Posts

Current Affairs

నీతిఆయోగ్‌ సభ్యుడిగా రాజీవ్‌ గాబా

కేంద్ర క్యాబినెట్‌ మాజీ కార్యదర్శి రాజీవ్‌ గాబా 2025, మార్చి 25న నీతిఆయోగ్‌ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ఈయన ఝార్ఖండ్‌ కేడర్‌కు చెందిన 1982-బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. రాజీవ్‌ గాబా కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శిగా 2019 నుంచి అయిదేళ్ల పాటు పనిచేశారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగానూ ఉన్నారు. 

Walkins

ఐఐఎస్‌డబ్ల్యూసీ-ఉత్తరాఖండ్‌లో పోస్టులు

ఉత్తరాఖండ్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోయిల్ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ (ఐఐఎస్‌డబ్ల్యూసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. యంగ్‌ ప్రొఫెషనల్-2: 09 2. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీటెక్‌, ఎంఈలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టుకు 21-45 ఏళ్లు, జూనియర్ రీసెర్చ్‌ ఫెలో పోస్టుకు 35 ఏళ్లలోపు ఉండాలి. జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టుకు రూ.42,000, జూనియర్ రీసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.37,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 02 Website:http://www.cswcrtiweb.org/index1.html?Recruitment/recruit_2020_21.htm

Government Jobs

నేషనల్‌ లా యూనివర్సిటీ నాగ్‌పుర్‌లో పోస్టులు

నాగ్‌పుర్‌లోని నేషనల్ లా యూనిర్సిటీ (ఎన్‌ఎల్‌యూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు: 1. డిప్యూటీ లైబ్రేరియన్‌: 01 2. డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌: 01 3. డిప్యూటీ రిజిస్ట్రార్‌: 02 4. ఇంజినీర్‌ కమ్‌ ఎస్టేట్ ఆఫీసర్‌: 01 5. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌: 02 6. ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌: 01 7. ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కమ్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌: 01 8. జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 05 9. లైబ్రరీ రీస్టోరర్‌: 02 10. జూనియర్‌ గార్డేనర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, బీటెక్‌(సివిల్‌), ఎంబీఏ, ఎల్ఎల్‌ఎం, డిగ్రీ, ఎనిమిదో తరగతి ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 - 38 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు డిప్యూటీ లైబ్రేరియన్‌కు రూ. 2,00,000, డిప్యూటీ రిజిస్ట్రార్‌, కంట్రోలర్‌ ఆఫ్ ఎగ్జామినేషన్‌కు రూ.1,20,000, యూనివర్సిటీ ఇంజినీర్‌ కమ్‌ ఎస్టేట్ ఆఫీసర్‌కు రూ.1,18,000, ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు రూ.85,000, ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కమ్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌కు రూ.85,650, లైబ్రరీ రీస్టోరర్‌, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌కు రూ.30,000, జూనియర్‌ గార్డెనర్‌కు రూ.23,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2025 Website:https://nlunagpur.ac.in/19032025.php

Government Jobs

ఎన్‌సీఆర్‌టీసీలో ఇంజినీర్‌ పోస్టులు

నేషనల్ క్యాపిటల్‌ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఆర్‌టీసీ) ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 72 వివరాలు: 1. జూనియర్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్): 16 2. జూనియర్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రానిక్స్‌): 16 3. జూనియర్ ఇంజినీర్‌(మెకానికల్): 03 4. జూనియర్‌ ఇంజినీర్‌(సివిల్‌): 01 5. ప్రోగ్రామింగ్‌ అసోసియేట్‌: 04 6. అసిస్టెంట్‌(హెచ్‌ఆర్‌): 03 7. అసిస్టెంట్‌ (కార్పొరేట్‌ హాస్పిటాలిటీ): 01 8. జూనియర్‌ మెయింటెయినర్(ఎలక్ట్రికల్): 18 9. జూనియర్‌ మెయింటెయినర్‌(మెకానికల్): 10 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా,(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, మెకానికల్, ఐటీ, కంప్యూటర్స్‌) బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీబీఎం, డిగ్రీ(హోటల్‌ మేనేజ్‌మెంట్‌), ఐటీఐలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 25 ఏళ్లు. జీతం: నెలకు జూనియర్‌ ఇంజినీర్‌, ప్రోగ్రామింగ్‌ అసోసియేట్‌కు రూ.22,800 - రూ.75,850, అసిస్టెంట్‌కు రూ.20,250 - రూ.65,500, జూనియర్ మెయింటెయినర్‌కు రూ. 18,250 - రూ.59,200. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 24. పరీక్ష తేదీ: మే 2025.  Website:https://ncrtc.in/elementor-39298/

