Posts

Current Affairs

టాటా కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌

టాటా గ్రూప్‌ సంస్థ టాటా కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌గా ఎన్‌.గణపతి సుబ్రమణియమ్‌ 2025, మార్చి 14న నియమితులయ్యారు. ఆయన 2021, డిసెంబరు 2న టాటా కమ్యూనికేషన్స్‌ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా చేరారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), భారత ఐటీ పరిశ్రమకు ఆయన 40 ఏళ్లుగా సేవలు అందిస్తూ వచ్చారు. టీసీఎస్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన, 2024 మేలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.

Walkins

ఎన్‌ఆర్‌ఐయూఎంఎస్‌డీ-హైదరాబాద్‌లో పోస్టులు

నేషనల్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌ ఫర్‌ స్కిన్‌ డిస్‌ఆర్డర్స్‌ (ఎన్‌ఆర్‌ఐయూఎంఎస్‌డీ) హైదరాబాద్‌ కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: 1. ప్రొఫెసర్‌: 04 2. రీడర్‌: 02 3. లెక్చరర్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రి, పీజిలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు, రీడర్‌కు 50 ఏళ్లు, లెక్చరర్‌కు 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,25,000, రీడర్‌కు రూ.1,00,000, లెక్చరర్‌కు రూ.85,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: మార్చి 19, 20 వేదిక: నేషనల్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌ ఫర్‌ స్కిన్‌ డిసార్డర్స్‌, ఎర్రగడ్డ, హైదరాబాద్-500038. Website:https://ccrum.res.in/ViewData/Multiple?mid=1437

Walkins

నేషనల్ సెంటర్‌ ఫర్‌ సెల్ సైన్స్‌-పుణెలో పోస్టులు

పుణెలోని నేషనల్ సెంటర్‌ ఫర్‌ సెల్ సైన్స్‌ (ఎన్‌సీసీఎస్‌) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు: 1. ప్రాజెక్టు అసోసియేట్‌-2: 01 2. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 03 3. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, ఎంవీఎస్సీ, పీజీ, ఎల్ఎన్‌సీఆర్‌ఎన్‌ఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ఏప్రిల్ 2వ తేదీ నాటికి జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 28 ఏళ్లు, సీనియర్ రీసెర్చ్‌ ఫెలోకు 32 ఏళ్లు, ప్రాజెక్టు అసోసియేట్‌కు 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.35,000, సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 42,000, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోకు రూ.37,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2 వేదిక: నేషనల్ సెంటర్‌ ఫర్‌ సెల్ సైన్స్, ఎన్‌సీసీఎస్‌ కాంప్లెక్స్‌, సావిత్రిబాయి పూలే పుణె యూనివర్సిటీ క్యాంపస్, గణెష్‌కింది రోడ్ పుణె-411007, మాహారాష్ట్ర Website:https://nccs.res.in/Career

Government Jobs

మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

మౌలానా ఆజాద్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఏఎన్‌ఐటీ) కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 22 వివరాలు: 1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-గ్రేడ్-2: 10 2. అసిస్టెంట్ ప్రొఫెసర్‌-గ్రేడ్-1: 12 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌-గ్రేడ్‌-2కు రూ.70,900, అసిస్టెంట్ ప్రొఫెసర్‌-గ్రేడ్-1కు రూ.1,01,500. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16 ఏప్రిల్ 2025 Website:https://www.manit.ac.in/content/faculty-recruitment-2025

Walkins

Posts In NRIUMSD-Hyderabad

National Research Institute of Unani Medicine for Skin Disorders (NRIUMSD) Hyderabad is conducting interviews to fill the following posts. Number of Posts: 08 Details: 1. Professor: 04 2. Reader: 02 3. Lecturer: 02 Qualification: Degree, PG in the relevant discipline as per the post and work experience. Age limit: Not more than 55 years for Professor, 50 years for Reader, 40 years for Lecturer. Salary: per month Rs. 1,25,000 for Professor, Rs. 1,00,000 for Reader, Rs. 85,000 for Lecturer. Selection process: Based on interview. Interview date: March 19, 20 Venue: National Research Institute of Unani Medicine for Skin Disorders, Erragadda, Hyderabad-500038. Website:https://ccrum.res.in/ViewData/Multiple?mid=1437

