Posts

Current Affairs

Supreme Court

♦ The Supreme Court has ruled that the President must decide on State Bills, reserved by Governors for Presidential assent, within three months. ♦ The Apex Court set aside Tamil Nadu Governor R.N. Ravi’s decision to withhold assent to 10 pending Bills and, in the process, ruled that the President should also not take more than three months in arriving at a decision on Bills referred by Governors.  ♦ The Supreme Court has said it is not undermining the office of the Governor in fixing a timeline for their actions under Article 200, but they must act with due deference to the settled conventions of parliamentary democracy. ♦ Article 200 empowers the Governor to give assent to the Bills presented to him, withhold the assent, or reserve it for the consideration of the President.

Current Affairs

ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మళ్లీ గంగూలీనే

ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ 2025, ఏప్రిల్‌ 13న నియమితుడయ్యాడు. దుబాయ్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ ఛైర్మన్‌గా ఎనుకున్నారు. మరో భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం కమిటీలో సభ్యుడిగా కొనసాగనున్నాడు. డెస్మండ్‌ హేన్స్‌ (వెస్టిండీస్‌), హమిద్‌ హసన్‌ (అఫ్గానిస్థాన్‌), బవుమా (దక్షిణాఫ్రికా), జొనాథన్‌ ట్రాట్‌ (ఇంగ్లాండ్‌) కమిటీలో ఇతర సభ్యులు.  అనిల్‌ కుంబ్లే స్థానంలో 2021లో గంగూలీ బాధ్యతలు అందుకున్నాడు.

Current Affairs

వెదురుతో దుర్భేద్య బంకర్లు

బంకర్లు, రక్షణశాఖ షెల్టర్ల నిర్మాణానికి అక్కరకొచ్చే మిశ్రమ పదార్థాలను వెదురు సాయంతో ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ కలప, ఇనుము, లోహాలకు బదులుగా దీన్ని ఉపయోగించొచ్చు. దీన్ని భారత సైన్యం పరీక్షిస్తోంది. స్వీయ బరువుతో పోలిస్తే అందించే అత్యుత్తమ బలం కారణంగా ఏరోస్పేస్, పౌర, నౌకాదళ రంగాల్లో గ్లాస్‌ ఫైబర్, కార్బన్‌ ఫైబర్, శాండ్‌విచ్‌ కాంపోజిట్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ఉత్పత్తి, పారవేతలో పర్యావరణ సవాళ్లు గణనీయంగానే ఉన్నాయి. చెట్ల నరికివేతపై ఆంక్షలు, హరిత ప్రత్యామ్నాయాలకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా.. వెదురు ఆధారిత మిశ్రమ పదార్థాల రూపకల్పనపై గువాహటి ఐఐటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు.

Current Affairs

లేజర్‌ అస్త్రం

శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుత లేజర్‌ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. కర్నూలులోని నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌లో 2025, ఏప్రిల్‌ 13న ఈ పరీక్ష జరిగింది. ఈ ఆయుధానికి మార్క్‌-2(ఏ) డీఈడబ్ల్యూ అని పేరు పెట్టారు.  దీంతో అత్యంత శక్తిమంతమైన లేజర్‌- డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌ (డీఈడబ్ల్యూ) వ్యవస్థ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరినట్లయింది. ఈ అస్త్రాలను అమెరికా, చైనా, రష్యాలు విజయవంతంగా పరీక్షించాయి. ఇజ్రాయెల్‌ కూడా వీటిపై ప్రయోగాలు చేస్తోంది. ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌.. సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ (చెస్‌) అభివృద్ధి చేసింది. దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు ఇందులో పాలుపంచుకున్నాయి. 

