గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 2025 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గాంధీనగర్, దిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్, పుణె, గువాహటి, మణిపూర్, ధార్వాడ్‌లలో ఎన్‌జీఎస్‌యూ క్యాంపస్ ఉన్నాయి. ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎల్‌ఎల్‌ఎం, బీటెక్- ఎంటెక్, బీబీఏ-ఎంబీఏ, బీఎస్సీ- ఎల్‌ఎల్‌బీ ఆనర్స్, బీబీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు పొందవచ్చు.
వివరాలు:
1. ఎంఎస్సీ
విభాగాలు: ఫోరెన్సిక్ సైన్స్/ ఫోరెన్సిక్ బయోటెక్నాలజీ/ టాక్సికాలజీ/ సైబర్ సెక్యూరిటీ/ డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ/ నానోటెక్నాలజీ/ ఫుడ్ టెక్నాలజీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ/ న్యూరో సైకాలజీ/ క్లినికల్ సైకాలజీ/ ఫోరెన్సిక్ సైకాలజీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ.
2. ఎంఏ
విభాగాలు: మాస్ కమ్యూనికేషన్ అండ్ ఫోరెన్సిక్ జర్నలిజం/ పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్/ క్రిమినాలజీ.
3. బీఎస్సీ- ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్
4. పీజీ డిప్లొమా
విభాగాలు: ఫింగర్‌ప్రింట్ సైన్స్/ ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్/ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్/ డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్/ ఫోరెన్సిక్ జర్నలిజం/ ఫోరెన్సిక్ బాలిస్టిక్స్/ కెనైన్ ఫోరెన్సిక్స్/ ఫోరెన్సిక్ ఆర్కియాలజీ, హ్యుమానిటేరియన్ ఫోరెన్సిక్స్/ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్/ సెమీకండక్టర్ సెక్యూరిటీ/ సెక్యూరిటీ స్టడీస్/ సైబర్ క్రైమ్ ఇన్‌వెస్టిగేషన్/ సైబర్ సైకాలజీ/ ఇన్‌వెస్టిగేటివ్ సైకాలజీ/ సైబర్ లా/ డ్రగ్ అండ్ సబ్‌స్టాన్స్ అబ్యూస్ లాస్/ ఇండస్ట్రియల్ సేఫ్టీ, హైజీన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్.
5. ఎంటెక్
విభాగాలు: సైబర్ సెక్యూరిటీ/ ఏఐ అండ్ డీఎస్/ సివిల్ ఇంజినీరింగ్.
6. బీటెక్- ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
7. ఎంబీఏ
విభాగాలు: ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్/ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్/ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్/ బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్
8. బీబీఏ- ఎంబీఏ
విభాగాలు: ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్.
9. ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ
10. బీఏ- ఎంఏ క్రిమినాలజీ
11. డిప్లొమా (కెనిన్ ఫోరెన్సిక్స్/ ఫోరెన్సిక్ ఆర్కియాలజీ)
12. ఎల్‌ఎల్‌ఎం
విభాగాలు: సైబర్ లా అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్/ క్రిమినల్ లా అండ్ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్.
13. బీఎస్సీ- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
14. ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
15. బీబీఏ- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
16. ఎంఫార్మసీ (ఫోరెన్సిక్ ఫార్మసీ/ ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అస్యూరెన్స్)
17. ఎంఏ - పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
క్యాంపస్: గాంధీనగర్, దిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్, పుణె, గువాహటి, మణిపూర్, ధార్వాడ్, భువనేశ్వర్, చెన్నై, రాయ్‌పుర్, జయపుర.
అర్హత: ప్రోగ్రాంను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: వర్సిటీ నిర్వహించే నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్ (ఎన్‌ఎఫ్‌ఏటీ)-2025 తదితరాల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-05-2025.
Website:https://nfsu.ac.in/admission