Posts

Current Affairs

అమల్లోకి ఎస్సీ వర్గీకరణ

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2025, ఏప్రిల్‌ 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఎస్సీల్లోని గ్రూపుల వారీగా దీని ఫలాలు అందుతాయని తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదంపై (న్యాయశాఖ జీవో 33), ఎస్సీ వర్గీకరణ అమలు తేదీపై (ఎస్సీ సంక్షేమశాఖ జీవో 9), నిబంధనలపై (ఎస్సీ సంక్షేమశాఖ జీవో 10), తెలంగాణ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలకు సవరణపై(సాధారణ పరిపాలనశాఖ జీవో 99) ఉత్తర్వులు జారీ చేశాయి.  ఈ బిల్లుకు ఏప్రిల్‌ 8న గవర్నర్‌ ఆమోదం తరువాత వర్గీకరణ చట్టం-2025ను 14న తెలంగాణ రాజపత్రంలో ప్రచురించారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి జీవో 33 జారీచేశారు. 

Current Affairs

భూభారతి చట్టం

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం భూభారతి-2025 ఏప్రిల్‌ 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలు చేసే పైలట్‌ మండలాలుగా నాలుగింటిని ప్రభుత్వం ప్రకటించింది. నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ములుగు జిల్లా వెంకటాపూర్, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలాల్లో భూ భారతి అమల్లోకి వస్తుంది. ఏప్రిల్‌ 17 నుంచి ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కరిస్తారు. మే 1 నుంచి మిగిలిన 29 జిల్లాల్లోని ఒక్కో మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు జరుపుతారు.

Current Affairs

‘లెజెండ్స్‌ ఆఫ్‌ ఎండోస్కోపీ’ పురస్కారం

ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి జపాన్‌ పురస్కారం ‘లెజెండ్స్‌ ఆఫ్‌ ఎండోస్కోపీ’ దక్కింది. ఆ దేశానికి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఆయనకు 2025, ఏప్రిల్‌ 14న దీన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ వైద్యుడు నాగేశ్వరరెడ్డి. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో ఆయన అందించిన విశేష సేవలతోపాటు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకుగానూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. షోవా విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘టోక్యో లైవ్‌ గ్లోబల్‌ ఎండోస్కోపీ 2025’ వేడుకలో నాగేశ్వరరెడ్డికి ఈ పురస్కారాన్ని అందజేశారు. 

Walkins

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

తెలంగాణ- పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), ఒప్పంద ప్రాతిపదికన అనుభవం గల మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌ (ఎంఓ)- 03 పోస్టులు: అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 29.02.2025 నాటికి 64ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 24.04.2025. వేదిక: అడ్మిన్‌ బిల్డింగ్‌, ఆర్‌ఎప్‌సీఎల్‌ సైట్‌, రామగుండం. Website:https://www.rfcl.co.in/

Walkins

ఎయిమ్స్‌ రాయ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రూప్‌-ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 21 వివరాలు: విభాగాలు: అనస్తీషియాలజీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ రికన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ,  క్రిటికల్‌ అండ్‌ ఇన్‌టెన్సీవ్‌ కేర్‌, ఎండోక్రైనాలజీ, మెటబాలిజమ్‌, జనరల్‌ సర్జరీ, నెఫ్రాలజీ, లాబొరేటరీ ఆంకాలజీ, పల్మనరీ అండ్‌ స్లీప్‌ మెడిసిన్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, డీఎన్‌బీ, ఎంసీహెచ్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.1,42,506. వయో పరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా. పరీక్ష కేంద్రం: దిల్లీ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24.04.2025. Website:https://www.aiimsraipur.edu.in/

Government Jobs

ఐజీఐడీఆర్‌లో టీచింగ్‌ పోస్టులు

ముంబయిలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవెలప్‌మెంట్‌ రిసెర్చ్‌ (ఐజీఐడీఆర్‌) కింది టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు: 1. ప్రొఫెసర్‌- 03 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 02 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (రెగ్యులర్‌/ కాంట్రక్ట్‌/ విజిటింగ్‌)- 12 విభాగాలు: క్లైమేట్‌ చెంజ్‌ ఎకనామిక్స్‌, డేటా సైన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఎకనామెట్రిక్‌ థియరీ, ఎకనామిక్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మైక్రోఎకనామిక్ థియరీ, పొలిటికల్‌ ఎకానమీ తదితరాలు. అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: ప్రొఫెసర్‌కు రూ.1,59,100; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ,39,600; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,01,500. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05.05.2025. Website:http://www.igidr.ac.in/careers/ Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLSfBHRyrbWhysimJiSn8UvDaXkXhEiIyzK7aiso68wf9J_MRNg/viewform