Current Affairs

వనజీవి రామయ్య మరణం

మొక్కలు నాటడానికి, చెట్ల సంరక్షణకు తన జీవితాన్ని ధారపోసిన ప్రకృతి ప్రేమికుడు దరిపల్లి రామయ్య (79) రెడ్డిపల్లిలో 2025, ఏప్రిల్‌ 12న మరణించారు. ఆయన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. రామయ్య 1946 జులై 1న జన్మించారు. ఆయన తన అయిదో ఏట నుంచే రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం మొదలుపెట్టారు.  ఆయన సేవలకు గుర్తింపుగా బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ అనే సంస్థ 2013 ఏప్రిల్‌ 8న డాక్టరేట్‌ ప్రదానం చేసింది.  2017 మార్చి 30న నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 

Current Affairs

చైనా

చైనా ఓ పెద్ద లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించింది. ఐఫిల్‌ టవర్‌ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వేలాడే వంతెనగా నిలిచింది. గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్‌ నదిపై 2,050 అడుగుల ఎత్తులో ఈ హువాజియాంగ్‌ గ్రాండ్‌ కాన్యన్‌ వంతెనను నిర్మించారు. ఇదివరకు లోయ చుట్టూ తిరిగి గంటసేపు పట్టే ప్రయాణాన్ని ఇప్పుడు నిమిషంలో పూర్తి చేయవచ్చని చైనా అధికారులు పేర్కొన్నారు. 2022లో నిర్మాణాన్ని ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు. 280 మిలియన్‌ డాలర్లు (రూ.2,411 కోట్లు) ఖర్చు పెట్టారు. జూన్‌ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. 

Current Affairs

తమిళనాడు

గవర్నర్‌ ఆమోదం పొందకుండానే పది బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2025, ఏప్రిల్‌ 12న గెజిట్‌ విడుదల చేసింది. గవర్నర్‌ లేక రాష్ట్రపతి ఆమోదం లేకుండా బిల్లులు చట్టంగా మారడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఏదైనా చట్టం చేయాల్సి వస్తే ముందుగా శాసనసభలో దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి, ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపాల్సి ఉంది. తన పరిధి దాటి, జాతీయ స్థాయిలో ముడిపడిన అంశాలకు సంబంధించిన బిల్లులు ఉంటే వాటిని రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్‌ పంపుతారు.  ఇదిలా ఉండగా తమిళనాడు శాసనసభ పంపిన పది బిల్లులను గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రిజర్వులో ఉంచారు. సుదీర్ఘకాలం పాటు బిల్లులను రిజర్వులో ఉంచడంతో స్టాలిన్‌ సర్కారు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ చర్య రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో.. ఆ బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. 2023 నవంబరు 18న వాటిని గవర్నర్‌ ఆమోదించినట్లు భావించాలని పేర్కొంది. 

Current Affairs

సుప్రీంకోర్టు తీర్పు

శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. 

Walkins

ఎన్‌సీపీఓఆర్‌లో వివిధ పోస్టులు

దిల్లీలోని నేషనల్ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీపీఓఆర్‌) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 35 వివరాలు: 1. వెహికిల్ మెకానిక్‌: 04 2. జనరేటర్‌ మెకానిక్‌/ఆరపరేటర్‌: 01 3. స్టేషన్‌ ఎలక్ట్రీషియన్‌: 01 4. వెహికిల్ ఎలక్ట్రీషియన్‌: 03 5. ఆపరేటర్‌(డోజర్స్, ఎక్సకవేటర్స్‌): 01 6. క్రేన్‌ ఆపరేటర్‌: 02 7. వెల్డర్‌: 03 8. బాయిలర్‌ ఆపరేటర్‌: 01 9. కార్పెంటర్‌: 03 10. వాయేజ్ సపోర్ట్ అసిస్టెంట్: 01 11. మేల్ నర్స్‌: 03 12. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 02 13. రేడియో/వైర్‌లెస్‌ ఆపరేటర్‌: 03 14. ఇన్వెంటరీ స్టోర్స్‌ అసిస్టెంట్: 02 15. చెఫ్‌/కుక్‌: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, ట్రేడ్ వర్క్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.58,891. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 6, 7, 8, 9. వేదిక: మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్ సైన్సెస్‌, పృథ్వి భవన్‌, ఐఎండీ క్యాంపస్‌, లోధి రోడ్, న్యూ దిల్లీ-110003. Website:https://ncpor.res.in/recruitment

Government Jobs

ఐఐఎఫ్‌ఎంలో సీనియర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 07 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.42,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25 ఏప్రిల్ 2025 Website:https://iifm.ac.in/vacancies