Posts

Current Affairs

లా కమిషన్‌ ఛైర్మన్‌

న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి 2025, ఏప్రిల్‌ 15న నియమితులయ్యారు. 2024, సెప్టెంబరు 3న 23వ లా కమిషన్‌ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడగా.. తాజాగా ఈ కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, కమిషన్‌ పూర్తిస్థాయి సభ్యులుగా హితేశ్‌ జైన్‌ (న్యాయవాది), ప్రొఫెసర్‌ డి.పి.వర్మ (లా ప్రొఫెసర్‌- బీహెచ్‌యూ) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్‌ పదవీ కాలం 2027 ఆగస్టు 31వరకు కొనసాగనుంది. గత లా కమిషన్‌లో కూడా వర్మ సభ్యుడిగా ఉన్నారు. నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచవచ్చో లేదో కూడా లా కమిషన్‌ పరిశీలించనుంది. 

Current Affairs

భారత్, శ్రీలంక మధ్య ఒప్పందం

వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయ విధానాల అమలుపై ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా భారతదేశం, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. 2025, ఏప్రిల్‌ 15న అమరావతి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ భారతదేశ ప్రతినిధి, సంచాలకులు ఎలిజబెత్‌ ఫౌర్‌ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.  ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో ఐదేళ్లపాటు దీన్ని అమలు చేస్తారు. 

Current Affairs

రాష్ట్రాల ‘స్వయం సాధికారత’పై ఉన్నత స్థాయి కమిటీ

రాష్ట్రాల స్వయం సాధికారత కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 2025, ఏప్రిల్‌ 15న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని, సభ్యులుగా ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అశోక్‌ వర్ధన్‌ శెట్టి, తమిళనాడు ప్రణాళికా సంఘం మాజీ వైస్‌ ఛైర్మన్‌ నాగనాథన్‌ ఉంటారని వెల్లడించారు. 

Current Affairs

2025-26లో వృద్ధి 6.1 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి 6.1 శాతానికి తగ్గొచ్చని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. వృద్ధిరేటు 6.5% ఉండొచ్చని ఇంతకు ముందు సంస్థ అంచనా వేసింది. అంటే ప్రస్తుతం 40 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. 2026-27లో వృద్ధి 6.3 శాతానికి పుంజుకోవచ్చని పేర్కొంది. అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా తలెత్తిన అనిశ్చితి పరిస్థితులే ఇందుకు కారణమని వెల్లడించింది. 2025లో కీలక రేట్లను మరో 0.50% మేర ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

Current Affairs

దేశీయ ఎగుమతులు

2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 820.93 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.70.60 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. 2023-24 ఎగుమతులు 778.13 బి.డా.తో పోలిస్తే, ఇవి 5.5% ఎక్కువ. 2025, మార్చిలో ఎగుమతులు 0.7% పెరిగి 41.97 బి.డా.కు చేరాయి. అయితే దిగుమతులు 11.3% పెరిగి, 63.51 బి.డా.కు చేరడం వల్ల వాణిజ్యలోటు 21.54 బి.డా.గా నమోదైంది. 2024-25లో వస్తువుల ఎగుమతులు 0.08% పెరిగి 437.42 బి.డా.కు, దిగుమతులు 6.62% అధికమై 720.24 బి.డా.కు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు 282.82 బి.డా.కు చేరింది. 2023-24లో వాణిజ్యలోటు 241.14 బి.డా. 

Current Affairs

తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం

తెలంగాణ, దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2025, మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 3.34% నమోదు కాగా.. తెలంగాణలో 1.06%, దిల్లీలో 1.48, ఝార్ఖండ్‌లో 2.08, ఆంధ్రప్రదేశ్‌లో 2.50 శాతానికి పరిమితమైంది. తెలంగాణ తొలి, ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానాల్లో నిలిచాయి. అత్యధిక ద్రవ్యోల్బణంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. మార్చిలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 0.20%, పట్టణ ప్రాంతాల్లో 1.79%, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 2.14%, పట్టణ ప్రాంతాల్లో 3.13% మేర ద్రవ్యోల్బణం నమోదైంది. 

