Posts

Admissions

Ph.D Admissions In IIIT Bangalore

International Institute of Information Technology, Bangalore, Karnataka invites applications for admissions in the following courses for the August term 2025. Courses: Doctor of Philosophy (Integrated Ph.D and Ph.D), Master of Science by Research Programs 2025 Departments: Computer Science, Data Science and Artificial Intelligence, Digital Humanities, Networking, Communications and Signal Processing, Software Engineering, VLSI Embedded System. Eligibility: Engineering degree (BE, B.Tech or equivalent), UG, PG as per the program. Application fee: Rs.1000. Online application deadline: 18-06-2024. Website:https://www.iiitb.ac.in/

Current Affairs

భెల్‌ ఆదాయం రూ.27,350 కోట్లు

ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.27,350 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం నమోదు చేసిన ఆదాయంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ.92,534 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి భెల్‌ మొత్తం ఆర్డర్‌ బుక్‌ రూ.1,95,922 కోట్లకు చేరింది.

Current Affairs

అర్జున్‌కు రజతం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌  షూటింగ్‌లో పారిస్‌ ఒలింపియన్‌ అర్జున్‌ బబుతా రజత పతకం సాధించాడు. 2025, ఏప్రిల్‌ 20న లిమా (పెరూ)లో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో అతడు 252.3 పాయింట్లు స్కోరు చేశాడు. కేవలం 0.1 పాయింట్‌ తేడాతో బంగారు పతకానికి దూరమయ్యాడు.  ఒలింపిక్‌ ఛాంపియన్‌ షెంగ్‌ లిహావో (252.4- చైనా) స్వర్ణం గెలుచుకున్నాడు. 

Current Affairs

భారత్‌లో పురుషులు, మహిళలు-2024 నివేదిక

2021-22లో దేశంలోని అన్నిరకాల పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో మొత్తం 51.19 లక్షలమంది చేరగా.. వారిలో 28.36 లక్షలమందికి పైగా అమ్మాయిలున్నారు. వీరికన్నా అబ్బాయిల సంఖ్య దాదాపు 6 లక్షలు తక్కువ. ఈ విషయాలు కేంద్ర గణాంకాలశాఖ విడుదల చేసిన ‘భారత్‌లో పురుషులు, మహిళలు-2024’ నివేదికలో ఉన్నాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ నివేదికలోని ప్రధానాంశాలు.. అబ్బాయిలు ఎక్కువగా డిగ్రీతోనే చదువు ఆపేస్తుండగా అమ్మాయిలు అంతకుమించి ముందుకెళుతున్నారు. అలాగే ఎంఫిల్‌ కోర్సుల్లో మొత్తం 9,517 మంది చేరితే వీరిలోనూ అమ్మాయిలే (6,125) అధికం. వైద్యకోర్సుల్లోనూ అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎక్కువగా ప్రవేశాలు పొందారు. 2021-22లో దేశంలో మొత్తం అల్లోపతి, హోమియో, ఆయుర్వేదం, నర్సింగ్‌ తదితర వైద్యశాస్త్రాల కోర్సుల్లో 17.05 లక్షల మంది చేరగా వీరిలో 9.83 లక్షల మందికిపైగా అమ్మాయిలే. వీరికన్నా అబ్బాయిలు 2.60 లక్షలు తక్కువ. అయితే గైనకాలజీ పీజీ కోర్సులో 404 మంది చేరితే వారిలో 220 మంది అబ్బాయిలే ఉండటం గమనార్హం. 

Current Affairs

యునెస్కో నివేదిక

ప్రపంచంలో 60 శాతం దేశాల్లో మాత్రమే పాఠశాలల్లో అందించే ఆహారం, పానీయాలను నియంత్రించే, పర్యవేక్షించే చట్టాలు ఉన్నాయని యునెస్కో నివేదిక వెల్లడించింది. గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక రూపకల్పనలో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ తదితర సంస్థలు పాలుపంచుకున్నాయి.  ఈ అధ్యయనం ప్రకారం.. 187 దేశాల్లో 93 దేశాల్లోనే పాఠశాలల్లో ఏ ఆహారాన్ని లేదా పానీయాన్ని అనుమతించాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ 93 దేశాల్లో 29 శాతం దేశాలు మాత్రమే పాఠశాలల్లో ఆహార పదార్థాల మార్కెటింగ్‌ను నియంత్రిస్తున్నాయి. 30 అల్ప, మధ్యాదాయ దేశాల్లో పౌష్టికాహార విద్యను ప్రాజెక్టులు, ఇతర మార్గాల్లోనే బోధిస్తున్నారని.. ప్రధాన సబ్జెక్టుగా కరిక్యులంలో పెట్టడం లేదని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.

Current Affairs

Bharat Heavy Electricals Ltd (BHEL)

♦ Bharat Heavy Electricals Ltd (BHEL) registered a revenue of Rs.27,350 crore for FY 2024–25, marking a robust growth of around 19 percent over the previous year (2023-24). ♦ The company also secured its highest-ever order inflows during the year, amounting to Rs.92,534 crore. ♦ With this, BHEL's total order book at the end of FY 2024–25 stood at Rs.1,95,922 crore.

