre Imarat, Defence Research and Development Laboratory, High Energy Materials Research Laboratory, and Terminal Ballistics Research Laboratory, the missile is being produced in collaboration with Development cum Production Partners, MSMEs, and start-ups.

Current Affairs

ఎన్‌ఎండీసీ స్టీల్‌ అధిపతిగా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌ అధిపతిగా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ 2025, ఫిబ్రవరి 26న బాధ్యతలు చేపట్టారు. ఎన్‌ఎండీసీ నుంచి విడిపోయిన ఈ సంస్థకు ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్‌లో అత్యాధునిక స్టీలు కర్మాగారం ఉంది. ప్రస్తుతం 30 లక్షల టన్నుల హాట్‌ మెటల్‌ను ఈ కర్మాగారం ఉత్పత్తి చేస్తోంది.   ప్రభాకర్, గతంలో సెయిల్‌కు చెందిన రూర్కెలా స్టీలు ప్లాంట్‌లో సీజీఎంగా పనిచేశారు. అక్కడి నుంచి ఎన్‌ఎండీసీ స్టీలుకు వచ్చారు. 

Current Affairs

థింక్‌ట్యాంక్‌ పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ నివేదిక

గ్రామీణాభివృద్ధి శాఖకు 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,90,406 కోట్లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌), ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన(పీఎంఏవైజీ) పథకాలు 75 శాతం నిధులను కలిగి ఉన్నాయని థింక్‌ట్యాంక్‌ పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ తాజా నివేదిక వెల్లడించింది. 2024-25 నాటి సవరించిన అంచనాల కంటే 8 శాతం అధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకు నిధులు లభించాయని, భూ వనరుల శాఖకు 35 శాతం అధికంగా రూ.2,651 కోట్లు లభించినట్లు తెలిపింది.  గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్‌ కేటాయింపులో భాగంగా ఉపాధి హామీ పథకానికి 46 శాతం, పీఎమ్‌ఏవైజీకి దాదాపు 29 శాతం చొప్పున నిధుల కేటాయింపు జరిగినట్లు పేర్కొంది. వీటి తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, పీఎంజీఎస్‌వైలకు పదిశాతం చొప్పున, నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాంకు 5 శాతం చొప్పున కేటాయించారు. 

Current Affairs

అంగారకుడిపై 300 కోట్ల ఏళ్లనాటి బీచ్‌

అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ అందించిన డేటా ఆధారంగా వారు ఈ ఆవిష్కారం చేశారు. అరుణగ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని 1970లలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాకు చెందిన మెరైనర్‌-9 వ్యోమనౌక అందించిన చిత్రాల్లో వెల్లడైంది.  ఆ గ్రహంపై 450 కోట్ల ఏళ్ల కిందటే నీరు ఉండేదనడానికి అంగారకుడి నుంచి వచ్చిపడ్డ ఉల్కల్లో ఆధారాలు లభ్యమయ్యాయి. గత కొన్నేళ్లలో అంతరిక్ష శిలల ఢీ వల్ల అక్కడ ఏర్పడ్డ బిలాల్లోని ఉపరితలం కింద ఐస్‌ ఉన్నట్లు కూడా తేలింది. 

Current Affairs

గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం

నౌకా విధ్వంసక క్షిపణిని (ఎన్‌ఏఎస్‌ఎం-ఎస్‌ఆర్‌) తొలిసారిగా గగన తలం నుంచి భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపుర్‌ సమీకృత పరీక్ష కేంద్రం నుంచి దీన్ని నిర్వహించారు. నౌకాదళానికి చెందిన సీ కింగ్‌ హెలికాప్టర్‌ నుంచి దీన్ని ప్రయోగించారు.  క్షిపణికి చెందిన మ్యాన్‌-ఇన్‌-లూప్‌ ఫీచర్‌ను ఈ ప్రయోగం నిరూపించిందని, గరిష్ఠ పరిధితో సీ స్కిమ్మింగ్‌ మోడ్‌లో చిన్న నౌక లక్ష్యాన్ని నేరుగా చేరుకుందని అధికారులు వివరించారు. టెర్మినల్‌ గైడెన్స్‌ కోసం ఈ క్షిపణి దేశీయ ఇమేజింగ్‌ ఇన్‌ఫ్రా రెడ్‌ను ఉపయోగించుకుందని తెలిపారు. 

Current Affairs

అమెరికా ‘గోల్డ్‌ కార్డు’

అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్తగా ‘గోల్డ్‌ కార్డు వీసా’ పథకాన్ని ప్రకటించారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. రూ.43.5 కోట్లు (50 లక్షల డాలర్లు) వెచ్చించే వారికి ఈ గోల్డ్‌ కార్డును అందిస్తామని ప్రకటించారు.  తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దాన్ని కోటికి చేర్చాలని భావిస్తున్నామని ట్రంప్‌ తెలిపారు. 

Government Jobs

ఎన్‌ఐఓటీలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

చెన్నైలోని ఎర్త్‌సైన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వరంగా సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) ఒప్పంద ప్రాతిపదికిన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 4 వివరాలు: 1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1: 02 2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌: 02 విభాగాలు: సివిల్‌, కోస్టల్‌, ఓషియన్‌, హార్బర్‌ ఇంజినీరింగ్‌. అర్హత: డిప్లొమా, బీఈ/ బీటెక్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 35 ఏళ్లు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.56,000; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌కు రూ.20,000. పని ప్రదేశం: చెన్నై. ఎంపిక ప్రక్రియ: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టు ఇంటర్వ్యూ ద్వారా; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్‌ పోస్టును రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14-03-2025. Website:https://www.niot.res.in/ ఇంటర్వ్యూ తేదీ: 27-03-2025. రాత పరీక్ష తేదీ: 28.03.2025.

Government Jobs

ఐడీబీఐ రిక్రూట్‌మెంట్ 2025-26

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ల (గ్రేడ్ 'O') ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. ఎంపికైనవారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు పూర్తిచేయాలి. మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్, బెంగళూరులో పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు పూర్తిచేయాలి.  మొత్తం పోస్టులు: 650 (యూఆర్‌: 260, ఎస్సీ: 100, ఎస్టీ: 54, ఈడబ్ల్యూఎస్‌: 65, ఓబీసీ: 171, పీడబ్ల్యూడీ: 26) వివరాలు: అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. కంప్యూటర్ ప్రావీణ్యం, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: మార్చి 1, 2025 నాటికి 20 - 25 సంవత్సరాలు ఉండాలి. జీతం, స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.5,000; ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15,000. ఉద్యోగంలో చేరిన తర్వాత  ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ6.50 అందుతుంది. దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250; ఇతరులు రూ.1,050. పరీక్షా కేంద్రాలు: ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, పట్న తదితర నగరాల్లో. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.03.2025. దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 12.03 2025. ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 06.04.2025. Website:https://www.idbibank.in/

Government Jobs

బెల్‌లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 10 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 1-02-2025 నాటికి 50 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 19-03-2025. Website:https://bel-india.in/job-notifications/