Posts

Current Affairs

Waqf (Amendment) Bill - 2025

♦ President Droupadi Murmu gave her assent to the Waqf (Amendment) Bill, 2025 on April 6, which was passed by Parliament earlier. ♦ She also gave her assent to the Mussalman Wakf (Repeal) Bill, 2025. The Legislation was passed in the Lok Sabha on Thursday, with 288 members supporting it and 232 against it. ♦ While the Rajya Sabha passed the Bill on Friday with 128 members voting in favour and 95 opposing it. ♦ The Central government through this new law aims to introduce significant reforms in enhancing the governance, transparency, and efficiency of waqf property management in the country. ♦ Key changes include redefining the formation of waqf, improving the survey and registration process, empowering government oversight, ensuring inclusivity by incorporating non-Muslim members and women into waqf-related bodies. ♦ These provisions mark a crucial step toward modernizing Waqf property management in the country.

Current Affairs

Narendra Modi met Sri Lankan President Anura Kumara Dissanayake

♦ Prime Minister Narendra Modi met Sri Lankan President Anura Kumara Dissanayake at the Presidential Secretariat in Colombo on 5 April 2025. ♦ The two leaders discussed various bilateral issues, including regional stability, energy cooperation, and developmental partnerships. ♦ A Memorandum of Understanding (MoU) on defence cooperation between India and Sri Lanka was signed during Modi's visit, and it will remain in force for five years. ♦ Prime Minister Narendra Modi, along with Sri Lankan President Anura Kumara Dissanayake, jointly inaugurated and flagged off key India-backed railway projects in Anuradhapura, marking a significant milestone in the growing bilateral infrastructure cooperation between the two nations. ♦ As a gesture of goodwill, President Dissanayake conferred upon him the Sri Lanka Mitra Vibhushan, one of Sri Lanka’s highest civilian honours, symbolizing the enduring friendship between the two countries. 

Current Affairs

మయన్మార్‌కు 442 టన్నుల ఆహారం అందజేత

మయన్మార్‌కు భారత్‌ 2025, ఏప్రిల్‌ 5న 442 మెట్రిక్‌ టన్నుల ఆహారాన్ని అందించింది. భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌లో ఆపరేషన్‌ బ్రహ్మా పేరుతో భారత్‌ సహాయక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌ 442 మెట్రిక్‌ టన్నుల ఆహారాన్ని తిలావా ఓడరేవుకు చేర్చి, ఆ దేశ ప్రతినిధి బృందానికి అప్పగించింది. 405 టన్నుల బియ్యం, 30 టన్నుల వంట నూనె, 5 మెట్రిక్‌ టన్నుల బిస్కెట్లు, 2 టన్నుల నూడుల్స్‌ను అందజేసినట్లు పేర్కొంది.

Current Affairs

భూ వాతావరణంలోకి పీవోఈఎం-4

పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటాల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌ (పీవోఈఎం-4) విజయవంతంగా భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, హిందూ మహాసముద్రంలో పడినట్లు 2025, ఏప్రిల్‌ 5న ఇస్రో ప్రకటించింది. 2024, డిసెంబరు 30న ఇస్రో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి60ని ప్రయోగించి, స్పేడెక్స్‌ ఉపగ్రహాలను 475 కిలోమీటర్ల నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. రాకెట్‌లోని నాలుగో దశ భాగమైన పీవోఈఎం-4 కూడా ముందుగా అనుకున్న ప్రకారం అదే కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉండిపోయింది. ఇందులో శాస్త్రవేత్తలు అమర్చిన 24 పేలోడ్‌లు నిర్దేశిత ప్రయోగాలను నిర్వహించి కీలక డేటాను సేకరించాయి. తదనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు పీవోఈఎం-4 ఇంజిన్‌లను పలుసార్లు మండించి 55.2 డిగ్రీల ఒంపుతో 350 కి.మీ. కక్ష్యకు తెచ్చారు. అనంతరం ఎలాంటి ప్రమాదమూ తలెత్తకుండా మిగులు ఇంధనాన్ని బయటకు పంపేశారు. అలా ఆ భాగం దిగువ కక్ష్యల్లోకి మారుతూ ముందుగా అంచనా వేసినట్టుగానే భూ వాతావరణంలోకి ప్రవేశించింది. 