Government Jobs

హెచ్‌పీసీఎల్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు

ముంబయిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 63 వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ - మెకానికల్: 11  జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఎలక్ట్రికల్: 17  జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఇన్‌స్ట్రుమెంటేషన్: 6 జూనియర్ ఎగ్జిక్యూటివ్ - కెమికల్: 1 జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఫైర్ & సేఫ్టీ: 28 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా ఫైర్ & సేఫ్టీ) 3 ఏళ్ల డిప్లొమా కలిగి ఉండాలి.  వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ ఎన్‌సీ వారికి 3 ఏళ్లు; పీడబ్ల్యూబీడీ వారికి 15 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000. దరఖాస్తు ఫీజు: రూ.1180; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు పీజు లేదు. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్/టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.04.2025. Website:https://hindustanpetroleum.com/

Government Jobs

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యర్డ్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన  సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (మెకానికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 23 (యూఆర్‌-12; ఓబీసీ-5; ఎస్సీ-3; ఎస్టీ-1; ఈడబ్ల్యూఎస్‌-2) వివరాలు: అర్హత: 60% మార్కులతో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగాభవం ఉండాలి. జీతం: నెలకు రూ.37,000. వయోపరిమితి: మార్చి 3 నాటికి 30 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానం: పావర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫిజు లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-04-2025.  Website:https://cochinshipyard.in/

Apprenticeship

పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 158 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ,లో ఉత్తీర్ణులై ఉండాలి.   వయోపరిమితి: మార్చి 30వ తేదీ నాటికి 20 - 28 ఏళ్లలోపు ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.9,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-03-2025. Website:https://punjabandsindbank.co.in/content/recuitment

Apprenticeship

ఐఆర్‌సీటీసీ సౌత్‌జోన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఐఆర్‌సీటీసీ సౌత్‌జోన్‌ కింది ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 25 వివరాలు: 1. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌- 05 2. ఎగ్జిక్యూటివ్‌ ప్రొక్యూర్‌మెంట్‌- 10 3. హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ ఎంప్లాయ్‌ డేటా మేనేజర్‌- 02 4. ఎగ్జిక్యూటివ్- హెచ్‌ఆర్‌- 01 5. సీఎస్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌- 01 6. మార్కెటింగ్‌ అసోసియేట్‌ ట్రైనింగ్‌- 04 7. ఐటీ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌- 02 అర్హత: 50 శాతం మార్కులతో మెట్రిక్యూలేషన్‌, ఐటీఐ, సీఏ, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. జీతం: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.8,000; అప్రెంటిస్‌ లేదా డిగ్రీ అభ్యర్థులకు నెలకు 9,000. వయోపరిమితి: 15 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. పని ప్రదేశం: తమిళనాడు, కేరళ, కర్ణాటక. దరఖాస్తు విధానం: అప్రెంటిషిప్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ: 07.04.2025. Website:https://www.irctc.com/new-openings.html Apply online:https://www.apprenticeshipindia.gov.in/

Admissions

ఐపీఈ, హైదరాబాదులో పీజీడీఎం ప్రోగ్రామ్‌

హైదరాబాదులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ 2025-27 విద్యాసంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పీజీడీఎం- పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌  పీజీడీఎం- మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌ పీజీడీఎం- బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పీజీడీఎం- ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ పీజీడీఎం- హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ పీజీడీఎం- బిజినెస్‌ అనాలసిస్‌ అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌/ గ్జాట్‌/ జీమ్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌/ ఏటీఎంఏ టెస్ట్‌ స్కోరు సాధించి ఉండాలి. ఎంపిక విధానం: ఏదైనా నేషనల్‌ ఎగ్జామినేషన్‌ వ్యాలిడ్‌ స్కోర్‌తో పాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31-03-2025. ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ/ ప్రదేశం: 12.04.2025, శామీర్‌పేట్‌.  Website:https://www.ipeindia.org/ Apply online:https://admissions.ipeindia.org/

Admissions

ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2025

ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లా కోర్స్‌ ఎల్‌ఎల్‌ఎం- (ఏపీ పీజీఎల్‌సెట్)-2025 నోటిఫికేఫన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలల్లో 5, 3, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.  వివరాలు:   ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)/ ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్‌ లాసెట్‌ (పీజీఎల్‌సెట్)-2025  కోర్సులు: మూడేళ్లు/ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌. అర్హత: కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్‌, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు: ఎల్‌ఎల్‌బీ కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.900. బీసీలకు 850. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు రూ.800. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.1000. బీసీలకు రూ.950. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.900. పరీక్ష విధానం: అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ కోర్సులకు పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగు రెండు మాధ్యమాల్లో; ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరించు తేదీలు: 25-03-2025 నుంచి 27-04-2025 వరకు. రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: 28-04-2025 నుంచి 04-05-2025 వరకు. రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: 05-05-2025 నుంచి 11-05-2025 వరకు. రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మే 12 నుంచి 18వ తేదీ వరకు. రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మే 19 నుంచి 25 వరకు. దరఖాస్తుల సవరణ తేదీలు: మే 26 నుంచి 27 వరకు. హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 30-05-2025. ప్రవేశ పరీక్ష తేది: 05-06-2025. ప్రాథమిక కీ విడుదల: 06-06-2025. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: జూన్‌ 07 నుంచి 08 వరకు. తుది కీ: 16.06.2025. ఫలితాలు విడుదల: 22.06.2025. Website:https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx Apply online:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx