Posts

Government Jobs

టీఐఎస్‌ఎస్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఐఎస్‌ఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు:  1. ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌: 01 2. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌: 03  3. అడ్మిన్‌-కమ్‌-ఫైనాన్స్‌ ఆఫీసర్‌: 01 4. ఇంటర్న్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఎంఏ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం, టెక్నికల్‌ నైపుణ్యాలు, ఇంగ్లిష్‌, హిందీ లాంగ్వేజ్‌ పరిజ్ఞానం ఉండాలి. జీతం: ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌కు రూ.60,000- రూ.65,000; ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌కు రూ.45,000- రూ.50,000; అడ్మిన్‌ కమ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌కు రూ.35,500- రూ.40,000; ఇంటర్న్‌కు రూ.15,000. పని ప్రదేశం: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 28.04.2025. ఇంటర్వ్యూ తేదీ: 30.04.2025. Website: https://tiss.ac.in/

Government Jobs

ఎస్‌ఐడీబీఐలో మేనేజర్‌ పోస్టులు

స్మాల్ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. అసోసియేట్‌ మేనేజర్‌-ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ సేఫ్‌ గార్డ్‌: 01 2. అసోసియేట్ మేనేజర్‌- మానిటరింగ్‌ అండ్ ఎవల్యూషన్‌: 01 3. అసోసియేట్‌ మేనేజర్‌-ఎనర్జీ: 02 4. అసోసియేట్‌ మేనేజర్‌: క్లైమేట్ చేంజ్‌: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, మాస్టర్స్‌ డిగ్రీ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.1,00,000 - రూ.2,50,000. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా gcfv@sidbi.in,  neerajverma@sidbi.in ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 14 మే 2025 Website: https://www.sidbi.in/en/careers/careerdetails/Hiring_of_Specialized_Resource_Persons_on_contract_basis_Full_time_in_Green_Climate_Finance_Vertical_GCFV_SIDBI_23_04_2025

Government Jobs

ఎన్‌ఐఈపీఎండీలో కన్సల్టెంట్‌ పోస్టులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 04 2. సీనియర్‌ కన్సల్టెంట్‌: 03 3. సూపర్‌వైజర్‌: 01 4. అకౌంటెంట్‌: 01 5. రిహబిలిటేషన్‌ ఆఫీసర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ, పీజీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.75,000; సీనియర్‌ కన్సల్టెంట్‌కు రూ.60,000; సూపర్‌వైజర్‌కు రూ.35,000; అకౌంటెంట్‌కు రూ.45,000; రిహబిలిటేషన్‌ ఆఫీసర్‌ రూ.50,000. వయోపరిమితి: 56 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.590; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.5.2025 Website: https://www.niepmd.tn.nic.in/ Apply online: http://https//niepmd.com/career/index.php

Government Jobs

ఎండీఐలో నాన్‌ అకాడమిక్‌ పోస్టులు

గుడ్‌గావ్‌లోని మేనేజ్‌మెంట్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎండీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది నాన్‌ అకాడమిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: 1. టెక్నికల్‌ ఆఫీసర్‌ ఈఆర్‌పీ- 01 2. అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌- 02 3. జూనియర్‌ లైబ్రరీ అసిస్టెంట్‌- 01 విభాగాలు: డిజిటలైజేషన్‌, గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌, అడ్మినిస్ట్రేషన్‌, లైబ్రరీ. అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో ఎంసీఏ/ బీఈ/ బీటెక్‌, బీబీఏ/ బీసీఏ/ బీకాం, బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: చివరి తేదీ నాటికి టెక్నికల్‌ ఆఫీసర్‌ ఈఆర్‌పీకు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.  జీతం: టెక్నికల్‌ ఆఫీసర్‌ ఈఆర్‌పీకు 56,100- రూ.1,77,500; ఇతర పోస్టులకు 35,400-రూ.1,12,400. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, మేనేజ్‌మెంట్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ పోస్ట్‌ బాక్స్‌ నెం.60, సుక్రాలీ, గుడ్‌గావ్‌, హరియాణా. ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 07-05-2025. Website: https://www.mdi.ac.in/

Current Affairs

6.2 percent for the financial year 2025-26 (FY26).

♦ The World Bank lowered India’s growth forecast for the current fiscal (2025-26) by 4 percentage points to 6.3% amid global economic weakness and policy uncertainty on 23 April 2025. ♦ In its previous estimate, the World Bank had projected India’s growth at 6.7% for the fiscal year 2025-26. ♦ The IMF revised its projection downward to 6.2 percent for the financial year 2025-26 (FY26).  ♦ The RBI too recently cut India’s growth forecast to 6.5 percent from 6.7 percent estimated earlier.

Current Affairs

Koneru Humpy

♦ Indian Grandmaster Koneru Humpy clinched the FIDE Women’s Grand Prix 2024-25 (Pune leg) title on 23 April 2025. ♦ She won the final round with White pieces against Bulgarian International Master Nurgyul Salimova by a score of 7/9 points. ♦ Chinese Grandmaster Zhu Jiner also won her final round game against Russian International Master Polina Shuvalova with the Black pieces, and scored 7/9 points. But she was placed 2nd as per tiebreaks.  ♦ However, The Grand Prix points and prize money will be shared between Humpy and Zhu. ♦ With this win, Humpy’s qualification chances to the next Women’s Candidates Chess tournament has greatly increased.  ♦ Moreover, India’s International Master Divya Deshmukh played a draw against Polish Chess player Alina Kashlinskaya and finished 3rd in the rankings with 5.5/9 points.