Government Jobs

ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) రెగ్యులర్‌ ప్రాతిపదికన సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 31 వివరాలు:  సీనియర్‌ అనలిస్ట్‌  విభాగాల వారి ఖాళీలు: 1. లీడింగ్‌ ఆపరేషనన్స్‌(లీడింగ్‌ అండ్ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌)- 10 2. అకౌంట్స్‌- 01 3. ట్రేజరీ- 01 4. లీగల్‌- 03 5. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- 02 6. రాజ్‌భాషా/ అఫిషీయల్‌ లాంగ్వేజ్‌- 01 7. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌- 08 8. ఇంటర్నల్‌ ఆడిట్‌- 01 9. అడ్మినిస్ట్రేషన్‌- 01 10. హ్యూమన్‌ రిసోర్స్‌- 01 11. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌- ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ- 01 12. ఎకనామిస్ట్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ/ బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 21 నుంచి 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 04.05.2025. Website:https://nabfid.org/

Government Jobs

బెల్‌లో ఇంజినీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ నవరత్న కంపెనీ బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)  తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టులు సంఖ్య: 07 వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 05 ట్రైనీ ఇంజినీర్‌: 02 విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎరోనాటికల్‌/ ఎరోస్పేస్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 01.04.2025 నాటికి ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 32 ఏళ్లు; ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000. ట్రైనీ ఇంజినీర్‌కు మొదటి ఏడాది రూ.35,,000; రెండో ఏడాది రూ.35,000. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.472; ట్రైనీ ఇంజినీర్‌కు రూ.177. (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి ఫిజులో మినహాయింపు ఉంటుంది).  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2025. Website:https://bel-india.in/

Apprenticeship

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎండీసీ), బైలడిల ఐరన్‌ ఓర్‌ మైన్‌, బచేలీ కాంప్లెక్స్‌ కింది విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 179. వివరాలు: 1. ట్రేడ్ అప్రెంటిస్: 130  2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16  3. టెక్నీషియన్ అప్రెంటిస్: 13  విభాగాలు: సీఓపీఏ, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ డీజిల్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ తదితరాలు. అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ట్రేడ్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులు  www.apprenticeshipindia.org; గ్రాడ్యుయేట్‌/ టెక్నికల్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులు https://nats.education.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీలు: 08, 09, 10, 11, 12, 13, 15, 16, 17, 18-05-2025. వేదిక: ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బీఐఓఎం, బచేలీ కాంప్లెక్స్, దంతేవాడ, ఛత్తీస్‌గఢ్. Website:https://www.nmdc.co.in/careers

Admissions

జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి యూజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అర్హత గల విదేశీ పౌరులకు/ భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIO)/ గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికుల పిల్లలు(CIWG)/ ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: బీటెక్‌/ బీటెక్‌(ఐడీపీ), ఎంటెక్‌/ ఎం.ఫార్మ్‌/ బీబీఏ(డేటా అనలిటిక్స్‌)/ బీబీఏ(రెగ్యులర్‌)/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ. అర్హత: ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.1000 (డీడీ) జేఎన్‌టీయూ, హైదరాబాద్‌, డైరెక్టర్‌, యూనివర్సిటీ ఫారెన్‌ రిలేషన్స్‌, రెండో అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, జేఎన్‌టీయూహెచ్‌, కూకట్‌పల్లికి పంపించాలి.   యూజీ దరఖాస్తులు చివరి తేదీ: 16.06.2025. పీజీ దరఖాస్తులు చివరి తేదీ: 14.08.2025. పీహెచ్‌డీ దరఖాస్తులకు చివరి తేదీ: 30.10.2025. Website:https://www.jntuh.ac.in/