బెల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఘజియాబాద్ యూనిట్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 84 విభాగాలు: మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 31-12-2025వ తేదీ నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్టైపెండ్: నెలకు రూ.17,500. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్ 25. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 16, 17. వేదిక: బెల్, సైట్-4, సహిబాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, భరత్ నగర్ పోస్ట్, ఘజియాబాద్-201010. Website:https://bel-india.in/job-notifications/