Posts

Current Affairs

NASA

♦ A NASA telescope named SPHEREx (Spectro-Photometer for the History of the Universe, Epoch of Reionization and Ices Explorer) was launched into space from California for a mission to explore the origins of the universe and to scour the Milky Way galaxy for hidden reservoirs of water, a key ingredient for life. ♦ This was carried aloft by a SpaceX Falcon 9 rocket from Vandenberg Space Force Base in California. ♦ During its planned two-year mission, the observatory will collect data on more than 450 million galaxies, as well as more than 100 million stars in the Milky Way. ♦ It will create a three-dimensional map of the cosmos in 102 colors – individual wavelengths of light – and will study the history and evolution of galaxies. ♦ The mission aims to deepen the understanding of a phenomenon known as cosmic inflation, referring to the universe’s rapid and exponential expansion from a single point in a fraction of a second after the Big Bang that occurredroughly 13.8 billion years ago.

Current Affairs

Memorandum of Understandings (MoUs)

♦ India and Mauritius inked 8 Memorandum of Understandings (MoUs) to enhance strategic cooperation and economic collaboration between the two nations on 12 March 2025. ♦  These agreements covered areas such as currency settlement, water management, and shipping information sharing, further deepening bilateral ties. The MoUs are: ♦  Agreement between Reserve Bank of India and the Bank of Mauritius for the Establishment of a Framework to Promote the Use of Local Currencies (INR or MUR) for Cross-border Transactions. ♦  Credit facility agreement between Government of Republic of Mauritius (as borrower) and State Bank of India (as lending bank) ♦  Memorandum of Understanding between the ministry of Industry, SME and Cooperatives (SME division) of the Republic of Mauritius and the Ministry of Micro, Small and Medium Enterprises of the Republic of India on cooperation in the field of micro, small and medium enterprises. ♦  Memorandum Of Understanding Between the Sushma Swaraj Institute of Foreign Service, Ministry Of External Affairs, Republic Of India And Ministry Of Foreign Affairs, Regional Integration & International Trade, Republic Of Mauritius. ♦  MoU between Ministry of Public Service and Administrative Reforms (MPSAR), Government of Mauritius and National Centre for Good Governance (NCGG), Department of Administrative Reforms and Public Grievances, Government of India ♦  Technical Agreement on sharing of White Shipping Information between Indian Navy and Government of Mauritius. ♦  MoU between Indian National Centre for Ocean Information Services (INCOIS), Ministry of Earth Sciences, GoI and Prime Minister’s Office (PMO), Department of Continental Shelf, Maritime Zones Administration and Exploration (CSMZAE), GOM. ♦  Memorandum of Understanding between Directorate of Enforcement (ED) and Financial Crimes Commission of the Republic of Mauritius (FCC).

Current Affairs

Prime Minister’s Scheme for Mentoring Young Authors (PM-YUVA 3.0)

♦ The Ministry of Education launched the third edition of the Prime Minister’s Scheme for Mentoring Young Authors (PM-YUVA 3.0). ♦ The initiative aims to train young authors under the age of 30 to promote reading, writing, and book culture in India. ♦ The program provides mentorship and publishing opportunities to enhance Indian literature on a global platform. ♦ PM-YUVA 3.0 builds on the participation of young authors in 22 Indian languages and English in its previous editions. ♦ The scheme aligns with the government’s effort to encourage youth to engage with India’s heritage, culture, and contributions of key figures. ♦ It focuses on three themes: the role of the Indian diaspora in nation-building, the Indian Knowledge System, and makers of modern India from 1950 to 2025.

Current Affairs

అరుణ్‌ మమ్మేన్‌

వాహన టైర్ల తయారీదార్ల సంఘం (ఏటీఎంఏ) కొత్త ఛైర్మన్‌గా ఎంఆర్‌ఆఫ్‌ వైస్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ మమ్మేన్‌ 2025, మార్చి 12న ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో సియెట్‌ ఎండీ, సీఈఓ అర్నబ్‌ బెనర్జీ ఉన్నారు. కొత్త వైస్‌ ఛైర్మన్‌గా బ్రిడ్జ్‌స్టోన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టరు హిరోషి యోషిజేన్‌ ఎన్నికయ్యారు.  2017 నుంచి ఎంఆర్‌ఎఫ్‌ సంస్థకు వైస్‌ఛైర్మన్, ఎండీగా మమ్మేన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Current Affairs

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌

లండన్‌కు చెందిన క్వాక్వరెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) సంస్థ 2025, మార్చి 12న 15వ సబ్జెక్టు వారీ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలో అత్యుత్తమమైనవిగా గుర్తించిన 50 విశ్వవిద్యాలయాల జాబితాలో తొమ్మిది భారతీయ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు స్థానం దక్కింది. మినరల్, మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ధన్‌బాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ (ఐఎస్‌ఎం) ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. మన దేశ విద్యా సంస్థల్లో అగ్రస్థానం పొందింది.  ఇదే విభాగంలో ఐఐటీ బాంబే 28వ, ఐఐటీ ఖరగ్‌పూర్‌ 45వ స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. ఈ రెండు విద్యా సంస్థలు ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లోనూ తొలి 50 అగ్రశ్రేణి సంస్థల్లో చోటు దక్కించుకున్నాయి. 

