ఓబీఓజీఎస్
గగనతలంలో అత్యంత ఎత్తుకు వెళ్లే యుద్ధ విమానాల్లో ప్రాణవాయువును ఉత్పత్తి చేసే వ్యవస్థ (ఓబీఓజీఎస్)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సొంతంగా రూపొందించింది. ఓబీఓజీఎస్ పనితీరును తేజస్ యుద్ధ విమానాల్లో పరీక్షించగా విజయవంతమైందని రక్షణ మంత్రిత్వ శాఖ 2025, మార్చి 5న వెల్లడించింది. లోహ విహంగంలోనే కొన్ని మార్పులు చేర్పులతో ఓబీఓజీఎస్‌ను మిగ్-29కె, ఇతర యుద్ధ విమానాల్లోనూ ప్రవేశపెడతామని తెలిపింది. పైలట్లు ఆక్సిజన్ కోసం సంప్రదాయ సిలిండర్లపై ఆధారపడడాన్ని తగ్గించే ఉద్దేశంతో డీఆర్‌డీఓ దీన్ని తయారు చేసింది.