Government Jobs

ఐసీజీఈబీలో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

దిల్లీలోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌  ఫర్‌ జనెటిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 4 వివరాలు:  రిసెర్చ్‌ అసోసియేట్‌-I: 01 ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-I: 02 సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ఈమెయిల్:amit.icmrcar@gmail.com. పని ప్రదేశం: ఐసీబీఈబీ క్యాంపస్‌, న్యూదిల్లీ. చివరి తేదీ: 15.5.2025 Website:https://www.icgeb.org/

Admissions

మనూలో పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్‌తో పాటు అనుబంధ క్యాంపస్‌లలో 2025-26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ విధానంలో పలు కోర్సులను అందిస్తోంది.  వివరాలు: ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు: 1. పీహెచ్‌డీ ప్రోగ్రాం: ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, డెక్కన్ స్టడీస్, ఎడ్యుకేషన్ తదితరాలు. 2. పీజీ ప్రోగ్రాం: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌(సీఎస్‌), ఎంఈడీ, ఎల్‌ఎల్‌ఎం. 3. యూజీ ప్రోగ్రాం: బీటెక్‌ (సీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌) లేటరల్‌ ఎంట్రీ, బీఈడీ, బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌). 4. ప్రొఫెషనల్‌ డిప్లొమా: డీఈఎల్‌ఈడీ, పాలిటెక్నిక్- డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌- సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌- ఎలక్ట్రానికల్‌, అటోమొబైల్‌, అప్పారెల్‌ టెక్నాలజీ అండ్‌ పాలిటెక్నిక్- డిప్లొమా లేటరల్ ఎంట్రీ. మెరిట్ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు: 1. పీజీ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్: ఎంఏ(ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ, అరబిక్‌, పర్షియన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ తదితరాలు), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ.జేఎంసీ,  ఎంఎస్సీ, ఎంకాం, ఎంఒకేషనల్‌, పీజీడీటీఈ, ఎంసీఏ. 2. పీజీ డిప్లొమా ప్రోగ్రాం(పార్ట్ టైమ్): ఫంక్షనల్ ఉర్దూ, హిందీ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌, ప్రొఫెషనల్ అరబిక్, ట్రాన్స్‌లేషన్‌. 3. డిప్లొమా ప్రోగ్రాం (పార్ట్ టైమ్): ఉర్ధూ, తహసీన్-ఇ-గజల్, అరబిక్, పర్షియన్, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, ఇస్లామిక్ స్టడీస్ తదితరాలు. 4. సర్టిఫికేట్ ప్రోగ్రాం (పార్ట్ టైమ్): ఉర్దూ సర్టిఫికేట్ కోర్సు, ప్రొఫీసియన్సీ ఇన్‌ అరబిక్, పర్షియన్, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, తెలుగు, కశ్మీరీ, టర్కిష్. అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.  ప్రవేశ పరీక్ష ఆధారిత ప్రొఫెషనల్/ టెక్నికల్/ లా/ ఒకేషనల్ ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13-05-2025. ప్రవేశ పరీక్ష ఆధారిత పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13-05-2025. మెరిట్ ఆధారిత ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04-06-2025. ప్రవేశ పరీక్షల తేదీలు: 12, 13, 14.06.2025. Website:https://manuucoe.in/regularadmission/  

Walkins

Medical Officer Posts In RFCL

Ramagundam Fertilizers and Chemicals Limited (RFCL), located in Ramagundam, Peddapalli district, Telangana, is inviting applications for the recruitment of experienced Medical Officer posts on contract basis. Details: Medical Officer (MO)- 03 posts Eligibility: MBBS with work experience. Age Limit: Not more than 64 years as on 29.02.2025. Interview Date: 24.04.2025. Venue: Admin Building, RFCL Site, Ramagundam. Website:https://www.rfcl.co.in/

Walkins

Faculty Posts In AIIMS Raipur

All India Institute of Medical Sciences (AIIMS), Raipur is inviting applications for the recruitment of Assistant Professor (Group-A) posts in the following departments. No. of Posts: 21 Details: Departments: Anesthesiology, Burns and Plastic Reconstructive Surgery, Critical and Intensive Care, Endocrinology, Metabolism, General Surgery, Nephrology, Laboratory Oncology, Pulmonary and Sleep Medicine etc. Qualification: MBBS, MD, MS, M.Sc, DNB, M.Ch, PG in the relevant discipline as per the post along with work experience. Salary: Rs. 1,42,506 per month. Age limit: Not more than 50 years. Relaxation of five years for SC/ST, three years for OBC, and ten years for PwBD candidates. Application fee: Rs.1,000 for General, OBC, EWS candidates, Rs.500 for SC/ST/Divyang candidates. Selection process: Based on educational qualifications, interview etc. Exam Center: Delhi Last date of online application: 24.04.2025. Website:https://www.aiimsraipur.edu.in/