Posts

Current Affairs

సుదూర పాలపుంతలో ఆక్సిజన్

విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడిన ఒక పాలపుంతలో ఆక్సిజన్, భార మూలకాలు ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమికి 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనికి జేడ్స్‌-జీఎస్‌-జడ్‌14-0 అని పేరుపెట్టారు. విశ్వం పుట్టిన మొదట్లో కాకుండా చాలా ముందుగానే పాలపుంతలు ఏర్పడినట్లు ఈ ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 700 సుదూర పాలపుంతల్ని సర్వే చేయగా వాటిలో మూడో అతిపెద్దది ఇదేనని తేలింది. 

Current Affairs

త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు

రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) రూ.54,000 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు 2025, మార్చి 1న ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇందులో టి-90 ట్యాంకుల ఆధునికీకరణతో పాటు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థల కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలూ ఉన్నాయి.  మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్‌ టోవ్డ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌ (అటాగ్స్‌) అనే శతఘ్నులను సైన్యంలో తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.7,000 కోట్ల విలువైన భారీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 307 శతఘ్నులను సైన్యం కోసం కేంద్రం కొనుగోలు చేయనుంది. దీంతో పాటు 327 గన్‌ టోయింగ్‌ వాహనాలకూ ఆర్డర్‌ ఇవ్వనుంది. అటాగ్స్‌.. దేశీయంగా అభివృద్ధి చేసిన 150 ఎం.ఎం.శతఘ్ని వ్యవస్థ. ఇందులో 52 క్యాలిబర్‌ బ్యారెల్‌ ఉంటుంది. 45 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇందులో 65 శాతం దేశీయంగా తయారుచేసిన పరికరాలనే వినియోగించనున్నారు. ఈ అటాగ్స్‌లను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించే అవకాశం ఉంది.

Current Affairs

ఐఓసీ అధ్యక్షురాలిగా క్రిస్టీ

అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) ప్రెసిడెంట్‌గా క్రిస్టీ కోవెంట్రీ (41 ఏళ్లు) ఎన్నికైంది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికా వ్యక్తిగా ఆమె నిలిచింది. ఈ పదవికి  ఏడుగురు అభ్యర్థులు పోటీ పడగా, 97 మంది సభ్యులు ఓట్లు వేశారు. 49 ఓట్లతో క్రిస్టీ తొలి రౌండ్లోనే విజయం సాధించింది. ఆమె 2033 వరకు పదవీలో కొనసాగుతుంది.  రెండుసార్లు ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ స్వర్ణం గెలిచిన క్రిస్టీ.. ప్రస్తుతం జింబాబ్వే క్రీడల మంత్రి. 

Current Affairs

వయో వృద్ధుల కమిషన్‌ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం

కేరళ ప్రభుత్వం 2025, మార్చి 20న సినియర్‌ సిటిజన్ల కోసం ఒక కమిషన్‌ నియామకానికి చట్టం రూపొందించింది. ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. వయో వృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలకై ఈ కమిషన్‌ పనిచేస్తుందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. 

Current Affairs

ఆనందమయ దేశాల జాబితా 2025

అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని వెల్‌బీయింగ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆనందమయ దేశాల జాబితా (వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌) 2025ను మార్చి 20న విడుదల చేసింది. ఫిన్లాండ్‌ వరుసగా 8వ సారి ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. 2024లో 126వ స్థానంలో ఉన్న భారత్‌ ఎనిమిది స్థానాలు ఎగబాకి ప్రస్తుతం 118వ ర్యాంకు సాధించింది.  నేపాల్‌ (92), చైనా (68), పాకిస్థాన్‌ (109) దేశాలు ఈ విషయంలో మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. శ్రీలంక (133), బంగ్లాదేశ్‌ (134) వెనుకబడి ఉన్నాయి.  అఫ్గానిస్థాన్‌ మరోసారి జాబితాలో ఆఖరి (147) స్థానంలో నిలిచింది. 

Current Affairs

సీఐఐ ఏపీ ఛైర్మన్‌గా గన్నమనేని మురళీకృష్ణ

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏపీ ఛైర్మన్‌గా గన్నమనేని మురళీకృష్ణ నియమితులయ్యారు. 2025, మార్చి 20న విశాఖలో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మురళీకృష్ణ ప్రస్తుతం ఫ్లూయెంట్‌గ్రిడ్‌ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవోగా ఉన్నారు. సీఐఐ ఏపీ పూర్వ ఛైర్మన్, మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఎండీ డా.వి.మురళీ కృష్ణ నుంచి ఇదే రోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు.  అలాగే వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.నరేంద్ర కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అపెక్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ ఏడాదిపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. 