Current Affairs

వక్ఫ్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025కు, ముసల్మాన్‌ వక్ఫ్‌ (ఉపసంహరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, ఏప్రిల్‌ 5న ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలు ఇటీవల విడివిడిగా సమ్మతి తెలిపాయి. వక్ఫ్‌ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ‘యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఉమీద్‌-యుఎంఈఈడీ) బిల్లు’గా వ్యవహరిస్తోంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఉమీద్‌ చట్టంగా మారింది. 

Current Affairs

50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌

ప్రపంచంలోని దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్‌ 50 వసంతాలను పూర్తి చేసుకుంది. విండోస్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ల ద్వారా వ్యక్తిగత కంప్యూటర్ల (పీఎస్‌) విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఈ సంస్థను 1975, ఏప్రిల్‌ 4న బిల్‌గేట్స్, పాల్‌ అలెన్‌ స్థాపించారు. ఆల్టెయిర్‌ 8800 కంప్యూటర్‌కు సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలన్న వీరిద్దరి ఆలోచనతో ఈ సంస్థ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎంఎస్‌-డాస్‌ను తీసుకొని రావడం ద్వారా పీఎస్‌ల ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విభాగాన్ని శాసించే స్థాయికి మైక్రోసాఫ్ట్‌ ఎదిగింది. 1980 నుంచి 2021 మధ్య ఎంఎస్‌-డాస్‌లో 9 ప్రధాన వెర్షన్‌లను, విండోస్‌లో 15 వెర్షన్‌లను మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది. 1986లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఈ కంపెనీ.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్లలోనూ ఒకటిగా ఉంది.

Current Affairs

కుమార దిసనాయకేతో మోదీ భేటీ

భారత ప్రధాని నరేంద్రమోదీ 2025, ఏప్రిల్‌ 5న శ్రీలంక అధ్యక్షుడు కుమార దిసనాయకేతో కొలంబోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకునే వ్యవస్థను రూపొందించడానికి తొలిసారిగా భారత్‌-శ్రీలంక ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. యూఏఈతో కలిసి ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, పవర్‌గ్రిడ్‌ ద్వారా అనుసంధానత వంటివి దీనిలో ఉన్నాయి. రుణాల పునర్వ్యవస్థీకరణకూ భారత్‌ ఆమోదం తెలిపింది. బ్యాంకాక్‌లో బిమ్‌స్టెక్‌ సదస్సులో పాల్గొన్న మోదీ నేరుగా శ్రీలంకకు చేరుకున్నారు. కొలంబోలోని చారిత్రక ఇండిపెండెన్స్‌ స్క్వేర్‌ వద్ద కుమార దిసనాయకే ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడ ఓ విదేశీ ప్రభుత్వాధినేతకు స్వాగతం లభించడం ఇదే ప్రథమం. 

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ అమ్మాయి సిఫ్ట్‌కౌర్‌ సమ్రా స్వర్ణం నెగ్గింది. 2025, ఏప్రిల్‌ 5న బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ ఫైనల్లో సిఫ్ట్‌ 458.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అనిత మాంగోల్డ్‌ (455.3- జర్మనీ) రెండు, అరినా అల్తుఖోవా (445.9- కజకిస్తాన్‌) మూడో స్థానాల్లో ఉన్నారు. ఇదే పోటీల్లో హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌ రజతం నెగ్గింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగం ఫైనల్లో ఇషా 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా షూటర్‌ యూజీ న్‌ (38) స్వర్ణం నెగ్గగా, ఫెంగ్‌ (చైనా, 30) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 

Walkins

రైట్స్‌ లిమిటెడ్‌లో రెసిడెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) ఒప్పంద ప్రాతిపదికన రెసిడెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టులు: 21 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 21-04-2025 తేదీ నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి.  జీతం: నెలకు డిప్లొమా అర్హత గల వారికి రూ.16,828, డిగ్రీ అర్హత గల వారికి రూ.22,660. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 28.04.2025 నుంచి 02.05.2025 వరకు Website: https://rites.com/Career

Government Jobs

రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ) ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 13 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మే 9వ తేదీ నాటికి 23 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. స్టైపెండ్‌: నెలకు రూ.31,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-05-2025. Website: https://www.rri.res.in/careers/other-openings