Posts

Current Affairs

సూక్ష్మసేద్యంలో ఏపీకి అగ్రస్థానం

ఆంధ్రప్రదేశ్‌ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో బిందు, తుంపర్ల సేద్యం అమలు చేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ (1.16 లక్షల హెక్టార్లు), ఉత్తర్‌ ప్రదేశ్‌ (1.02 లక్షల హెక్టార్లు), కర్ణాటక (97,400 హెక్టార్లు), తమిళనాడు (90,800 హెక్టార్లు) ఉన్నాయి.  దేశంలో సూక్ష్మ సేద్యం పరికరాలు అత్యధికంగా ఉన్న తొలి పది జిల్లాల్లో అనంతపురం, వైఎస్సార్‌ కడప, సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా దేశంలో తొలి స్థానంలో ఉండగా అనంతపురం రెండో స్థానంలో నిలిచింది. 

Current Affairs

రతన్‌ మోహిని దాదీ కన్నుమూత

ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి ‘రాజయోగిని’ దాదీ రతన్‌ మోహిని అహ్మదాబాద్‌ ఆసుపత్రిలో 2025, ఏప్రిల్‌ 8న మృతిచెందారు. ఆమె వయసు 101 ఏళ్లు. దాదీ రతన్‌ మోహిని అసలు పేరు లక్ష్మి. ప్రస్తుత పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో 1925లో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే బ్రహ్మకుమారీల్లో చేరారు. దేశ విభజన సమయంలో రాజస్థాన్‌కు వచ్చారు. ఆమె పలు సందర్భాల్లో మొత్తం 70 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బ్రహ్మకుమారీల శిక్షణ కేంద్ర నిర్వాహకురాలిగా దేశవ్యాప్తంగా ఉన్న 4,600 కేంద్రాల్లో సుమారు 46 వేల మంది బ్రహ్మకుమారీలను తీర్చిదిద్దారు.

Government Jobs

ఎన్‌పీసీఐఎల్‌, ముంబయిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌) కింది విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 400 (ప్రస్తుత ఖాళీలు- 396, బ్యాక్‌లాగ్ ఖాళీలు- 04) వివరాలు: విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.   వయో పరిమితి: 30-04-2025 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ వారికి మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది. ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100. ఎంపిక ప్రక్రియ: గేట్ 2023/ 2024/ 2025 స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-04-2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2025. Website:https://npcilcareers.co.in/MainSiten/default.aspx

Government Jobs

డీసీహెచ్‌ఎస్‌లో పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు జిల్లాలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆసుపత్రులకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఒప్పంద, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన  నియామకాలు ఉంటాయి. మొత్తం పోస్టుల సంఖ్య: 31 వివరాలు: ఒప్పంద పోస్టులు:  1. బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌- 01 2. ఆడియోమెట్రిషియన్‌- 05 3. రేడియోగ్రాఫర్‌- 03 4. ల్యాబ్‌ టెక్నీషియన్‌- 01 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు: 1. థియేటర్‌ అసిస్టెంట్‌- 04 2. ప్లంబర్‌- 02 3. ఆఫీస్‌ సబార్డినేట్‌- 01 4. జనరల్‌ డ్యూటీ/ అడెండెంట్స్‌- 11 5. పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌- 03 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, ఎంఎల్‌టీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత కోర్సు సర్టిఫికేట్‌ ఉండాలి. వయోపరిమితి: 2025 జనవరి 1వ తేదీ నాటికి 42 మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌కు రూ.54,060; ఆడియోమెట్రిషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.32,670; రేడియోగ్రాఫర్‌కు రూ.35,570; ఇతర పోస్టులకు రూ.15,000. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: దరఖాస్తు పూర్తి చేసి గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌, ఏలూరు డీసీహెచ్‌ఎస్‌ ఆఫీస్‌లో సమర్పించాలి. దరఖాస్తు చివరి తేదీ: 19.04.2025. Website:https://westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/

Government Jobs

సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐలో జేఎస్‌ఏ పోస్టులు

సీఎస్‌ఐఆర్‌- నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ) హైదరాబాద్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్(జనరల్): 08 2. జూనియర్ సెకట్రటేరియట్ అసిస్టెంట(ఎఫ్‌&ఏ): 01 3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్‌&పీ): 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌ ఉత్తీర్ణతతో పాటు టైంపింగ్ వచ్చి ఉండాలి.  వయోపరిమితి: 28 ఏళ్లు జీతం: నెలకు రూ.38,483. ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్‌ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-05-2025. Website:https://www.ngri.res.in/openings-at-ngri.php

Government Jobs

సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కేంద్రప్రభుత్వ మినీరత్న కంపెనీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ రెగ్యులర్‌/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు: అకౌంట్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-ఈ1): 03 కంపెనీ సెక్రటరీ: 02 ఆఫీసర్‌(లా): 01 పర్చెస్‌ ఆఫీసర్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ ఐసీడబ్ల్యూఏ, లా డిగ్రీ,  ఎంబీఏ, పీజీడీఎం/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 28.02.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు రూ.40,000 - రూ.1,40,000. దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-04-2025. Website:https://www.celindia.co.in/

Apprenticeship

డీఆర్‌డీవో-జీటీఆర్‌ఈలో అప్రెంటిస్‌ పోస్టులు

బెంగళూరులోని డీఆర్‌డీవో-గ్యాస్‌ టర్బైన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (జీటీఆర్‌ఈ) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 150 వివరాలు: 1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీస్‌: 105 2. డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనీస్‌: 20 3. ఐటీఐ అప్రెంటిస్‌ ట్రైనీస్‌: 25 విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్‌, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఎరోనాటికల్, ఎరోస్పేస్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్స్‌, ఎలక్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, టెలికమ్‌, సీఎస్‌, ఐటీ, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్‌, సివిల్  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 18 - 27 ఏళ్లు. స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000, ఐటీఐ అప్రెంటిస్‌కు రూ.7000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 8 మే 2025 Website:https://drdo.gov.in/drdo/careers

Apprenticeship

డీఆర్‌డీవో-ఏఆర్‌డీఈలో అప్రెంటిస్‌ పోస్టులు

పునెలోని డీఆర్‌డీవో- ఆర్నమెట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 70 పోస్టు పేరు-ఖాళీలు: విభాగాలు: ఎలక్ట్రిషీయన్‌, ఫిట్టర్‌, మెషనిస్ట్‌, ఎంఎంటీఎం, సీవోపీఏ, ఎంఎంవీ, ఆర్‌ అండ్‌ ఏసీ, ఫోటోగ్రాఫర్‌, టర్నర్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ మెకానికల్ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 - 30 ఏళ్ల లోపు ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.13,000. ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 20 Website:https://drdo.gov.in/drdo/career/arde-pune-invites-online-application-eligible-iti-holders-apprenticeship-training-under

Admissions

ఏపీ ఎడ్‌సెట్‌-2025

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2025 నోటిఫికేషన్‌ను ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది.  వివరాలు: ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) 2025  అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్టులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.  పరీక్ష విధానం: మూడు విభాగాలుగా 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.450; బీసీలకు రూ.500; ఓసీలకు రూ.650. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08-04-2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2025. ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తుకు చివరి తేదీ: 15-05-2025 నుంచి 19-05-2025 వరకు. ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2025 23-05-2025. దరఖాస్తు సవరణ తేదీలు: 24-05-2025 నుంచి 28-05-2025 వరకు. హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 30-05-2025. ప్రవేశ పరీక్ష తేదీ: 05-06-2025. ప్రిలిమినరీ కీ విడుదల: 10-06-2025. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: 13-06-2025. ఫలితాలు విడుదల: 21.06.2025. Website:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx Apply online:https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx

Government Jobs

Executive Trainee Posts In NPCIL, Mumbai

Nuclear Power Corporation of India Limited (NPCIL), Mumbai applications are invited from Indian Nationals for the post of Executive Trainee. No. of Posts: 400 (Current vacancies- 396, Backlog vacancies- 04) Details: Departments: Mechanical, Chemical, Electrical, Electronics, Instrumentation, Civil. Eligibility: BE, B.Tech, B.Sc/ Integrated M.Tech in the relevant engineering discipline with at least 60% marks. Age limit: Not more than 26 years as on 30-04-2025. Age relaxation of three years for OBC candidates, five years for SC/ST candidates; 10 years for PWBD candidates. Starting salary: Rs.56,100 per month. Selection process: Candidates will be shortlisted for Personal Interview on the basis of valid score obtained in Graduate Aptitude Test in Engineering (GATE) 2023/2024/2025. Application Fee: Rs. 500 (SC, ST, PWD and female candidates will be exempted from paying the fee). Online Application Start: 10-04-2025. Last Date for Online Application: 30-04-2025. Website:https://npcilcareers.co.in/MainSiten/default.aspx