Walkins

టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో పోస్టులు

ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 02 వివరాలు: 1. ప్రాజెక్టు మేనేజర్‌(బిజినెస్‌ డెవపలప్‌మెంట్‌): 01 2. టెక్నికల్ ఆఫీసర్‌-1: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: ప్రాజెక్టు మేనేజర్‌కు 35 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు. జీతం: నెలకు టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.60,000, ప్రాజెక్టు మేనేజర్‌కు రూ.80,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7, 8 వేదిక: టీహెచ్‌ఎస్‌టీఐ, ఎన్‌సీఆర్‌ బయోటెక్‌ సైన్స్ క్లస్టర్‌, 3వ మైల్ స్టోన్‌, ఫరీదాబాద్, గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఫరీదాబాద్-121001. Website:https://thsti.res.in/en/Jobs

Government Jobs

ఎన్‌సీఈఎస్‌ఎస్-కేరళలో సైంటిస్ట్‌ పోస్టులు

కేరళలోని నేషనల్ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ (ఎన్‌సీఈఎస్‌ఎస్) తిరువనంతపురం సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   వివరాలు: సైంటిస్ట్‌-బి(1, 2): 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, బీటెక్‌( సివిల్ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: సైంటిస్ట్‌ బీ1 పోస్టుకు 35 ఏళ్లు, సైంటిస్ట్‌ బీ2 పోస్టుకు 38 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 7 ఏప్రిల్ 2025. Website:https://www.ncess.gov.in/notifications/vacancies.html

Government Jobs

ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో పోస్టులు

ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్ (ఐఆర్‌ఈఎల్‌), ముంబయి వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 30 వివరాలు: 1. జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 2. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 3. చీఫ్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 4. సీనియర్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 5. అసిస్టెంట్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 02 6. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం): 01 7. చీఫ్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం): 01 8. అసిస్టెంట్ మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం): 02 9. అసిస్టెంట్ మేనేజర్‌(రాజ్‌భాష): 02 10. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(బిజినెస్‌ డెవలప్‌మెంట్ ): 01 11. డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్): 02  12. చీఫ్‌ మేనేజర్‌(సివిల్): 01 13. మేనేజర్‌(సివిల్): 03 14. డిప్యూటీ మేనేజర్‌(సివిల్): 01 15. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(టెక్నికల్): 01 16. డిప్యూటీ జనరల్ మేనేజర్‌(కమర్షియల్): 01 17. డిప్యూటీ జనరల్ మేనేజర్‌( ప్రాజెక్ట్స్‌): 01 18. చీఫ్‌ మేనేజర్‌(ప్రాజెక్ట్స్‌): 01 19. చీఫ్‌ మేనేజర్‌(కమర్షియల్‌): 01 20. మేనేజర్‌(ఎలక్ట్రికల్): 03 21. మేనేజర్‌(మెకానికల్): 01 22. డిప్యూటీ మేనేజర్‌(మినరల్): 01 విభాగాలు: ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ఎం, రాజ్‌భాష, బిజినెస్‌ డెవలప్‌మెంట్ & మార్కెటింగ్, సివిల్, టెక్నికల్, అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, సీఎంఏ, ఎంబీఏ, బీకాం, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: జనరల్ మేనేజర్‌కు 50 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 46 ఏళ్లు, చీఫ్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 38 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.2,60,000, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, చీఫ్‌ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ 500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-04-2025. Website:https://irel.co.in/careers

Government Jobs

హాల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 09 వివరాలు: టెక్నీషియన్‌ (మెకానికల్‌): 06 సివిల్‌: 01 అకౌంట్స్‌: 01 స్టోర్స్‌ క్లరికల్‌/ కమర్షియల్‌ అసిస్టెంట్‌/ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీకాం, బీఏ, బీఎస్సీ/బీబీఏ/బీసీఏ/ బీఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.    వయోపరిమితి: 01.03.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, హెలీక్యాప్టర్‌ డివిజన్‌, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు చిరునామాకు స్పీడ్‌ పోస్ట్‌/ రిజిస్టర్‌/ కొరియర్‌ ద్వారా పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 05.04.2025. Website:https://hal-india.co.in/home