Current Affairs

South Eastern Coalfields Limited (SECL)

♦ South Eastern Coalfields Limited (SECL) became the first coal PSU to implement paste fill technology for underground coal mining. ♦ To implement this innovative underground mining technology, SECL has signed a Rs.7040 crore agreement with TMC Mineral Resources Private Limited. ♦ Under this agreement, large-scale coal production will be undertaken using paste fill technology in the Singhali underground coal mine located in SECL’s Korba area. Over a period of 25 years, the project is expected to produce approximately 8.4 million tonnes (84.5 lakh tonnes) of coal. ♦ What is Paste Fill Technology? ♦ Paste filling is a modern underground mining method that eliminates the need to acquire surface land. After coal extraction, the mined-out voids are filled with a specially prepared paste made from fly ash, crushed overburden from opencast mines, cement, water, and binding chemicals. This process prevents land subsidence and ensures the structural stability of the mine.

Current Affairs

Global Education Monitoring (GEM) Report by UNESCO

♦ According to the Global Education Monitoring (GEM) Report by UNESCO, only 60 percent of countries have legislations and standards governing food and beverages in schools. ♦ The report was published in partnership with the Research Consortium for School Health and Nutrition led by the London School of Hygiene and Tropical Medicine, which is the research initiative of the School Meals Coalition. Highlights: ♦ Only 93 out of 187 countries have legislation, compulsory standards or guidance on school food and beverages. ♦ However, only 29 percent of these 93 countries had measures restricting food and beverage marketing in schools and only 60 percent have standards governing food and beverages. ♦ only three of 28 countries were assessments regularly conducted and used. ♦ The assessment information included changes in attitudes and perceptions about food and nutrition, knowledge, food practice, nutritional status, habits and diets.

Current Affairs

Arjun Babuta

♦ India’s Arjun Babuta won the silver medal in the men’s 10m air rifle event at the ISSF World Cup 2025 Lima in Peru on 20 April 2025. ♦ He narrowly missed out on his second ISSF World Cup gold medal after finishing with a score of 252.3 in the final, just 0.1 points behind reigning Olympic champion Sheng Lihao of the People’s Republic of China. ♦ Hungary’s Istvan Marton Peni finished with 229.8 and the bronze medal.

Government Jobs

ఏపీ డీఎస్సీ 2025

మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్‌ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బధిర, అంధుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్‌ స్థాయిల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు:  16,347 (జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు). వివరాలు: అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్‌ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు రెండు కలిపి 14,088 పోస్టులున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259. జోన్‌-1లో 400, జోన్‌-2లో 348, జోన్‌-3లో 570, జోన్‌-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉండగా.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881,  జువెనైల్‌ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. జువెనైల్‌ సంక్షేమ విభాగం పాఠశాలల్లో ఖాళీలు: 15 (ఎస్జీటీ- 13; పీఈటీ- 02) జోన్ల వారీగా ఖాళీలు: 2,228 (ప్రిన్సిపల్‌- 52; పీజీటీ-273; టీజీటీ- 1,718; పీడీ- 13; పీఈటీ- 172) దివ్యాంగుల పాఠశాలల్లో ఖాళీలు: 31 (బధిరుల పాఠశాల- 11; అంధుల పాఠశాల- 20) జిల్లా స్థాయి పోస్టులు:  13,192 (ఎస్‌ఏ భాష-1: 534; ఎస్‌ఏ పీఈటీ- 1,664; ఎస్జీటీ- 5,985; ఇతర సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టులు 5,009) గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు(జిల్లా స్థాయి)- 881 (ఎస్‌ఏ పీఈటీ- 06; ఎస్జీటీ- 601; ఇతర సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టులు- 274) అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, బీఎడ్‌, డీఎడ్‌, డీఈఈడీ, ఏపీటెట్‌/సీటెట్‌లో ఉత్తీర్ణత ఉండాలి. పరీక్ష విధానం:  ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్‌-1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌-2 మార్కులు లెక్కిస్తారు. ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వెయిటేజీ 20 శాతం ఉంటుంది. వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 44 సంవత్సరాలు; ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 49 ఏళ్లు; దివ్యాంగులకు 54 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు: ఒక్కో పోస్టుకు రూ.750. డీఎస్సీ2024 లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు.   ముఖ్యమైన తేదీలు:  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2025. పరీక్ష తేదీలు: 06.06.2025 నుంచి 06.07.2025. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: 30.05.2025. ప్రాథమిక కీ విడుదల: చివరి పరీక్ష తర్వాత 2వ రోజు కీపై అభ్యంతరాలు: ప్రారంభ కీ నుండి 7 రోజులలోపు తుది కీ విడుదల: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత  మెరిట్‌ జాబితా విడుదల: ఫైనల్‌ కీ తర్వాత ఏడు రోజులకు  Website:https://apdsc.apcfss.in/