Walkins

Posts In National Centre for Cell Science-Pune

National Centre for Cell Science (NCCS) in Pune is conducting interviews to fill the following posts.  Number of Posts: 07 Details: 1. Project Associate-2: 01 2. Senior Research Fellow: 03 3. Junior Research Fellow: 03 Qualification: Master's degree, MVSc, PG, LNCRNA in the relevant discipline as per the post and work experience. Age Limit: Junior Research Fellow should not exceed 28 years, Senior Research Fellow should not exceed 32 years and Project Associate should not exceed 35 years as on April 2nd. Selection Process: Based on Interview. Interview Date: April 2 Venue: National Centre for Cell Science, NCCS Complex, Savitribai Phule Pune University Campus, Ganeshkindi Road Pune-411007, Maharashtra Website:https://nccs.res.in/Career

Government Jobs

Faculty Posts In Maulana Azad National Institute

Maulana Azad National Institute of Technology (MANIT) is inviting applications for the following faculty posts. Number of Posts: 22 Details: 1. Assistant Professor-Grade-2 2. Assistant Professor-Grade-1 Qualification: Candidates should have passed BE, BTech, ME, MTech, Degree, PG in the relevant discipline as per the post along with work experience. Salary: Rs. 70,900 per month for Assistant Professor-Grade-2, Rs. 1,01,500 for Assistant Professor-Grade-1. Application Fee: Rs. 1500 for General, OBC, EWS candidates. There is a fee exemption for SC and ST candidates. Selection Process: Based on Interview. Last Date of Online Application: 16 April 2025 Website:https://www.manit.ac.in/content/faculty-recruitment-2025

Current Affairs

మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక

వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న విపణి కావడం, ప్రపంచ తయారీ రంగంలో వాటా పెంచుకోవడం ఇందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా అయిదో స్థానంలో ఉన్న భారత్‌ 2026లో అమెరికా, చైనా, జర్మనీ తరవాత స్థానానికి; ఆ తదుపరి రెండేళ్లలో జర్మనీని అధిగమించి మూడో స్థానానికి ఎదుగుతుందని వివరించింది.  ఈ నివేదికలోని అంశాలు: ప్రపంచ జీడీపీలో భారత వాటా ప్రస్తుత 3.5% నుంచి 2029లో 4.5 శాతానికి చేరే అవకాశం ఉంది.  ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా భారత్‌ 1990లో 12వ స్థానంలో ఉంది. 2000లో 13వ స్థానానికి దిగివచ్చింది. ఆ తర్వాత 2020లో 9వ స్థానానికి, 2023లో 5వ స్థానానికి ఎగబాకింది.  2024-25లో వృద్ధి 6.3 శాతంగా, 2025-26లో 6.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. 

Current Affairs

విజయవంతంగా స్పేడెక్స్‌ అన్‌డాకింగ్‌

అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్, అన్‌డాకింగ్‌ సాంకేతికతలను మదింపు చేయడానికి ఇస్రో ప్రయోగించిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) విజయవంతమైంది. 2025, జనవరి 16న ఛేజర్‌ (ఎస్‌డీఎక్స్‌-01) టార్గెట్‌ (ఎస్‌డీఎక్స్‌02)లను డాకింగ్‌ (అనుసంధానం) చేసిన ఇస్రో, 56 రోజుల తర్వాత వాటిని అన్‌డాకింగ్‌ (విడిపోవడం) చేయగలిగింది. 2024, డిసెంబరు 30న ఇస్రో స్పేడెక్స్‌ మిషన్‌ను చేపట్టింది.  భారత కాలమానం ప్రకారం 2025, మార్చి 13న ఉదయం 9:20 గంటలకు 460 కి.మీ. వృత్తాకార కక్ష్యలో 45 డిగ్రీల వంపులో అన్‌డాకింగ్‌ ప్రక్రియను ఒకే ప్రయత్నంలో ముగించినట్లు ఇస్రో తన ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం రెండు ఉపగ్రహాలూ మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపింది. రానున్న చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌ వంటి కీలక ప్రాజెక్టుల్లో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. 

Current Affairs

మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

రాష్ట్రంలోని యువతకు కృత్రిమ మేధ(ఏఐ)లో శిక్షణను ఇప్పించి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వం 2025, మార్చి 13న కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర సచివాలయంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వృత్తి విద్య, మాధ్యమిక పాఠశాలల విద్యార్థులు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి, పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది.