Posts

Current Affairs

Department of Financial Services (DFS)

♦ The Department of Financial Services (DFS) under the Ministry of Finance on 2025 April 8 notified the amalgamation of 26 Regional Rural Banks (RRBs) as part of the fourth phase of RRB consolidation. ♦ The move follows the principle of “One State, One RRB” and aims to improve operational efficiency and cost rationalization. ♦ The amalgamation covers RRBs operating across 10 states and one union territory. ♦ According to the Ministry, the consolidation is expected to enhance the scale of operations and optimize resource use, building on the success of previous phases of amalgamation that have improved the performance of RRBs. ♦ Prior to the latest restructuring, 43 RRBs were operational across 26 states and 2 union territories. ♦ Following the merger, the total number of RRBs has been reduced to 28. These banks collectively operate more than 22,000 branches, serving around 700 districts nationwide. ♦ Approximately 92% of these branches are located in rural and semi-urban areas, reaffirming the banks’ core mandate of rural financial inclusion. ♦ This marks the fourth round of RRB amalgamations undertaken by the government. ♦ In the first phase (FY 2006 to FY 2010), the number of RRBs was reduced from 196 to 82. ♦ The second phase (FY 2013 to FY 2015) brought the number down to 56, while the third phase (FY 2019 to FY 2021) further reduced it to 43.

Current Affairs

Waqf (Amendment) Act

♦ The Waqf (Amendment) Act, 2025 officially came into force on 2025 April 8, following the issuance of a Gazette notification by the Central Government. ♦ The amended legislation brings substantial changes to the original Waqf Act. ♦ Key reforms include the separation of trusts from Waqf entities, the adoption of digital tools for property management, the creation of a centralised online portal to enhance transparency, and the restriction of Waqf property dedication to practicing Muslims only. ♦ The law also includes provisions to protect ‘Waqf by User’ properties—those historically used by the community—and recognises women’s rights in family Waqf arrangements. ♦ The amended law also expands the objectives of family Waqf to include financial support for widows, divorced women, and orphans. ♦ Section 3(r)(iv) allows Waqf funds to be used for their welfare and maintenance, aligning the legislation with Islamic principles of social justice and economic support. ♦ To improve gender representation, the Act mandates the inclusion of at least two Muslim women in every State Waqf Board (Section 14) and the Central Waqf Council (Section 9).

Current Affairs

పంచాయతీ పురోగతి సూచిక

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022-23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ 2025, ఏప్రిల్‌ 8న ‘పంచాయతీ పురోగతి సూచిక’ను విడుదల చేసింది. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధుల పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు..పారిశుద్ధ్యం..పచ్చదనం, మౌలిక వసతుల్లో స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళలకు అనుకూలమైన విధానాలు అనే తొమ్మిది కొలమానాల ఆధారంగా పంచాయతీల పనితీరును మదింపు చేశారు.  వాటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ.. అవి సాధించిన పురోగతికి సంబంధించిన సూచికలను నిర్ధారించింది. అందులో రాష్ట్రాల వారీగా టాప్‌-25 పంచాయతీల పేర్లు ప్రకటించింది. అందులో దేశంలోని ఏ పంచాయతీకీ అచీవర్స్‌ హోదా దక్కలేదు. గుజరాత్‌లోని 346, తెలంగాణలో 270 పంచాయతీలు ఏ గ్రేడ్‌ (ఫ్రంట్‌ రన్నర్‌) దక్కించుకుని తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

Current Affairs

2025లో జీడీపీ 5.9 శాతమే

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో జపనీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ నొమురా కోత విధించింది. 2025 ఏడాదికి జీడీపీ వృద్ధి అంచనాను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.9 శాతానికి పరిమితం చేసింది. 2024లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. అయితే అమెరికా టారిఫ్‌ల వల్ల భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండదని నొమురా పేర్కొంది. 2026లో భారత జీడీపీ 7% వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. 

Current Affairs

రూ.2 లక్షల కోట్లకు మొబైల్‌ ఎగుమతులు

మన దేశం నుంచి మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.2 లక్షల కోట్లను అధిగమించాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఇందులో ఐఫోన్‌ ఎగుమతుల విలువే దాదాపు రూ.1.5 లక్షల కోట్లని వెల్లడించారు. 2023-24లో జరిగిన స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులతో పోలిస్తే గతేడాది 54% వృద్ధి నమోదైంది. దేశంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ గత 10 ఏళ్లలో 5 రెట్లకు పైగా పెరిగిందని, ఎగుమతులు ఆరు రెట్లు అధికమయ్యాయని వైష్ణవ్‌ తెలిపారు.

Current Affairs

షూటింగ్‌ ప్రపంచకప్‌

షూటింగ్‌ ప్రపంచకప్‌ మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌లో భారత షూటర్‌ సురుచి సింగ్‌ స్వర్ణం సాధించింది. 2025, ఏప్రిల్‌ 8న బ్యూనస్‌ఎయిర్స్‌లో జరిగిన ఫైనల్లో 18 ఏళ్ల సురుచి 244.6 పాయింట్లు స్కోర్‌ చేసింది. టోర్నీలో భారత్‌కు ఇది మూడో స్వర్ణం.  అంతకుముందు క్వాలిఫికేషన్‌ రౌండ్లో సురుచి 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా షూటర్లు కియాన్‌వి (241.9) రజతం, జియాంగ్‌ రాక్సిన్‌ (221.0) కాంస్యం నెగ్గారు. 

Current Affairs

మోదీతో దుబాయ్‌ యువరాజు భేటీ

రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన దుబాయ్‌ యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ 2025, ఏప్రిల్‌ 8న దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిర్ణయించాయి. అదేవిధంగా సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి పరిచే అవకాశాలను అన్వేషించాలని అంగీకారానికి వచ్చాయి. 

Current Affairs

పీఎంఎంవై 10వ వార్షికోత్సవం

ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) 10వ వార్షికోత్సవం నేపథ్యంలో పథకం లబ్ధిదారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2025, ఏప్రిల్‌ 8న తన నివాసంలో ముచ్చటించారు. దేశంలో అసంఖ్యాకమైన వ్యక్తులు తమ వ్యాపార నైపుణ్యాలు ప్రదర్శించేందుకు ముద్రా యోజన ద్వారా హామీలేని రూ.33 లక్షల కోట్ల రుణాలను అందించామని ఆయన వెల్లడించారు. మొత్తం 52 కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు.  ఈ పథకం 2015, ఏప్రిల్‌ 10న ప్రారంభమైంది.

Current Affairs

అమల్లోకి వక్ఫ్‌ చట్టం

వక్ఫ్‌ చట్టం 2025, ఏప్రిల్‌ 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025లోని సెక్షన్‌ 1లో ఉన్న సబ్‌ సెక్షన్‌ 2ద్వారా దఖలు పడిన అధికారాలను అనుసరించి.. ఏప్రిల్‌ 8 నుంచి చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా ప్రకటిస్తున్నాం అని ఆ నోటిఫికేషన్‌లో ఉంది.

Current Affairs

జలహారతి కార్పొరేషన్‌

ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, జలవనరుల శాఖ మంత్రి ఉపాధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్‌లో జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటయింది. వరద జలాల సద్వినియోగానికి దీన్ని ప్రభుత్వ ఎంటర్‌ప్రైజస్‌గా పేర్కొన్నారు. పోలవరం- బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు చేపట్టేందుకు దీన్ని ప్రత్యేక వాహక నౌక (ఎస్‌పీవీ)గా ఏర్పాటు చేశారు. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ 2025, ఏప్రిల్‌ 8న ఉత్తర్వులు ఇచ్చారు.