Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

తీర రక్షణ దళంలోకి ‘అమూల్య’

మెరుపు వేగంతో సాగరజలాల్లో గస్తీ నిర్వహించే నౌక అమూల్య 2025, డిసెంబరు 19న భారత తీర రక్షణ దళంలో చేరింది. దీంతో తూర్పు తీరంలో కోస్ట్‌గార్డ్‌ పోరాట సామర్థ్యానికి మరింత దన్ను లభించినట్లయింది. ఇది కొత్త తరం అదమ్య తరగతి ఫాస్ట్‌ పెట్రోల్‌ వెసెల్స్‌ శ్రేణిలో మూడోది. నిఘా, గాలింపు, సహాయ చర్యలు, స్మగ్లింగ్‌ నివారణ, కాలుష్య ప్రతిస్పందన లాంటి కార్యకలాపాలను ఇది చేపడుతుంది.  ఈ నౌక పొడవు 51 మీటర్లు. ఇందులో 3వేల కిలోవాట్ల సామర్థ్యమున్న రెండు అధునాతన డీజిల్‌ ఇంజిన్లు ఉన్నాయి. ఈ నౌక గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఏకబిగిన 1500 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణించగలదు. దీన్ని గోవా షిప్‌యార్డ్‌ నిర్మించింది. 

Current Affairs

ట్రాన్స్‌జెండర్స్‌ జాతీయ క్రీడలు

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో ఉన్న కోటా స్టేడియంలో ట్రాన్స్‌జెండర్ల నేషనల్‌ స్పోర్ట్స్‌మీట్‌- 2025 డిసెంబరు 19న మొదలైంది. ఇందులో పాల్గొనేందుకు దేశంలోని 10 రాష్ట్రాల నుంచి దాదాపు 170 మంది ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్లు పాల్గొన్నారు. పరుగు పందేలు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, టగ్‌ ఆఫ్‌ వార్‌ లాంటి వివిధ క్రీడాంశాల్లో వీరికి పోటీలు నిర్వహించారు. 

Current Affairs

‘అమరజీవి జలధార’

జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) వాటర్‌ గ్రిడ్‌ పథకానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘అమరజీవి జలధార’ అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మంగళగిరిలో 2025, డిసెంబరు 19న విడుదల చేశారు.   జలజీవన్‌ మిషన్‌లో అయిదు ఉమ్మడి జిల్లాల్లో రూ.7,910 కోట్లతో ఐదు ప్రాజెక్టుల పనులు చేపట్టి వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల గ్రామీణుల దాహార్తి తీర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 

Current Affairs

బర్హమ్‌ సలీహ్‌

ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు బర్హమ్‌ సలీహ్‌ను ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తరువాతి అధిపతిగా ఎన్నికయ్యారు. దీన్ని సమితి జనరల్‌ అసెంబ్లీ 2025, డిసెంబరు 19న ఆమోదించింది. 1970ల తర్వాత పశ్చిమాసియాకు చెందిన వ్యక్తి మొదటిసారి ఈ పదవికి ఎంపికయ్యారు. 193 మంది సభ్యులున్న సర్వ ప్రతినిధి సభ కుర్దిష్‌ రాజకీయ నాయకుడైన బర్హమ్‌ సలీహ్‌ను ఐరాస శరణార్థుల హైకమిషనర్‌గా ఏకాభిప్రాయంతో ఎన్నుకుంది.

Current Affairs

పీఎస్సీ ఛైర్‌పర్సన్ల సదస్సు

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్ల 26వ జాతీయ సదస్సు 2025 డిసెంబరు 19న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైది. యూపీఎస్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ సహా, 24 మంది పీఎస్సీల ఛైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము దీనికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డిసెంబరు 20న ఇది ముగిసింది. 

Internship

జీగ్లర్‌ ఏరోస్పేస్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని జీగ్లర్‌ ఏరోస్పేస్‌ ప్రైసింగ్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌  పోస్టు పేరు: ప్రైసింగ్‌ అనలిస్ట్‌  నైపుణ్యాలు: డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఆర్‌ఐఎస్‌), ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆపీస్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.8,000.  వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 30-01-2026. Website:https://internshala.com/internship/detail/pricing-analyst-internship-in-hyderabad-at-ziegler-aerospace1765340283

Internship

Internship Posts In Ziegler Aerospace

Ziegler Aerospace in Hyderabad is inviting applications for Pricing Analyst positions.  Details: Company: Ziegler Aerospace Post Name: Pricing Analyst Skills: Data Interpretation, English speaking and writing, Financial Literacy, Human Resources Information System (HRIS), proficiency in MS-Excel, MS-Office. Stipend: Rs. 8,000. Duration: 6 months Application Deadline: 30-01-2026. Website:https://internshala.com/internship/detail/pricing-analyst-internship-in-hyderabad-at-ziegler-aerospace1765340283

Current Affairs

International Migrants Day

♦ International Migrants Day is annually observed on December 18. The day commemorates the adoption of the International Convention on the Protection of the Rights of All Migrant Workers and Members of Their Families. On December 4, 2000, the UN General Assembly (UNGA) designated 18 December as International Migrants Day, taking into account the large and increasing number of migrants in the world.   ♦ The UNGA chose 18 December for the Day to mark the anniversary of the 1990 adoption by the UNGA of the International Convention on the Protection of the Rights of All Migrant Workers and Members of their Families. ♦ 2025 theme: My Great Story: Cultures and Development

Current Affairs

India and the United Arab Emirates

♦ India and the United Arab Emirates launched the second edition of their joint military exercise, Desert Cyclone II at Abu Dhabi on 18 December 2025. The exercise concludes on 30 December 2025. It focuses on enhancing joint operational capabilities in complex urban warfare environments.  ♦ The Indian contingent comprises 45 personnel, primarily from a battalion of the Mechanised Infantry Regiment. The UAE Land Forces contingent, of similar strength, will be represented by the 53 Mechanised Infantry Battalion. ♦ The aim of the exercise is to enhance interoperability and foster defence cooperation between the Indian Army and the UAE Land Forces through joint training in an urban environment, with a focus on sub-conventional operations under a United Nations mandate. This will enable both forces to operate together in peacekeeping, counter-terrorism and stability operations.

Current Affairs

Viksit Bharat – Guarantee for Rozgar and Ajeevika Mission

♦ Parliament has passed the Viksit Bharat – Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin): Viksit Bharat – G RAM G Bill, 2025, with the Lok Sabha and Rajya Sabha approving it on 18 December 2025.  ♦ The Bill seeks to establish a rural development framework aligned with the national vision of Viksit Bharat 2047. Under the legislation, a statutory guarantee of 125 days of wage employment will be provided in every financial year to every rural household whose adult members volunteer to undertake unskilled manual work. ♦ The fund-sharing pattern between the Central and State governments will be 60:40 for all states, except the North-Eastern and Himalayan states, where the sharing arrangement will be 90:10. The State governments will continue to pay unemployment allowance and compensation. ♦ Since its enactment in 2005, MGNREGA has provided a legal guarantee of 100 days of wage employment to rural households, helping stabilise incomes, especially during economic stress. Over the years, the programme expanded digital payments, Aadhaar-based systems and geo-tagging of assets, while women’s participation rose steadily.