Current Affairs

చమురు క్షేత్రాల సవరణ బిల్లు

దేశీయంగా చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తిని అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ‘ఆయిల్‌ ఫీల్డ్స్‌(రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) సవరణ బిల్లు-2024’కు పార్లమెంటు ఆమోదం లభించింది. 2025, మార్చి 12న ఈ బిల్లుకు లోక్‌సభ సమ్మతి తెలుపగా, రాజ్యసభ 2024, డిసెంబరు 3న ఆమోదం తెలిపింది. చమురు క్షేత్రాల అన్వేషణ, చమురు ఉత్పత్తిలో ఇప్పటిమాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సమప్రాధాన్యం కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ స్పష్టం చేశారు. 

Current Affairs

భారత్, మారిషస్‌ భాగస్వామ్యం

భారత్, మారిషస్‌ దేశాలు వాణిజ్యం, సముద్ర భద్రత లాంటి వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా 8 ఒప్పందాలను 2025, మార్చి 12న కుదుర్చుకున్నాయి. సరిహద్దు లావాదేవీల్లో స్థానిక కరెన్సీని ప్రొత్సహించడం, సముద్ర సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, నగదు అక్రమ చలామణిపై ఉమ్మడి పోరు, సూక్ష్మ - చిన్న - మధ్యతరహా పరిశ్రమల రంగానికి సహకారం పెంపు లాంటి అంశాలను తాజా ఒడంబడికల్లో ప్రస్తావించారు. భారత ప్రధాని మోదీ, మారిషస్‌ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులాంల సమక్షంలో సంబంధిత అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతకుముందు ఇద్దరు నేతలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దక్షిణార్థ గోళ దేశాలపై భారత నూతన దృక్కోణాన్ని మోదీ ప్రకటించారు. దానికి మహాసాగర్‌ (మ్యూచువల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఎక్రాస్‌ రీజియన్స్‌) అని పేరు పెట్టారు. 

Current Affairs

తేజస్‌ నుంచి ‘అస్త్ర’ పరీక్ష

దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్‌ యుద్ధవిమానం నుంచి 2025, మార్చి 12న గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఒడిశాలోని చాందీపుర్‌లో దీన్ని చేపట్టినట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ ప్రయోగ పరీక్ష సందర్భంగా గాల్లో ఎగురుతున్న లక్ష్యాన్ని క్షిపణి నేరుగా కూల్చేసిందని తెలిపింది. క్షిపణిలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసినట్లు పేర్కొంది.

Current Affairs

స్ఫియరెక్స్‌ టెలిస్కోప్‌ ప్రయోగం

గతంలో ఎన్నడూ లేనంత సమగ్రంగా, స్పష్టంగా మొత్తం ఖగోళ సమాచారాన్ని, చిత్రాలను మానవాళికి అందించేందుకు స్ఫియరెక్స్‌ టెలిస్కోప్‌ అబ్జర్వేటరీని నాసా అంతరిక్షంలోకి పంపింది. దీనితో పాటు మరో నాలుగు ఉపగ్రహాలనూ నాసా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాలు సూర్యుడి ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. స్ఫియరెక్స్‌ అబ్జర్వేటరీ ద్వారా సేకరించే ఖగోళ సమాచారం జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్, హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ల నిరంతర విశ్లేషణలకు సహాయకారిగా ఉండబోతోంది. స్పేస్‌ ఎక్స్‌గా ప్రసిద్ధమైన స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ టెక్నాలజీస్‌ సంస్థ కాలిఫోర్నియా నుంచి స్ఫియరెక్స్‌ టెలిస్కోప్‌ అబ్జర్వేటరీని ప్రయోగించింది. 

Current Affairs

అబిద్‌ అలీ కన్నుమూత

భారత క్రికెట్‌ జట్టుకు 29 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ 2025, మార్చి 12న మరణించారు. ఆయన వయసు 83 ఏళ్లు. అబిద్‌ 1967-74 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. పేస్‌ బౌలర్, లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన అబిద్‌.. మేటి ఫీల్డర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. 29 టెస్టుల్లో 49 వికెట్లు పడగొట్టి, 1018 పరుగులు సాధించారు.