Current Affairs

ప్రపంచ పుస్తక - కాపీరైట్‌ దినోత్సవం

ప్రపంచ పుస్తక - కాపీరైట్‌ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‌ 23న నిర్వహిస్తారు. దీన్నే ప్రపంచ పుస్తక దినోత్సవం అని కూడా అంటారు. రచయితలను గౌరవించడంతోపాటు ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి రేకెత్తించడం, సాహిత్యం పట్ల అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  మనిషి జీవనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో పుస్తక పఠనం ఒకటి. గత సంఘటనలు, స్మృతులను తర్వాతి తరాలకు అందించడంతోపాటు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో, సాహిత్యాభివృద్ధిలో పుస్తకాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. రచనలపై సంబంధిత రచయితకు పరిమిత సమయం వరకు ఉండే హక్కే కాపీ రైట్‌.  చారిత్రక నేపథ్యం ఎంతోమంది ప్రముఖ సాహిత్యవేత్తలు, రచయితలు ఏప్రిల్‌ 23న జన్మించారు, మరణించారు. మాన్యుయెల్‌ మొజియా వల్లెజో, విలియం షేక్‌స్పియర్‌ (జననం - మరణం ఒకేరోజు) హాల్డోర్‌ లాక్స్‌నెస్, మారిస్‌ డ్రూన్‌ లాంటివారు ఈ రోజు జన్మించగా.. జోసెఫ్‌ ప్లా, ఇంకా గార్సిలాసో వేగా, మిగ్యుల్‌ డి సర్వంటెస్‌ ఇదే తేదీన మరణించారు. వీరందరి జ్ఞాపకార్థం యునెస్కో జనరల్‌ అసెంబ్లీ ఏటా ఏప్రిల్‌ 23ను ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’గా జరపాలని 1995లో తీర్మానించింది. 

Current Affairs

భారత వృద్ధి 6.3 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి అంచనాను 6.3 శాతానికి ప్రపంచ బ్యాంక్‌ తగ్గించింది. అంతర్జాతీయ ఆర్థిక బలహీనతలు, విధాన అనిశ్చితులు ఇందుకు కారణమని తెలిపింది. ఇంతకు ముందు భారత వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండొచ్చని బ్యాంక్‌ అంచనా వేసింది. ప్రైవేట్‌ పెట్టుబడులు నెమ్మదించడం, ప్రభుత్వ వ్యయాలు లక్ష్యాలను చేరుకోకపోవడంతో 2024-25లో వృద్ధి నిరుత్సాహపరిచిందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. 2024-25లో భారత్‌ 6.5% వృద్ధిని సాధించినట్లు తెలిపింది.

Current Affairs

గ్రాండ్‌ ప్రి టైటిల్‌

భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను గెలుచుకుంది. 2025, ఏప్రిల్‌ 23న జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో సలిమోవా (బల్గేరియా)పై గెలిచి ఆమె ఏడు పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. పోలినా (రష్యా)ను ఓడించిన జు జినర్‌ (చైనా) కూడా ఏడు పాయింట్లతో నిలిచింది. కానీ మెరుగైన టైబ్రేక్స్‌ స్కోరు ఆధారంగా హంపి విజేతగా నిలిచింది. కష్లిన్‌స్కయా (పోలెండ్‌)తో గేమ్‌ను డ్రాగా ముగించిన దివ్య దేశ్‌ముఖ్‌ (5.5) మూడో స్థానం సాధించింది. బత్‌కుయాగ్‌ (మంగోలియా)తో గేమ్‌ను హారిక (4.5), సలోమ్‌ మెలియా (జార్జియా)తో గేమ్‌ను వైశాలి (4) డ్రాగా ముగించారు. 

Current Affairs

మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయం పరిశోధన

భారతదేశంలో 80 శాతం నదీ ప్రవాహాలు యాంటీబయాటిక్స్‌తో కలుషితమై పర్యావరణ, ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. భారత్‌తోపాటు పాకిస్థాన్, వియత్నాం, ఇథియోపియా, నైజీరియాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఈ పరిశోధనను కెనడాలోని మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయం నిర్వహించింది. బ్యాక్టీరియా కలిగించే వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్‌ మందులను వాడతారు. ఇవి పూర్తిగా మానవ దేహంలో కలిసిపోవు. బ్యాక్టీరియాను నిర్మూలించిన తరవాత యాంటీబయాటిక్‌ అవశేషాలు కాలేయం, మూత్రపిండాల ద్వారా బయటకు విసర్జితమవుతాయి. మురుగు నీటి శుద్ధి కర్మాగారాలు కూడా వీటిని పూర్తిగా నిర్మూలించలేవు.  నదుల్లో కలిసిపోయిన యాంటీబయాటిక్‌ వ్యర్థాలు 31.5 కోట్లమంది భారతీయులపై దుష్పభ్రావం చూపిస్తూ ఉండవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది.  2000తో పోలిస్తే 2015నాటికి యాంటీబయాటిక్స్‌ వాడకం 65 శాతం పెరిగిందని  గతంలో జరిగిన అధ్యయనాలు అంచనా వేశాయి.